Simple Past Tense Overview     

Main Meaning: గతంలో ఒక సమయంలో  జరిగిపోయిన విషయాలను తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ను  ఉపయోగిస్తారు.  ఈరోజు 5  నిమిషాల క్రితం, 10 నిమిషాల క్రితం జరిగిన పని కూడా గతం కిందకే వస్తుంది

Verb2   ఉపయోగించి మాట్లాడడాన్నే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడమంటారు

పాస్ట్ టెన్స్ లో  సింగులర్ మరియు ఫ్లూరల్ అన్ని సబ్జెక్టులకు కూడా He, She, It, I, We, You, They  లకు Verb2  కామన్ ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తారు.

వాక్య నిర్మాణం కింది స్ట్రక్చర్ ప్రకారం ఉంటుంది

Subject + verb2 + object

Verb1 + Did= Verb2 అని కూడా అంటారు . Verb2 లో Did అనే సహాయక క్రియ దాగి ఉంటుంది.

Examples:

Go  + Did = Went.

Ask + Did = Asked.

Talk + Did = Talked.

ఇక్కడ Did అనేది Do యొక్క భూతకాల రూపం.

Do            Did             Done         Doing 

సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో  పాజిటివ్ సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చడానికి అన్ని సబ్జెక్టులకు కూడా  (He, She, It, I, We, You, They  లకు)  Did not ఉపయోగిస్తే సరిపోతుంది.

Example:

He went to office yesterday (PS) (అతను నిన్న ఆఫీస్ కి వెళ్ళినాడు)

పై వాక్యాన్ని He did go to office yesterday  అని కూడా రాయవచ్చు ఎందుకంటే

went= did+go కాబట్టి.

కానీ సాధారణంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడేటప్పుడు verb 2  ని ఎక్కువగా ఉపయోగిస్తారు

కానీ negative sentences రాసేటప్పుడు did  ని  తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది

పై సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చడానికి సబ్జెక్టు He ప్రక్కన Did not ఉంచాలి.

He did not went to office yesterday (NS)

నెగిటివ్ సెంటెన్స్ ని పై విధంగా రాయడం కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే

పై సెంటెన్స్ లో Did మరియు Went  ఈ రెండు కూడా verb2 రూపాలు. ఒక సెంటెన్స్ లో రెండు verb2 లు ఉండడం గ్రామర్ ప్రకారంగా తప్పు అవుతుంది.

Do మరియు Does లు ఉపయోగించినప్పుడు అది ప్రజెంట్ టెన్స్ అని, Did ఉపయోగించినప్పుడు పాస్ట్ టెన్స్ అని అర్థమవుతుంది. కాబట్టి Do, Does,Did లు   వాక్యంలో కాలాన్ని తెలియజేస్తున్నప్పుడు ,Verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి.

Do, Does,Did లు  వాక్యంలో కనిపించినప్పుడు verb ఎల్లపుడూ మొదటి రూపంలోనే వుండాలి. 

కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ ని క్రింది విధంగా రాస్తాము

He did not go to office yesterday (NS) (అతను నిన్న ఆఫీస్ కి వెళ్ళలేదు)

పైన Did  అనే సహాయక్రియను ఉపయోగించాము కాబట్టి went  మొదటి రూపమైన go ఉపయోగించాము

go – went- gone- going.

పైనున్న రెండు వాక్యాలను మరొకసారి కింద రాద్దాము

He went to office yesterday (PS)

He did not go to office yesterday (NS)

పైన వున్న రెండు వాక్యాలను ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు Did ని  He కి ముందు ఉంచితే సరిపోతుంది.

Did he go to office yesterday? (IS)

Did he not go to office yesterday? (NIS)

పై విదంగా verb 2 ఉపయోగించి నిర్మించే సెంటెన్స్ ను Action Sentence అంటారు.

Examples:

1. He opened the door.అతను తలుపు తెరిచాడు.
హీ ఓపెండ్ ద డోర్ 
He did not open the door.అతను తలుపు తీయలేదు.
Did he open the door?అతను తలుపు తెరిచాడా?
Did he not open the door?అతను తలుపు తెరవలేదా?
2.She cleaned the room.ఆమె గది శుభ్రం చేసింది.
షీ క్లీన్డ్ ద రూమ్ 
She did not clean the room.ఆమె గదిని శుభ్రం చేయలేదు.
Did she clean the room?ఆమె గది శుభ్రం చేసిందా?
Did she not clean the room?ఆమె గది శుభ్రం చేయలేదా?
They played football.వాళ్ళు ఫుట్‌బాల్ ఆడారు.
దే ప్లేడ్ ఫుట్‌బాల్ 
They did not play football.వాళ్ళు ఫుట్‌బాల్ ఆడలేదు.
Did they play football?వాళ్ళు ఫుట్‌బాల్ ఆడారా?
Did they not play football?వాళ్ళు ఫుట్‌బాల్ ఆడలేదా?
I watched a movie.నేను ఒక సినిమా చూశాను.
ఐ వాచ్్డ్ ఎ మూవీ 
I did not watch a movie.నేను సినిమా చూడలేదు.
Did I watch a movie?నేను సినిమా చూశానా?
Did I not watch a movie?నేను సినిమా చూడలేదా?
We visited the park.మేము పార్కును సందర్శించాము.
వీ విజిటెడ్ ద పార్క్ 
We did not visit the park.మేము ఆ పార్కును సందర్శించలేదు.
Did we visit the park?మేము పార్కుకి వెళ్ళామా?
Did we not visit the park?మేము ఆ పార్కుని సందర్శించలేదా?
He cooked dinner.అతను రాత్రి భోజనం వండుకున్నాడు.
హీ కుక్ట్ డిన్నర్ 
He did not cook dinner.అతను రాత్రి భోజనం వండలేదు.
Did he cook dinner?అతను రాత్రి భోజనం వండుకున్నాడా?
Did he not cook dinner?అతను రాత్రి భోజనం వండలేదా?
She wrote a letter.ఆమె ఒక ఉత్తరం రాసింది.
షీ రోట్ ఎ లెటర్ 
She did not write a letter.ఆమె ఉత్తరం రాయలేదు.
Did she write a letter?ఆమె ఉత్తరం రాసిందా?
Did she not write a letter?ఆమె ఉత్తరం రాయలేదా?
I called my friend.నేను నా స్నేహితుడికి ఫోన్ చేసాను.
ఐ కాల్డ్ మై ఫ్రెండ్ 
I did not call my friend.నేను నా స్నేహితుడికి ఫోన్ చేయలేదు.
Did I call my friend?నేను నా స్నేహితుడికి ఫోన్ చేసానా?
Did I not call my friend?నేను నా స్నేహితుడికి ఫోన్ చేయలేదా?
They built a house.వాళ్ళు  ఇల్లు కట్టుకున్నారు.
దే బిల్ట్ ఎ హౌస్ 
They did not build a house.వారు ఇల్లు కట్టుకోలేదు.
Did they build a house?వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా?
Did they not build a house?వాళ్ళు ఇల్లు కట్టుకోలేదా?
We finished our work.మేము మా పని పూర్తి చేసాము.
వీ ఫినిష్డ్ అవర్ వర్క్ 
We did not finish our work.మేము మా పనిని పూర్తి చేయలేదు.
Did we finish our work?మేము మా  పని పూర్తి చేసామా?
Did we not finish our work?మేము మా పని పూర్తి చేయలేదా?

 

2.Was, Were :

స్థితిని  తెలియజేసే వాక్యాల నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం.

  1. నేను పోయిన సంవత్సరం విద్యార్థిగా ఉండినాను (పోయిన సంవత్సరం నా స్థితి అది)
  2. నిన్న అతను హైదరాబాదులో ఉండినాడు (నిన్న అతని స్థితి అది)
  3. వారు ఇంతకుముందు ఉద్యోగస్తులుగా ఉండినారు (గతంలో వారి స్థితి ఆది)
  4. మేము నిన్న కాలేజీలో ఉండినాము (నిన్న మా స్థితి అది)

ఈ విధంగా ఈ రోజు కాకుండా గతంలో ఒక సమయంలో సబ్జెక్టు యొక్క స్థితి  తెలియజేయటానికి ఉండినాను, ఉండినాడు, ఉండినారు, ఉండినాము అని వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లో తెలియజేస్తారు. 

I, He, She, It లకు “was”  మరియు We, You, They లకు “were” సహాయక్రియలను ఉపయోగిస్తారు.

Sub + was/were

am, is, are, was, were  లాంటి సహాయక్రియలు సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేస్తాయి. సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేసే వాక్యాలలో object ఉండదు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అయ్యే మరొకరు వ్యక్తి లేదావస్తువు లేదా జంతువు ఉండదు.

 

సాధారణంగా సబ్జెక్టు యొక్క స్థితిని మూడు రకాలుగా తెలియజేస్తారు

  1. సబ్జెక్టుకి Noun జోడించడం
  2. సబ్జెక్టుకి adjective జోడించడం
  3. సబ్జెక్టుకి verb3 ని  adjective గా జోడించడం.

 

I was a student. నేను విద్యార్థిగా ఉండిన్నాను
He was a teacher.  అతను  టీచర్ గా ఉండినాడు
She was a singer.ఆమె గాయకురాలిగా ఉండింది
We were members of the team. మేము టీం సభ్యులుగా ఉండినాము
They were winners.  వారు విజేతలుగా ఉండినారు

పైన రెడ్ కలర్ లో కనిపిస్తున్న వీటిని Noun (పేర్లు) అంటారు ఈ విధంగా సబ్జెక్టుకి కొన్ని పేర్లను జత చేసి గతంలో సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేస్తారు.

 

I was happy. నేను సంతోషంగా ఉండినాను
He was lazy. అతను సోమరిగా ఉండినాడు
She was angry. ఆమె కోపంగా ఉండింది
You were late.  నీవు ఆలస్యంగా ఉండినావు
Ramu was sick. రాము అనారోగ్యంగా ఉండినాడు

  పైన రెడ్ కలర్ లో కనిపిస్తున్న వీటిని adjectives అంటారు.  Adjectives ఎప్పుడు కూడా సబ్జెక్టు యొక్క గుణాన్ని తెలియజేస్తాయి . గుణము అంటే సంతోషంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా, తెలివిగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, ఇలాంటి విషయాలు. ఈ విధంగా సబ్జెక్టుకి కొన్ని adjectives  జత చేసి గతంలో సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేస్తారు.

 

I was tired.నేను అలసిపోయి ఉండిన్నాను.
He was bored.అతను విసుగ్గా ఉండినాడు.
She was excited.ఆమె ఉత్సాహంగా ఉండింది.
We were confused.మేము అయోమయంలో ఉండినాము.
They were worried.వారు ఆందోళనలో ఉండినారు.

పైన రెడ్ కలర్ లో ఉన్నవి  verb3 పదాలు అని మనకు తెలుసు. Verb3  అంటే మనకి తెలిసిన సాధారణ అర్థం పని జరిగిపోయింది.

tired=అలసిపోవడం జరిగింది

was= ఉండెను

I was tired.=నేను అలసిపోయి ఉండిన్నాను.

ఈ విధంగా గతంలో సబ్జెక్టు  యొక్క స్థితిని తెలియజేయడానికి verb3 నీ కొన్ని సందర్భాలలో adjective రూపంలో ఉపయోగిస్తున్నారు.

Subject + beform+ verb3 ఈ రూపంలో ఉండే వాక్యాలు మనకి passive voice లో కూడా ఉంటాయి. అక్కడ ఫై సెంటెన్స్ కి అర్థం క్రింది విధంగా ఉంటుంది

I was tired.నన్ను అలసిపోజేశారు
He was bored. అతనిని విసిగించారు
She was excited. ఆమెని ఉత్సాహపరిచారు
We were confused. మమ్ములను ఆందోళన చేశారు
They were worried. వారిని చింతింపజేశారు

సాధారణంగా Subject + beform+ verb3 ఈ రూపంలో ఉన్న వాక్యాలను సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సందర్భాన్ని బట్టి ఆ సెంటెన్స్ ఏ అర్థంలో ఉపయోగించబడిందో  మనం తెలుసుకోవాలి

Example:

I was at the bus station yesterday(P) (నేను నిన్న బస్ స్టేషన్ వద్ద ఉండిన్నాను)

పై వాక్యమును వ్యతిరేక వాక్యంగా మార్చటకు was ప్రక్కన not ఉంచాలి.

I was not at the bus station yesterday.(N) (నేను నిన్న బస్ స్టేషన్ వద్ద ఉండలేదు)

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చడానికి సబ్జెక్టు ‘I’ ప్రక్కన ఉన్నwas ని మొదటిలో ఉంచితే సరిపోతుంది.

Was I at the bus station yesterday (I)

was I not at the bus station yesterday (NI) 

Examples:

1.He was happy yesterday.అతను నిన్న సంతోషంగా ఉన్నాడు.
హీ వాస్ హ్యాపీ యెస్టర్‌డే. 
He was not happy yesterday.నిన్న అతను సంతోషంగా లేడు.
Was he happy yesterday?నిన్న అతను సంతోషంగా ఉన్నాడా?
Was he not happy yesterday?అతను నిన్న సంతోషంగా లేడా?
2.They were at home last night.వాళ్ళు నిన్న రాత్రి ఇంట్లో ఉన్నారు.
దే వర్ అట్ హోమ్ లాస్ట్ నైట్. 
They were not at home last night.వాళ్ళు నిన్న రాత్రి ఇంట్లో లేరు.
Were they at home last night?వాళ్ళు నిన్న రాత్రి ఇంట్లో ఉన్నారా?
Were they not at home last night?వాళ్ళు నిన్న రాత్రి ఇంట్లో లేరా?
3.I was hungry this morning.ఈ ఉదయం నేను  ఆకలిగా వుండినాను .
ఐ వాస్ హంగ్రీ దిస్ మార్నింగ్. 
I was not hungry this morning.ఈ ఉదయం నేను  ఆకలిగా లేను.
Was I hungry this morning?ఈ ఉదయం నేను ఆకలిగా లేనా?
Was I not hungry this morning?ఈ ఉదయం నేను  ఆకలిగా లేనా?
4.We were late for the meeting.మేము సమావేశానికి ఆలస్యంగా వచ్చాము.(వుండినాము)
వీ వర్ లేట్ ఫర్ ది మీటింగ్. 
We were not late for the meeting.మేము సమావేశానికి ఆలస్యం కాలేదు.
Were we late for the meeting?మేము సమావేశానికి ఆలస్యంగా వచ్చామా?
Were we not late for the meeting?మనం మీటింగ్ కి ఆలస్యంగా రాలేదా?
5.They were friends since childhood.వారు చిన్నప్పటి నుంచి స్నేహితులు గా వుండినారు.
దే వర్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్‌హుడ్. 
They were not friends since childhood.వారు చిన్నప్పటి నుండి స్నేహితులు గా వుండలేదు.
Were they friends since childhood?వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితుల గా వుండినారా?
Were they not friends since childhood?వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు గా వుండలేదా?
6.I was in the library yesterday.నేను నిన్న లైబ్రరీలో ఉన్నాను.
ఐ వాస్ ఇన్ ది లైబ్రరీ యెస్టర్‌డే. 
I was not in the library yesterday.నేను నిన్న లైబ్రరీలో లేను.
Was I in the library yesterday?నేను నిన్న లైబ్రరీలో ఉన్నానా?
Was I not in the library yesterday?నేను నిన్న లైబ్రరీలో లేనా?
7.We were excited about the trip.మేము ప్రయాణం గురించి ఉత్సాహంగా వుండినాము 
వీ వర్ ఎక్సైటెడ్ అబౌట్ ది ట్రిప్. 
We were not excited about the trip.మేము ప్రయాణం గురించి ఉత్సాహంగా వుండలేదు 
Were we excited about the trip?మేము ప్రయాణం గురించి ఉత్సాహంగా వుండినామ ?
Were we not excited about the trip?మేము ప్రయాణం గురించి ఉత్సాహంగా వుండలేదా?
8. I was happy yesterday.నేను నిన్న సంతోషంగా ఉండినాను.
ఐ వాస్ హ్యాపీ యెస్టర్‌డే 
I was not happy yesterday.నేను నిన్న సంతోషంగా  ఉండలేదు.
Was I happy yesterday?నేను నిన్న సంతోషంగా ఉండినాన.?
Was I not happy yesterday?నేను నిన్న సంతోషంగా ఉండ లేదా.?
  
9.I was at home last night.నేను నిన్న రాత్రి ఇంట్లో ఉండినాను
ఐ వాస్ అట్ హోమ్ లాస్ట్ నైట్ 
I was not at home last night.నేను నిన్న రాత్రి ఇంట్లో ఉండలేదు
Was I at home last night?నేను నిన్న రాత్రి ఇంట్లో ఉండినాన?
Was I not at home last night?నేను నిన్న రాత్రి ఇంట్లో ఉండ లేదా?
  
10.He was tired after work.అతను పని తర్వాత అలసిపోయి ఉండినాడు
హీ వాస్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్ 
He was not tired after work.అతను పని తర్వాత అలసిపోయి  ఉండలేదు
Was he tired after work?అతను పని తర్వాత అలసిపోయి ఉండినాడ?
Was he not tired after work?అతను పని తర్వాత అలసిపోయి ఉండలేదా?
  
11.He was in the office yesterday.అతను నిన్న ఆఫీసులో ఉండినాడు.
హీ వాస్ ఇన్ ద ఆఫీస్ యెస్టర్‌డే 
He was not in the office yesterday.అతను నిన్న ఆఫీసులో  ఉండలేదు.
Was he in the office yesterday?అతను నిన్న ఆఫీసులో ఉండినాడా?
Was he not in the office yesterday?అతను నిన్న ఆఫీసులో ఉండ లేదా?
  
12.She was late to the class.ఆమె క్లాసుకి ఆలస్యంగా వచ్చింది (ఆమె క్లాస్ కి ఆలస్యంగా ఉండింది)
షీ వాస్ లేట్ టు ద క్లాస్ 
She was not late to the class.ఆమె క్లాసుకి ఆలస్యంగా రాలేదు.
Was she late to the class?ఆమె క్లాసుకి ఆలస్యంగా వచ్చిందా?
Was she not late to the class?ఆమె క్లాసుకి ఆలస్యంగా రాలేదా?
  
13.She was at the party last night.ఆమె నిన్న రాత్రి పార్టీలో ఉండింది.
షీ వాస్ అట్ ద పార్టీ లాస్ట్ నైట్ 
She was not at the party last night.ఆమె నిన్న రాత్రి పార్టీలో ఉండలేదు.
Was she at the party last night?ఆమె నిన్న రాత్రి పార్టీలో ఉండిందా ?
Was she not at the party last night?ఆమె నిన్న రాత్రి పార్టీలో ఉండ లేదా?
  
14.We were busy yesterday.మేము నిన్న బిజీగా ఉండినాము
వీ వర్ బిజీ యెస్టర్‌డే 
We were not busy yesterday.మేము నిన్న బిజీగా ఉండలేదు
Were we busy yesterday?మేము నిన్న బిజీగా ఉండినామ?
Were we not busy yesterday?మేము నిన్న బిజీగా ఉండ లేదా?
  
15.We were at the meeting.మేము సమావేశంలో ఉండినాము
వీ వర్ అట్ ద మీటింగ్ 
We were not at the meeting.మేము సమావేశంలో ఉండలేదు
Were we at the meeting?మేము సమావేశంలో ఉండినామ?
Were we not at the meeting?మేము సమావేశంలో ఉండ లేదా?
  
16.You were very kind to me.నువ్వు నా పట్ల చాలా దయగా ఉండినావు (ఇప్పుడు లేడు.)
యూ వర్ వెరీ కైండ్ టు మీ 
You were not very kind to me.నువ్వు నా పట్ల చాలా దయగా ఉండలేదు 
Were you very kind to me?నువ్వు నా పట్ల చాలా దయగా ఉండినావ? 
Were you not very kind to me?నువ్వు నా పట్ల చాలా దయగా ఉండ లేదా?
  
18.You were in the library.నువ్వు లైబ్రరీలో ఉండినావు
యూ వర్ ఇన్ ద లైబ్రరీ 
You were not in the library.నువ్వు లైబ్రరీలో ఉండలేదు
Were you in the library?నువ్వు లైబ్రరీలో ఉండినావ?
Were you not in the library?నువ్వు లైబ్రరీలోఉండ లేదా?
  
19.They were excited about the trip.వాళ్ళు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండినారు
దే వర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రిప్ 
They were not excited about the trip.వాళ్ళు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండలేదు
Were they excited about the trip?వాళ్ళు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండినార?
Were they not excited about the trip?వాళ్ళు ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉండ లేదా?
  
20.They were at the park.వాళ్ళు పార్కులో ఉండినారు
దే వర్ ఎట్ ద పార్క్ 
They were not at the park.వాళ్ళు పార్కులో ఉండలేదు
Were they at the park?వాళ్ళు పార్కులో ఉండినారా?
Were they not at the park?వాళ్ళు పార్కులో ఉండ లేదా?
  
21.Ramu was sick last week.రాము గత వారం అనారోగ్యంతో ఉండినాడు.
రాము వాస్ సిక్ లాస్ట్ వీక్ 
Ramu was not sick last week.రాము గత వారం అనారోగ్యంతో ఉండలేదు
Was Ramu sick last week?రాము గత వారం అనారోగ్యంతో ఉండినాడ?
Was Ramu not sick last week?రాము గత వారం అనారోగ్యంతో ఉండ లేదా?
  
22.Ramu was at the bus stop.రాము బస్ స్టాప్ లో ఉండినాడు.
రాము వాస్ అట్ ద బస్ స్టాప్ 
Ramu was not at the bus stop.రాము బస్ స్టాప్ లో ఉండలేదు.
Was Ramu at the bus stop?రాము బస్ స్టాప్ లో ఉండినాడా?
Was Ramu not at the bus stop?రాము బస్ స్టాప్ లో ఉండ లేదా.?
  
23.We were ready for the exam.మేము పరీక్షకు సిద్ధంగా ఉండినాము.
వీ వర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ 
We were not ready for the exam.మేము పరీక్షకు సిద్ధంగా ఉండలేదు
Were we ready for the exam?మేము పరీక్షకు సిద్ధంగా ఉండినామా?
Were we not ready for the exam?మేము పరీక్షకు సిద్ధంగా ఉండ లేదా?
  

 

 

Had:

He, She, It, I, We, You, They లకు అన్నిటికీ కూడా  గతంలో కలిగి ఉండిన అనే భావాన్ని తెలియజేయుటకు  Had అనే  సహాయక క్రియ కామన్ గా ఉపయోగిస్తారు.ఈరోజు ఐదు నిమిషాల క్రితం 10 నిమిషాల క్రితం కూడా గతం కిందకే వస్తుంది

వీటిని Possessive sentences అంటారు .  possessive అంటే కలిగి ఉండడం అని అర్థము.

Sub + had + object

గతంలో ఏదైనా కలిగి ఉండేది, కలిగి ఉండేవాడు, కలిగి ఉండేవారు, అని చెప్పడానికి Had అనే సహాయక క్రియ  ఉపయోగిస్తారు.

1. He had two cars ( అతనికి రెండు కార్లు ఉండేవి గతంలో ఇప్పుడు లేవు ). 

పై వాక్యంలో

Subject = He, Verb = Had,  Object.= Two cars 

2.They had a great time at the party last night. (గత రాత్రి వారు పార్టీలో గొప్పగా గడిపారు) (గత రాత్రి పార్టీలో వారు మంచి సమయాన్ని కలిగి ఉండినారు)

3.She had a headache after a long meeting. ( సుదీర్ఘ సమావేశం తరువాత ఆమెకు తలనొప్పి వచ్చింది.) ( సుదీర్ఘ సమావేశం తర్వాత ఆమె తలనొప్పిని కలిగి ఉండింది అని చెప్పడం భాషాపరంగా కొంత ఎబ్బెట్టుగా ఉంటుంది)

4.She had a strange dream last night. (గత రాత్రి ఆమెకు వింత కల వచ్చింది) (గత రాత్రి ఆమె ఒక వింతైన కలను కలిగి ఉండింది)

5.They had a lot of homework to do.( చేయటానికి వారికి చాలా హోం వర్క్ ఉండింది)

ఇక్కడ  did +have = had అని మనం గుర్తుంచుకోవాలి.

 

Present (V1) past (V2) past participle (V3)
has/havehadhad

 

2వ  వాక్యాన్ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చడానికి ప్రయత్నిద్దాం

They had a great time at the party last night.

పై వాక్యాన్ని క్రింది విదంగా కూడా రాయవచ్చు

They did have a great time at the party last night.

 ఎందుకని  did+have = Had కాబట్టి 

కానీ negative sentences రాసేటప్పుడు did మరియు have తప్పకుండా ఉపయోగించాల్సి  వుంటుంది. 

సింపుల్ పాస్ట్ టెన్స్ లో పై వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయాలంటే,  గత రాత్రి వారు పార్టీలో గొప్పగా గడప లేదు అని రాయాలి.

Simple past లో ‘లేదు’  అంటే ‘Did not’ అని అర్ధం. ఇప్పుడు పై వాక్యానికి వ్యతిరేక వాక్యం రాద్దాము

They did not had a great time at the party last night.

ఈ  విధంగా రాయడం కూడా తప్పు అవుతుంది ఎందుకంటే  Did మరియు had లు రెండు రెండు కూడా పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి సహాయక క్రియ మరియు verb రెండు కూడా ఒకే కాలాన్ని సూచించేదిగా ఉండకూడదు. సహాయక క్రియలు కాలాన్ని తెలియజేస్తున్నప్పుడు verb ఎప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి. ఇది గ్రామర్  రూల్. కాబట్టి Had కి బదులుగా దాని మొదటి రూపమైన Have ని ఉపయోగిస్తారు.

Do, Does, Did  లు  వాక్యంలో ఉన్నప్పుడు, verb ఎప్పుడు మొదటి రూపంలోనే ఉండాలి.

కాబట్టి, పై వాక్యాన్నిThey did not have a great time at the party last night (N).అని రాస్తాము.

పై వాక్యాలను రెండిటిని క్రింద రాద్దాం .

1. They did have a great time at the party last night.(P) 

2.They did not have a great time at the party last night (N)

పై రెండు వాక్యాలను Interrogative sentence గా మార్చుటకు they ప్రక్కన ఉన్న Did ని  ముందు ఉంచితే సరిపోతుంది.

3.Did They have a great time at the party last night ?.(I)

4.Did They not have a great time at the party last night ?. (NI)

Examples:

1. He had a new car.అతనికి కొత్త కారు ఉండేది . (అతను కొత్త కారు కలిగి ఉండేవాడు) 
హీ హ్యాడ్ ఎ న్యూ కార్. 
He did not have a new car.అతని కి  కొత్త కారు ఉండేది కాదు.
Did he have a new car?అతనికి కొత్త కారు ఉండేదా?
Did he not have a new car?అతనికి కొత్త కారు ఉండేది కాదా?
  
2.She had a beautiful dress.ఆమె కి అందమైన దుస్తులు ఉండేవి.( ఆమె అందమైన దుస్తులు కలిగి ఉండేది
షీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్సు. 
She did not have a beautiful dress.ఆమె కి  అందమైన దుస్తులు ఉండేవి కావు.
Did she have a beautiful dress?ఆమె కి అందమైన దుస్తులు వుండేవా?
Did she not have a beautiful dress?ఆమె కి  అందమైన దుస్తులు ఉండేవి కావా?
  
3.They had a big house.వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు ఉండేది.( లేదా వాళ్లు పెద్ద ఇల్లు కలిగి ఉండేవారు)
దే హ్యాడ్ ఎ బిగ్ హౌస్. 
They did not have a big house.వాళ్ళకి  ఒక పెద్ద ఇల్లు ఉండేది కాదు.
Did they have a big house?వాళ్ళకి ఒక  పెద్ద ఇల్లు ఉండేదా?
Did they not have a big house?వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు వుండేది కాదా?
  
4.I had a pet dog.నాకు ఒక పెంపుడు కుక్క ఉండేది.( నేను ఒక పెంపుడు కుక్కను కలిగి ఉండేవాడిని)
ఐ హ్యాడ్ ఎ పెట్ డాగ్. 
I did not have a pet dog.నాకు ఒక పెంపుడు కుక్క ఉండేది కాదు.
Did I have a pet dog?నాకు ఒకపెంపుడు కుక్క ఉండేదా?
Did I not have a pet dog?నాకు ఒక పెంపుడు కుక్క వుండేది కాదా?
  
5.We had many books.మా దగ్గర చాలా పుస్తకాలు ఉండేవి. ( మేము చాలా పుస్తకాలను కలిగి ఉండేవాళ్లం)
వీ హ్యాడ్ మేని బుక్స్. 
We did not have many books.మా దగ్గర చాలా పుస్తకాలు ఉండేవి కావు.
Did we have many books?మా  దగ్గర చాలా పుస్తకాలు వుండేవా?
Did we not have many books?మా  దగ్గర చాలా పుస్తకాలు వుండేవి కావా?
  
6.He had a problem.అతనికి ఒక సమస్య వుండేది. ( అతను ఒక సమస్య కలిగి ఉండేవాడు)
హీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్. 
He did not have a problem.అతనికి ఒక  సమస్య వుండేది కాదు.
Did he have a problem?అతనికి ఒక  సమస్య వుండేదా?
Did he not have a problem?అతనికి ఒక సమస్య వుండేది కాదా?
  
7.She had a lovely smile.ఆమెకు అందమైన చిరునవ్వు వుండేది (ఆమె అందమైన చిరునవ్వు కలిగి ఉండేది).
షీ హ్యాడ్ ఎ లవ్లీ స్మైల్. 
She did not have a lovely smile.ఆమెకు అందమైన చిరునవ్వు వుండేది కాదు.
Did she have a lovely smile?ఆమెకు అందమైన చిరునవ్వు వుండేదా?
Did she not have a lovely smile?ఆమెకు అందమైన చిరునవ్వు వుండేది కాదా?
  
8.They had a meeting yesterday.వారికి  నిన్న ఒక సమావేశం వుండింది(వారు నిన్న ఒక సమావేశం కలిగి ఉండినారు).
దే హ్యాడ్ ఎ మీటింగ్ యెస్టర్‌డే. 
They did not have a meeting yesterday.వారికి  నిన్న ఒక సమావేశం వుండలేదు.
Did they have a meeting yesterday?వారికి  నిన్న ఒక సమావేశం వుండిందా?
Did they not have a meeting yesterday?వారికి  నిన్న ఒక సమావేశం వుండలేదా.?
  
9.I had a bicycle.నా దగ్గర ఒక సైకిల్ ఉండేది.( నేను ఒక సైకిల్ కలిగి ఉండేవాడిని)
ఐ హ్యాడ్ ఎ బైసికల్. 
I did not have a bicycle.నా దగ్గర సైకిల్ వుండేది కాదు.
Did I have a bicycle?నా దగ్గర సైకిల్ వుండేదా?
Did I not have a bicycle?నా దగ్గర సైకిల్ వుండేది కాదా?
  
10.We had some free time.మాకు కొంత ఖాళీ సమయం వుండేది.( మేము కొంత ఖాళీ సమయం కలిగి ఉండే వాళ్ళము)
వీ హ్యాడ్ సమ్ ఫ్రీ టైమ్. 
We did not have some free time.మాకు కొంత ఖాళీ సమయం వుండేది కాదు.
Did we have some free time?మాకు కొంత ఖాళీ సమయం వుండేదా?
Did we not have some free time?మాకు కొంత ఖాళీ సమయం వుండేది కాదా?

 

 

తర్వాత సింపుల్ పాస్ట్  ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు తెలుసుకుందాం