Rohu fish in telugu and rohu fish in telugu name
రోహు చేప మంచినీటి చేప. దక్షిణ ఆసియా ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చేప(Rohu fish in telugu) “కార్ప్” కుటుంబానికి చెందినది గా చెప్పవచ్చు. రోహు చేపలను “రోహి” “రోయి” “తప్రా” “రోవ్వా” “రోహోలాబియో”వంటి పేర్లతో పిలుస్తున్నారు
rohu fish in telugu name
రోహు చేపలను మన తెలుగు లో వివిధ రకాలైన పేర్లతో పిలుస్తున్నారు వాటిలో కొన్ని క్రింద చూడవచ్చు.
బొచ్చలు,
జ్ఞాడు మీను,
రోహితాలు
రోహు చేపల శాస్త్రీయ వర్గీకరణ:
తరగతి: Actinopterygii
ఆర్డర్: సైప్రినిఫార్మ్స్
ఉపకుటుంబం: లాబియోనినే
జాతి: లాబియో
జాతులు: L. రోహితి
రాజ్యం: యానిమలియా
వర్గం: చోర్డేటి
కుటుంబం: సైప్రినిడే
Rohu fish in telugu
రోహు చేపలు చూడడానికి దాదాపుగా కాట్ల చేపల మాదిరిగానే ఉంటాయి. ఈ చేప యొక్క తల మరియు రెక్కలు తప్ప శరీరమంతా ఎరుపు, బూడిద రంగు కలిగినటువంటి పోలుసులతో కప్పబడి ఉంటుంది.ఇది శరీరం మొత్తం మీద ఏడు రెక్కలు కలిగి ఉంటుంది, దాదాపుగా 30 సెంటీమీటర్ల నుండి ఒక మీటరు పొడవు వరకు పెరుగుతుంది.
రోహు చేపలకు(Rohu fish in telugu) మూడు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి సంతానోత్పత్తిని కలగజేసుకునే సామర్థ్యం కలుగుతుంది. ఈ వయసులో ఆ చేపలు దాదాపుగా మూడు లక్షల గుడ్లు వరకు పెట్టగలగుతాయి.ఇవి ఏప్రిల్ నుండి జూన్ వరకు గుడ్లను పెడతాయి. అయితే జూన్ నెల నుండి జూలై నెల వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువ సంతానోత్పత్తిని కలుగజేస్తాయి.
rohu fish in telugu name
రోహు చేపలను తెలుగులో బొచ్చా, శీలవతి అని వివిధ రకాలుగా పిలుస్తారు.రోహు చేపలను(rohu fish in telugu name) తెలుగు ప్రజలు మార్కెట్లలో బొచ్చా అని ఎక్కువగా సంబోదిస్తూ ఉంటారు. అనగా దక్షిణ కోస్తాలో ఈ విధమైన పేరు ఎక్కువగా వాడుతున్నారు.కొన్ని ప్రాంతాలలో తెలుగులో శీలవతి అని కూడా పిలుస్తున్నారు.
రోహు చేపల ధర
ఆగ్నేయాసియాలో ముఖ్యంగా భారత ప్రాంతంలో ఈ చేపలకు ఎక్కువగా డిమాండ్ ఉన్నది. ఈ చేపల ధర ప్రాంతాలనుబట్టి 150 రూపాయల నుండి 300 రూపాయల మధ్యలో ఉంటుంది. అయితే మిగిలిన చేపలు అయిన సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్ మరియు వంజరం లాంటి చేపలతో పోల్చినప్పుడు ఈ చేపల(Rohu fish in telugu )ధర చాలా తక్కువని చెప్పవచ్చు. మంచి నీటిలో పెరిగే చేపలలోఈ రోహు చేపలు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లో 70% డిమాండ్ ను కలిగి ఉన్నదని చెప్పవచ్చు.
రోహు చేపల ప్రయోజనాలు
ఇతర మంచినీటి చేపల తో పోల్చి చూసినప్పుడు రోహు చేపలు చాలా మంచి పోషక విలువలు కలిగి ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇతర సముద్ర చేపల మాదిరిగానే ఇది కూడా ఎక్కువ ప్రోటీన్ లను మరియు తక్కువ శాతం క్రొవ్వు లను కలిగి ఉన్నది.ఈ చేపలలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ B12 లు సమృద్ధిగా ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించబడి గుండె సంబంధమైన వ్యాధులు దగ్గరికి రావు మరియు మెదడు పనితీరును కూడా omega 3 fatty acids మెరుగుపరుస్తాయి.
ఈ చేపలలో (Rohu fish in telugu) ఐరన్, జింక్, సెలీనియం, అయోడిన్, పొటాషియం, క్యాల్షియం మొదలైన ఖనిజాలతో పాటు విటమిన్ ఏ, బి, సి, డి లు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఐరన్ లోపించినట్లు అయితే మన శరీరం రక్తహీనతకు గురి అవుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల నుండి అన్ని శరీర భాగాలకు కూడా ఆక్సిజన్ సక్రమంగా సరఫరా కాదు. ఊపిరితిత్తుల నుండి అన్ని శరీర భాగాలకు ఆక్సిజన్ సక్రమంగా సరఫరా జరగాలి అంటే ఐరన్ ఎంతో అవసరం. అదేవిధంగా మన కి కంటి చూపు సరిగా ఉండాలంటే విటమిన్ ఏ అవసరం. మన శరీరం లోని ఎముకలు క్యాల్షియం నుగ్రహించి ఎముకలు గట్టిగా ఉండాలి అంటే దానికి విటమిన్ డి అవసరం.
100 గ్రాముల రోహు చేపలలో కింద పేర్కొన్న టువంటి పోషక విలువలు ఉంటాయి.
కేలరీలు: 97
ప్రోటీన్: 77 గ్రాములు
చక్కెర: 0 గ్రాములు
కొవ్వులు: 2 గ్రాములు
ఐరన్: 1 మి.గ్రా
కాల్షియం: 650 మి.గ్రా
కార్బోహైడ్రేట్లు: 4 గ్రాములు
ఖనిజాలు: 2 గ్రా
ఫైబర్: 0 గ్రా
ఆధారం: USDA
రోహు చేపల ప్రయోజనాలు(Rohu fish in telugu)
1) గుండె ఆరోగ్యం(Rohu fish in telugu)
రోహు చేపలలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ఉండటం వలన. ఈ ఒమేగా త్రీ లలోఈ పి ఏ మరియుడిహెచ్ఎ రెండింటిని కూడా ఒమేగా త్రీ లు కలిగి ఉన్నందు వలన రక్తనాళాలలోపేరుకుపోయినక్రొవ్వును శుభ్రం చేసి రక్తం స్వేచ్ఛగా ప్రవహించేటట్లు చేస్తాయి. తద్వారా గుండె సంబంధమైన వ్యాధులను అరికట్టవచ్చు.అంతే గాక ఒమేగా త్రీ ఫ్యాటీలు రక్తపోటును కూడా క్రమబద్ధం చేస్తాయి. మరియు మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా చేపలను తీసుకోవడం వలన స్ట్రోక్ ,హార్ట్ ఎటాక్ లాంటి సమస్యలను నివారించుకోవచ్చు అని వైద్యులు తెలియజేస్తున్నారు.
2) మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
మనకు వయస్సు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తుంది. అయితే కొంత మందిలో ఇది ఇంకా తీవ్రతరమై అల్జీమర్ కు దారితీస్తుంది. అయితే చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ లు మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన గ్రేమ్యాటర్ ను అభివృద్ధి చేస్తాయని అని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఒమేగా త్రీ లో కనిపించే డీహెచ్ఏ లు మన ఏకాగ్రత స్థాయిని పెంచుతాయి,మరియు తొరగా నేర్చుకోవడం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
4)రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది
చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, కాల్షియం, జింకు, ఐరన్ మొదలైనవన్నీ కూడా రోగ నిరోధక వ్యవస్థను బలపరచడానికి దోహదపడతాయి. మన శరీరంలోని జీవక్రియలను పెంచుతాయి.మరియు బాహ్యం గా ఉన్నటువంటి సూక్ష్మజీవులతో పోరాటానికి ఎక్కువ శక్తిని కలుగజేస్తాయి.
5) బరువు తగ్గడం(Rohu fish in telugu)
ఈ చేపలో ప్రొటీన్లు ఎక్కువగా క్రొవ్వులు, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారు గాని తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి అనుకునేవారు గాని ఈ చేపలను తిన్నట్లయితే బరువు తగ్గడానికి అవకాశం ఉన్నది. మన శరీరంలో కొత్త కణాలు పెరగడానికి ఉన్న కణాలను బాగు చేయడానికి ప్రోటీన్లు ఎంతో అవసరం. ఈ విధంగా కొత్త కణజాలాలను పుట్టించడం వలన శరీర ఆకృతి బలపడుతుంది కండరాలకు బలం చేకూరుతుంది.
6) క్యాన్సర్ ప్రమాదాలను నివారిస్తుంది
అన్ని చేపలలో మాదిరిగానే రోహు చేపలలో కూడాయాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఈ ఆంటీ ఆక్సిడెంట్లుమానవ శరీరాన్ని క్యాన్సర్ రోగాల బారి నుండికాపాడతాయి.ఈ ఆంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్కణాలతో పోరాడతాయి.మరియు ఈ చేపలలో ఉండేసెలీనియం కూడా క్యాన్సర్ ను నివారించడంలోసమర్థవంతంగా పనిచేస్తుంది.
రోహు చేపల అప్రయోజనాలు
- పారిశ్రామిక వ్యర్ధాలు అయిన PCB, పాదరసం మొదలైనవి నదుల ద్వారా సముద్రంలో కలుస్తాయివీటిని సముద్రపు చేపలు ఆహారంగా తీసుకుంటాయి.
- ఇటువంటి చేపలను మనం తిని నప్పుడు పాదరసంచేపల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది తద్వారామన మెదడు పనితీరు మందగిస్తుంది అనితెలుసుకున్నాం కదా.
- అయితే రోహు చేపలకు పారిశ్రామిక వ్యర్థాలు నుగాని, పాదరసం గాని చేరక పోయినప్పటికీ, చేపలుపెంచే గుంటలలో చేపల పెరుగుదల కు ఉపయోగించేరసాయనాలను అవి తింటున్నాయి.
- అటువంటప్పుడుఆ చేపలు విషపూరితంగా మారే ప్రమాదం ఉన్నది.కావున చేపలను ఉడికించేటప్పుడు ఎక్కువ వేడిలోఉడికించడం మంచిది.
- చేపలను ఎక్కువ వేడిలోఉడికించిన అందులో ఉన్నటువంటి విషం విరిగిపోయిపక్కకు వస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
- కాబట్టి చేపలను ఏ విధంగా తీసుకోవాలి, ఎంతమోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరం అని వైద్యులనుఅడిగి తెలుసుకోవాలి.