...
basa fish in telugu

Basafish in telugu and basa fish in telugu name,

basa

Basa fish in telugu and basa fish in telugu name,

బాస చేప ఒక క్యాట్ ఫిష్ వంటిది.బాస చేపలు ఫంగాసియస్ జాతికి చెందిన చేపలు. బాస చేపలు ఆగ్నేయాసియాలోని ప్రధాన భూభాగం లైన మెకాంగ్ మరియు చావోప్రయా ప్రాంతాలకు చెందినవి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ చేపలకు మంచి గిరాకీ కూడా ఉన్నది. ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా లో వీటిని భాస ఫిష్, స్వై, భోకోర్టీ అనే పేర్లతో పిలుస్తున్నారు. అయితే ఐరోపాలో వీటిని ఫంగాసియస్, లేదా పంగా అనే పేర్లతో విక్రయిస్తున్నారు. అయితే ఆసియా (indian basa fish in telugu )  ప్రాంతాలలో బాస చేపలను “పసిఫిక్ డోరి”అనే పేరుతో పిలుస్తున్నారు. యునైటెడ్ కింగ్డం లో “వియత్నామీస్ రివర్ కాబ్లర్”, “రివర్ కాబ్లర్”, బాస అనే పేర్లతో పిలుస్తున్నారు.

Basa fish in telugu

బాసచేప యొక్క శరీరం లావు గాను మరియు బరువుగాను ఉంటుంది. చాలా గట్టిగా ఉండే ముక్కు మరియు దాని మూతిపై తెల్లటి గీత ను కలిగి ఉంటుంది. ఈ చేపల యొక్క తల గుండ్రంగా ఉండి పొడవు కంటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ఈ జాతికి చెందిన చేపలు గరిష్టంగా 120 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.

బాసచేపలు మొక్కలను, పాచిని ఆహారంగా తీసుకుంటాయి.బాస చేపలు వరదల ప్రారంభంలో నదులు లోనికి వెళ్లి గుడ్లు పెడతాయి తర్వాత జూన్ మధ్య నాటికి ఈ చేప పిల్లలు ఐదు సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.

బాస చేపలు కీటో డైట్ పాటించే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ చేపలను ఆహారంగా ఎంతో నిరభ్యంతరంగా అన్నిరకాల రుచులతో వండుకోవచ్చు.ఈ చేపల మాంసం లేత గులాబి రంగుని కలిగి చాలా దృఢంగా ఉంటుంది ది.తక్కువ ధర మరియు తక్కువ వాసన కారణంగా ఈ చేపలకి డిమాండ్ రెస్టారెంట్ల లలో ఎక్కువగా ఉన్నది. ఈ చేపలు నదుల లోనూ మరియు మంచినీటి లోనూ పెంచడానికి కి అనుకూలంగా కూడా ఉంటాయి.

Basa fish in telugu name,

బాస చేపలను మన తెలుగులో ఈ క్రింది పేర్లతో పిలుస్తారు
బంక జెళ్ళ
చోలువ జెళ్ళ
పంగస

బాస చేపల (Advantages of basa fish in telugu) యొక్క ప్రయోజనాలు

చేపలు మానవులకు అవసరమైన ప్రోటీన్లు మరియు పోషకాలకు ప్రధానమైనటువంటి కేంద్రం అని మనం చెప్పవచ్చు. ఈ చేపలలో కేలరీలు కూడా తక్కువగా ఉన్నందువలన బరువు తగ్గాలి అనుకునే వారికి, మరియు తక్కువ కేలరీలు గల ఆహారాన్ని తీసుకోవాలి అనుకునేవారికి, ఈ చేపలు బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పవచ్చు.

100 గ్రాముల బాస చేపలలో ఈ క్రింద పేర్కొన్న పోషకాలు ప్రధానంగా ఉంటాయి.

కేలరీలు: 158

ప్రోటీన్: 22.5 గ్రాములు

కొవ్వు: 7 గ్రాములు

సంతృప్త కొవ్వు: 2 గ్రాములు

కొలెస్ట్రాల్: 73 మి.గ్రా

పిండి పదార్థాలు: 0 గ్రాములు

సోడియం: 89 మి.గ్రా

వీటితో పాటు ఈ చేపలలోఒమేగా త్రీ పాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. వీటి వలన గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మరియు మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

1)బరువు తగ్గడం

బాస చేపలలో (basa fish in telugu) కొవ్వులు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ కేలరీలు తీసుకోవాలి అనుకునేవారికి బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్.ప్రోటీన్లు ఎక్కువగానూ మరియు యు కాలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వును తగ్గించడంలో ఉపయోగపడతాయి.

2)ప్రోటీన్లు

బాస చేపలలో అధిక నాణ్యత గల ప్రోటీన్లు ఉంటాయి. అనగా మన శరీరానికి అవసరమైన అటువంటి అమినోయాసిడ్స్ అన్నీ కూడా సమృద్ధిగా సమకూరుతాయి.ఉదాహరణకు 100 గ్రాముల బాస చాప లో పదమూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మన శరీరంలో కణాలను సరి చేయడానికి కొత్త కణాలను పుట్టించడానికి ప్రోటీన్లు ఎంతో అవసరం.కొత్త కణాలు పుట్టినప్పుడు కణజాలం, కండరాలు మొత్తం శరీరం అంతా కూడా పుష్టిగా తయారవుతుంది. ఇంకా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, యువకులకు కూడా ప్రోటీన్లు అవసరం ఎంతో ఉంది.

3) కార్బోహైడ్రేట్లు

బాస చేపలు (basa fish in telugu) జంతు సంబంధమైన ఆహారం అయినందువలన కార్బోహైడ్రేట్లు అసలు ఉండవు. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారికి బాస చేపలు మంచి ఆహారం బాషా చేపలను ఆహారంగా తీసుకున్నట్లయితే నిద్రమత్తు, నీరసం లాంటివి కూడా ఉండవు కాబట్టి మధ్యాహ్న భోజనంలో ఈ చేపలను ఆహారంగా తీసుకోవచ్చు. మరియు రోజంతా కూడా శక్తివంతంగా ఉండవచ్చు.

4)ఆస్తమా

ఎలుకలపై చేసిన అధ్యయనం ప్రకారం ఈ చేపలను ఎక్కువగా తీసుకున్న టువంటి వారిలో పెద్ద పేగులో బ్యాక్టీరియా కమ్యూనిటీ ఏర్పడుతుంది మరియు పల్మనరీ ఇన్ ఫ్లమేషన్నీ కూడా అభివృద్ధి చేస్తుంది కనుక ఆస్తమా రోగులకు ఈ చేపలు ఆరోగ్యకరమని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆస్తమా ఉన్నటువంటి వారు వైద్యులను సంప్రదించి ఈ చేపలను( basa fish in telugu name )ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

5) బాస చేప మెదడుకు మంచిది

ఈ చేపలు మన మెదడుకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.బాసా చేపలలో DHA (డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్) ఉంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యానికి మంచిది అని మనకి తెలుసు. అయితే DHA నాడీ కణాల పెరుగుదలకు డైరెక్ట్ గా సహాయం చేస్తుంది. మన మెదడు సాధారణంగా మరియు సమర్ధవంతంగా పనిచేయడానికి DHA ఒక ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాం.

అవసరమైనంత DHA నీ దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు జ్ఞాపక శక్తిని, అభ్యాస శక్తిని మనం సమర్థవంతంగా పెంచుకోవచ్చు. DHA యొక్క సంపూర్ణ ప్రయోజనాలను పొందడానికి మనం ఈ చేపలను ఆహారంగా ఎంచుకోవచ్చు.

6) రక్తపోటు

బాస చేపలలో (basa fish in telugu) సోడియం చాలా తక్కువగా ఉంటుంది.100 గ్రాముల బాస చేపలలో 48 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ చేపలను ఆహారంలో చేర్చుకోవాలి అయితే ఈ విషయాన్ని వైద్యులను అడిగి తెలుసుకో వలసి ఉంటుంది.

7) దీర్ఘాయువు

  • ఈ చేపలలో( basa fish in telugu name ) ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన స్ట్రోక్ మరియు గుండెపోటు, మెదడు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
  • ఒమేగా త్రీ ఫ్యాటి ఆమ్లాలు తక్కువగా ఉన్న వారి కంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉన్నవారు 2.2 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తున్నారని పరిశోధనలో వెల్లడయింది.

8)ఖనిజాలు

  • బాస చేపలలో జింక్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
  • జింక్ మరియు పొటాషియం లో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేయడానికి,గాయపడిన కణజాలాలను నయం చేయడానికి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను మెరుగు పరచడానికి అవసరం.
  • అదే విధంగా ఈ చేపలను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తో పాటు కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయి వాటిని గురించి కింద వివరంగా తెలుసుకుందాం.

అప్రయోజనాలు(Disadvantages of basa fish in telugu)

  • ఏ రకమైన చేపలను తీసుకోవడం కూడా కొన్నిప్రమాదాలతో కూడి ఉంటుంది దానిని మనం చాలాజాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది.
  • చేపలు( basafish in telugu name ) నీరు లేదా ఆహారాన్నితీసుకునేటప్పుడు కొన్ని హానికరమైన రసాయనాలనుకూడా అవి తినవచ్చు.
  • పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్(PCBs) మరియు మెర్క్యురీ వంటి రసాయనాలుకాలక్రమేణా చేపల శరీరంలో క్రమక్రమంగా అభివృద్ధిచెందవచ్చు.
  • ఈ రసాయనాల అధిక స్థాయిలు మీమెదడు మరియు నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తాయిఅని నిపుణులు కనుగొన్నారు.
  • కాబట్టి మనం చేపలనుపెంచే నీరు శుభ్రంగా మరియు రసాయనాలు,కాలుష్యాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి .
  • అంతేకాదు చేపల పెంపకందారులు చెరువులోనిసూక్ష్మజీవులను వదిలించుకోవడానికి వివిధ రకాలరసాయనాలు మరియు మందులను కూడా చెరువులలో ఉపయోగిస్తారు.
  • బాసా వంటి చేపలు ఈహానికరమైన రసాయనాలన్నింటినీ తమ శరీరంలోకిఆహారంగా తీసుకుంటాయి మరియు ఆ చేపలువిషపూరితంగా మారే దానికి అవకాశం ఉంది.
  • యూరోపియన్ దేశాలు అయిన జర్మనీ , పోలాండ్వంటి దేశాలకు ఎగుమతి చేయబడిన భాష చేపలలోఫుడ్ పాయిజనింగ్ కు కారణమయ్యేటువంటివిబ్రియో బ్యాక్టీరియా ను కనుగొన్నారు.
  • ఈ చేపలనుబాగా శుభ్రం చేసి ఎక్కువ వేడిలో వంట చేసుకోవడంమంచిది.మనం ఎక్కువ వేడిలో చేపలను ఉడికించినట్లయితే చేపల నుండి విషాన్ని వేరు చేయవచ్చుననినిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

 

 

 

 

 

Related Posts

error: Content is protected !!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.