indian salmon fish in telugu and uses
భారత దేశ ప్రజలు చేపల ఆహారాన్ని ఎంతగానో ఇష్టపడతారు ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, ప్రోటీన్లు కారణంగా భారతదేశంలో చేపల ( indian salmon fish in telugu)ఆహారానికి ఎంతో ఎక్కువగా డిమాండ్ ఉందని చెప్పవచ్చు.
సాల్మన్ చేప ఉత్తర అమెరికా ఖండానికి చెందినది, అందులో కూడా అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రా లకు వాటిలో కలిసేటువంటి నదులకు సంబంధించిన చేప గా మనం సాల్మన్ చేపను చెప్పవచ్చు. అట్లాంటిక్ మహాసముద్రంలో అట్లాంటిక్ సాల్మన్ గా పిలువబడుతున్నప్పటికీ పసిఫిక్ మహాసముద్రంలో మాత్రం, చినూక్, చమ్,కోహో, పింక్ మరియు సాహీ అనే పేర్లతో పసిఫిక్ మహా సముద్రం లో సాల్మన్ చేపలు పిలువబడుతున్నాయి.
నిజానికి సాల్మన్ చేపలు భారతదేశానికి సంబంధించినవి కావు వాటి యొక్క మూల కేంద్రం ఉత్తర అమెరికా ఖండం ప్రాంతంలోనే ఉన్నదని చెప్పవచ్చ. భారత దేశంలో కానీ ఇతర దేశాలలో కానీ సాల్మన్ చేపలుకు ఒక విశిష్టత ఉన్నది. అది ఏమిటి అనగా అవి నదులకు ఎదురీదుతూ నదులలోని రాళ్ళ మధ్య గుడ్లను పెట్టి అక్కడే పొదుగుతాయి. సాల్మన్ చేపలు నదులకు ఎదురీదే టప్పుడు సరైన నాయకత్వం లేకపోవడం వలన దారి మధ్యలో కాచుకుని ఉండే ఎలుగుబంట్ల వలన చాలా వరకూ అవి చనిపోతాయి. అయితే నదులలో చేప పిల్లలు పది నుండి ఇరవై ఐదు సెంటీమీటర్లు పెరిగిన తరువాత సముద్రంలో ఈదడానికి సామర్థ్యం వచ్చినప్పుడు తిరిగి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. భారతదేశంలో సాల్మన్ చేపలను వివిధ భాషలలో ఏ విధంగా పిలుస్తారు ముందుగా తెలుసుకుని ఆ తర్వాత సాల్మన్ చేపలు యొక్క ప్రయోజనాల గురించి మనం వివరంగా తెలుసుకుందాము.
Indian salmon fish in telugu names
తమిళం:
తమిళంలో సాల్మన్ చేపలను కీలంగాన్ అని పిలుస్తారు ఇంకా మరికొన్ని పేర్లతో పిలుస్తారు వాటిని క్రింది విధంగా చూడండి
- పెరు వంజరం
- కిలంగాన్
- కాలా
- తెరవాలై
- పొజ కాడ
- శీన కాల
- భారతీయ థ్రెడ్ ఫిన్
తమిళనాడులో ఈ చేపలను వాణిజ్య పంటగా చెరువులు మరియు ట్యాంకుల్లో కూడా పెంచుతున్నారు.
తెలుగు:సాల్మన్ చేపలను మెగా లేదా బుడత మేఘ అని పిలుస్తున్నారుఅంతే కాకుండ
- సందువ
- పండుగప్ప
- అనే పేర్లతో కూడా పిలుస్తున్నారు సాల్మన్ చేప భారత దేశానికి చెందినది కానప్పటికీ అదే జాతికి చెందిన సాల్మన్ చేపలు భారతదేశంలో కనిపించినప్పుడు వాటిని indian salmon fish అని పిలుస్తున్నారు.
హిందీ:
హిందీలో సాల్మన్ చేపలను rawas ఫిష్ అని పిలుస్తున్నారు. సాల్మన్ ఫిష్ భారతదేశపు చేప కానందువలన దీనిని సాధారణంగా ఆంగ్లంలోనే సాల్మన్ ఫిష్ అని కూడా పిలుస్తున్నారు.
rawas
భారతీయ సాల్మన్ ఫిష్( Indian Salmon fish in telugu)
మరాఠీ:
మరాఠీ భాషలో కూడా హిందీలో పిలిచినట్లు గానే సాల్మన్ చేపలును rawas మాస అని పిలుస్తారు.
- రవాస్
- rawas మాస
- సమానమాసే
కన్నడం:
కన్నడంలో సాల్మన్ చేపలను కొడువై లేదా rawas అని కూడా పిలుస్తున్నారు. కర్ణాటక మరియు బెంగళూరు పరిసర ప్రాంతాలలో సాల్మన్ చేపలును క్రింది వివిధ రకాలుగా స్థానికంగా పిలుస్తున్నారు
- కొలువై
- గెలిగిరువా
- రావ
- దరహ
- రాములు
- వామీను
- బలిమీను
మలయాళం
మలయాళంలో సాల్మన్ చేపలు కోర లేదా కాలమిన్ అని పిలుస్తున్నారు ఇది భారత దేశంలో ఉండే సాల్మన్ చేపలు ఒక ఉదాహరణ.
కేరళ
భారతదేశంలోని కేరళలో సాల్మన్ చూపులను వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలుస్తున్నారు
- వా మీన్
- కోర
- కాల
- తంతి
- వజ్మీన్
ఒడియా
ఒడియా లో సాల్మన్ చేపలను సహాల్ పూరి లేదా సహాలో అని పిలుస్తున్నారు. ఇంకా స్థానికంగా క్రింది పేర్లతో కూడా పిలుస్తున్నారు
- హారద్ కై
- సలహాల్ పూరి లేదా సహాలో
- బలిహ
- మాంగ
అట్లాంటిక్ లో కనిపించే సాల్మన్ చేపలు ఒడియాలో నిర్దిష్టమైన పేరు లేదు ఈ పేర్లను భారత దేశంలోని భారత సాల్మన్ ఫిష్లకు కొన్ని ఉదాహరణలుగా చెప్పవచ్చు.
బెంగాలీ
బెంగాలీలో సాల్మన్ చేపలను గుర్ జాలి చేపలు అంటారు
- శ్యామన్న మాచ
- గురు జలి మచ్చ
- సహాల్
అట్లాంటిక్ లో ఉండే సాల్మన్ చేపల కు బెంగాలీలో నిర్దిష్టమైన పేర్లు లేనందున పై పేర్లు అన్నిటిని కూడా ఇండియన్ సాల్మన్ ఫిష్కు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
తుళు
తుళు భాషలో సాల్మన్ చేపలను క్రింది పేర్లు గా పిలుస్తున్నారు.
- రవాస్
- కాలా
- ramas
భారతీయ సాల్మన్ ఫిష్ (Indian Salmon fish in telugu) యొక్క ఆరోగ్యప్రయోజనాలు.
1)సాల్మన్ చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నివారించడం లో ఎంతో ఉపయోగపడుతుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మరియు గుండె జబ్బులు రాకుండా నివారించగలుగుతుంది.
2) సాల్మన్ ఫిష్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రోటీన్లు శరీర ఆరోగ్యానికి, శరీర ఎదుగుదలకు, కండ పుష్టికి ఎంతగానో ఉపయోగపడతాయి. 100 గ్రాముల సాల్మన్ ఫిష్ లో 20 గ్రాముల ప్రోటీన్ మనకు లభిస్తుంది 14 సంవత్సరాల నుండి పైబడిన ఆడవారికి రోజుకు 46 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
3) సాల్మన్ ఫిష్ లో బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి అనగాB1,B2,B3,B5,B6,B9
4) సాల్మన్ ఫిష్ లో పొటాషియం ,సెలీనియం యాంటీ యాక్సిడెంట్స్, ఆస్టాక్క్ష్యం తిన్ పుష్కలంగా ఉంటాయి.
5) సాల్మన్ చేపలలో విటమిన్A మనకు పుష్కలంగా లభిస్తుంది. మనకు విటమిన్ ఏ తక్కువగా ఉన్నట్లయితే మనం సాల్మన్ ఫిష్ ను ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమమైన పని. విటమిన్ డి ఏ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా పునరుత్పత్తికి అదేవిధంగా కంటిచూపు కు ఎంతగానో దోహదం చేస్తుంది.
6) సాల్మన్ చేపలలో విటమిన్ డీ కూడా మనకు లభిస్తుంది. సాధారణంగా vitamin d సూర్యకాంతి ద్వారానే మనకు లభిస్తుంది. అయితే ఆహార పదార్థాల లో విటమిన్-డి మనకు దొరకడం చాలా అరుదు. కాబట్టి ఈ విటమిన్ డి అనేది మన ఎముకలు కాల్షియంను గ్రహించి దృఢంగా మారాలంటే దానికి విటమిన్ డి ఎంతో అవసరం కాబట్టి విటమిన్ డి ద్వారా మన ఎముకలను బలపరుచుకోవచ్చు. ఇన్ని విశిష్ట ప్రయోజనాలు ఉన్న సాల్మన్ చేపలు తిని ఆరోగ్యంగా ఉందాం. సాల్మన్ చేపలు ఏ మోతాదులో తింటే మంచిదో మన వైద్యులను అడిగి తెలుసుకుందాం.