Salmon fish in telugu and salmon fish uses in telugu 

salmon fish in telugu and salmon fish uses in telugu

సాల్మన్ చేపలు(salmon fish in telugu)

పసిఫిక్ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహా సముద్రం మరియు వాటిలో కలిసే నదులలో ఎక్కువగా కనిపిస్తాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో సాల్మో సలార్ అనే ఒకే రకానికి చెందిన అట్లాంటిక్ సాల్మన్ మాత్రమే ఉంటుంది. అయితే పసిఫిక్ మహాసముద్రంలో పింక్, చుమ్ము, saki, koho, chinuk మరియు amago వంటి రకాలు ఉన్నాయి. సాల్మన్ చేపలు నదుల లోకి వచ్చి గుడ్లు పెట్టి ఆ గుడ్లను నదిలో ఉండే చిన్న చిన్న రాళ్ళు కింద చేర్చుతాయి. తద్వారా నదుల నుండి వచ్చే చెత్తాచెదారం ఈల్ చేపలు వంటి వాటి నుండి రక్షణ కలుగుతుంది. వీటి గుడ్లు నారింజ రంగులో బఠాని గింజంత సైజులో ఉంటాయి. ఈ గుడ్లలో మనకి చేపల కళ్ళు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. గుడ్లు పొదిగిన తర్వాత మనకు కనిపించే చిన్న పిల్లలను అలెవిన్ అంటారు. వాటికి కి నీటిలో స్వేచ్ఛగా ఈత కొట్టే సామర్థ్యం వచ్చినట్లయితే ఈ దశలో వాటిని ఫ్రై అంటారు. ఫ్రై దశలో పది నుండి ఇరవై ఐదు సెంటీమీటర్లు పెరిగిన తరువాత సముద్రంలో జీవించడానికి అవసరమైన సామర్థ్యం ఏర్పడుతుంది కాబట్టి అవి నదులని విడిచి పెడతాయి.

సాధారణంగా చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని బయటకు పంపించి మంచి కొలెస్ట్రాల్ శరీరంలో అభివృద్ధి చెందే విధంగా సహాయం చేస్తాయి. దీని ఫలితంగా శరీరంలో ఎక్కువగా క్రోవ్వు పేరుకొని పోకుండా ఉంటుంది, కాబట్టి గుండె సంబంధమైన వ్యాధులు దాదాపుగా మన దరికి చేరవు అని చెప్పవచ్చు.

salmon fish in telugu name

సాల్మన్ చేపలను(salmon fish in telugu) మన తెలుగులో మేఘ చేపలు లేదా బుడత మెగా చేపలు అని కూడా కొన్ని ప్రదేశాలలో పిలుస్తున్నారు. కానీ సాల్మన్ చేపలకు లోకల్ గా ఎటువంటి పేరు తెలుగులో లేదు.

 

salmon fish uses in telugu

అయితే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే సముద్రపు చేపలు అయిన సాల్మన్ చేపలుతీసుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితం ఉంటుందనిశాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యానికి అంతగాప్రయోజనం ఇవ్వని ఇతర మాంసాహారాన్ని తినడంకంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండేసాల్మన్ చేపలు తిన్నట్లయితే మనకి ఎంతోప్రయోజనం ఉంటుందని శాస్త్ర అధ్యయనాలుతెలియజేస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచంలో ఏటా అనేకమంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు,అందుకు అనేక రకాలైన కారణాలు ఉండవచ్చుఅయితే హార్ట్ఎటాక్ లాంటి గుండెజబ్బులు రావడానికప్రధాన కారణం రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం.దీని ఫలితంగా గుండెకు రక్త సరఫరా సరిగా జరగదు,ఇటువంటి గుండెజబ్బులు రాకుండా సాల్మన్ చేపలులాంటివి తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులుతెలియజేస్తున్నారు. సాల్మన్ చేపల్లో ఉండే ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్స్ రక్తం లో ఉండే చెడు కొలెస్ట్రాల్నుతగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచు తాయి.

సాల్మన్ చేపలు(salmon fish in telugu) వలన గుండె సంబంధమైన వ్యాధులను అరికట్టి, గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అధిక బరువుతో బాధపడే వారు బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంది అని వైద్యులు తెలియజేస్తున్నారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాల్మన్ చేపలు లో ఉండటం వలన అధిక రక్తపోటు నుండి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంది అని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైన క్రొవ్వును కరిగించేస్తుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ చాలావరకు తగ్గిస్తాయి. అంతేకాకుండా గుండెలో మంటను తగ్గిస్తాయి గుండె కండరాలు ఆరోగ్యంగా పనిచేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా సాచ్యురేటెడ్ కొవ్వు ను తగ్గించడంలో సాల్మన్ చేప బాగా ఉపయోగపడుతుంది. సాల్మన్ చేపల లో ప్రోటీన్ కంటెంట్ ఇతర చేపలతో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.

మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్, ఖనిజ లవణాలు కూడా సాల్మన్ చేపలు పుష్కలంగా ఉన్నాయి. వీటివలన కీళ్లు కళ్ళు కండరాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

కొంతమందికి సాధారణంగా మతిమరుపు ఉంటుంది, అటువంటి వారు సాల్మన్ చేపలు లాంటివి తిన్నట్లయితే వారి మెదడుకు అది ఒక మేతగా పనిచేస్తుంది. చర్మం నిగ నిగ మెరవాలంటే సాల్మన్ చేపలు తినాలని డెర్మటాలజిస్ట్ తెలియజేస్తున్నారు.

 

ప్రోటీన్:

 • USDA ప్రకారం100 గ్రాముల సాల్మన్ చేప 20 గ్రాముల ప్రోటీన్ ని అందిస్తుంది.
 • 14 సంవత్సరాలు మరియు అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆడవారికి రోజుకి నలభై ఆరు గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది.
 • శరీరానికి ప్రోటీన్లు అవసరం ప్రోటీన్స్ తగ్గినట్లయితే కండ బలం యొక్క శక్తి తగ్గుతుంది.

విటమిన్ ఏ:

 • విటమిన్ A సాల్మన్ చేపల్లో(salmon fish in telugu) పుష్కలంగా ఉంటుంది.
 • మీకు విటమిన్ A తక్కువగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సాల్మన్ చేపలను తీసుకోవలసి ఉంటుంది.
 • విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాకుండా పునరుత్పత్తికి మరియు కంటి చూపు కు ఎంతో మేలు చేస్తుంది.

విటమిన్ డి:

 • సాల్మన్ చేపల లో మనకు విటమిన్ డి కూడా దొరుకుతుంది. విటమిన్ డీ కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతుంది.
 • మనకు విటమిన్-డి సూర్యకాంతి ద్వారానే ఎక్కువగా లభిస్తుంది అయితే ఆహార పదార్థాలలో విటమిన్ డి సాల్మన్ చేపల్లో మాత్రమే లభిస్తుంది.
 • మన ఎముకలు కాల్షియం ను గ్రహించి మన ఎముకలు దృఢంగా ఉండటానికి విటమిన్ డి సహాయపడుతుంది.

విటమిన్ B 12:

సాల్మన్ చేపలలో మనకు విటమిన్ బీ 12 కూడా లభిస్తుంది లోపించినట్లు అయితే మనకు నీరసం బద్ధకం మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

vitamin b3:

 • సాల్మన్ చేపల లో మనకు విటమిన్ B3 కూడా లభిస్తుంది ఈ విటమిన్ మనం తినే ఆహారాన్ని మనకి శక్తిగా మారుస్తుంది
 • అంతేకాకుండా మన కణాల పనితీరును మెరుగు పరచడంలో సహాయపడుతుంది

సెలీనియం

సాల్మన్ చేపలు లో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది .

ఐరన్:

 • సామ్ సాల్మన్ చేపల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
 • ఐరన్ అనేక రకాలైన శరీర ప్రక్రియలు ఎంతో అవసరం ఐరన్ ఊపిరితిత్తుల నుండి అనేక కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో సహాయపడుతుంది.

salmon fish in telugu price,

సాల్మన్ చేపలు యొక్క ధర సుమారుగా kg 450 రూపాయల నుండి 1250. లోపు ఉండవచ్చు అన్ని ప్రదేశాలలో కలిపి ఈ విధంగా సాల్మన్ చేపలు తినడం వలన ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కీళ్ళ నొప్పులకు కూడా సాల్మన్ చేపలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మోకాళ్ళ అరిగిపోయిన అప్పుడు కార్టిలేజ్ దెబ్బతింటుంది. ఈ మెత్తని కణజాలం అభివృద్ధి చెందడం చాలా అరుదు అయితే సాల్మన్ చేపలు తినడం వలన ఈ కణజాలం అభివృద్ధి చెందుతుందని ఒక అధ్యయనంలో తేలింది. సాల్మన్ చేపలు ఏవిధంగా ఉపయోగిస్తేే ఆరోగ్యానికి మంచిదో మన వైద్యులను అడిగి తెలుసుకోవాలి.

error: Content is protected !!
Scroll to Top