Sora fish and sora fish in telugu
మన తెలుగులో సొరచేప(sora fish in telugu) అని పిలిచే ఈ చేపను ఆంగ్లంలో Shark అని పిలుస్తారు.
సొర చేపలు ఎలాస్మోబ్రాంచ్ గ్రూపుకు చెందిన చేపలు. సొర చేపలను పురాతనమైన చేపల గా చెబుతారు. 420 మిలియన్ సంవత్సరాల కంటే పూర్వం నుండి ఈ చేపలు ఉన్నాయి అని వాటి శిలాజాలు మనకు తెలియజేస్తున్నాయి (ఇన్ని సంవత్సరాలు అనేది ఒక అపోహ మాత్రమే అని నా అభిప్రాయం అది నిజం కాకపోవచ్చు కూడా). ఈ సొర చేపలు 17 సెంటీమీటర్ల నుండి 12 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. వేల్ షార్కులు (whale shark) 12 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి . పూర్వం 18 మీటర్ల పొడవు ఉండే మేఘాలోడాన్ అనే పెద్ద సొరచేప సముద్రంలో ఉండేది అని. అది ఇప్పుడున్న తెల్ల సొరచేప(pala sora fish) కంటే రెండు రెట్లు పెద్దది అని తిమింగలాలను కూడా తినేది అని అంటారు. అప్పటి షార్క్ చేప యొక్క అస్తిపంజరాలు పరిశీలించడం వలన ఈ విషయాలు మనకు తెలుస్తున్నాయి.
సొర చేపల సంతానోత్పత్తి(sora fish)
- సొర చేపల (sora fish) లో దాదాపు 70 శాతం చేపలు బాగా పరిపక్వానికి వచ్చిన పిల్లలని కంటాయి.
- సొరచేప లలో వాటి వాటి జాతులను బట్టి వాటి గర్భధారణ సమయం 6 నెలల నుండి 22 నెలల వరకు ఉంటుంది.
- ప్రపంచంలో దాదాపుగా ఐదు వందల రకాలైన సొరచేపలు ఉన్నట్లు కనుగొన్నారు.
- ఈ చేప యొక్క అస్తిపంజరం మృదులాస్థి తో తయారు చేయబడి ఉంటుంది.
- మృదులాస్థి అనేది ఎముకల వలె గట్టిగా ఉండదు ఇది ఒక రకమైన రబ్బరు లాగా ఉంటుంది.
- మృదువుగా ఉండే వీటి ఎముకలను సులభంగా నమలవచ్చు.
సొర చేపల ఆహారం
చాలా సొరచేపలు (sora fish in telugu) వేటాడి ఆహారాన్ని తీసుకుంటాయి. ఇవి చేపలను సముద్రంలో ఉండేటువంటి క్షీరదాలను మరియు ఇతర సముద్ర జీవులను వేటాడి తింటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద చేప అయిన వేల్ షార్క్ తిమింగలాల వలె ఉండే క్రిల్ చేపల కూడా తిని వేస్తోంది. సొర చేపలను తమ వేట విషయంలో సైలెంట్ కిల్లర్ అని అంటారు. సొరచేపలు చాలా పెద్దగా ఉండి క్రూరమైనవి అయినప్పటికిని వాటి నోటితో చేసే శబ్దాలు చాలా చిన్నవిగా ఉంటాయి అని కనుగొన్నారు. సొర చేపలలో హమర్ హెడ్ షార్క్, గ్రేట్ వైట్ షార్క్, టైగర్ షార్క్, మాకొ షార్క్ వంటివి ముఖ్యమైనవి.
సొరచేపలు అవయవాలు
షార్క్ చేపలు(sora fish) చాలా క్రూరంగా వేటాడుతాయి. వేట సమయంలో వాటికి కొన్ని దంతాలు కూడా విరిగిపోతాయి. అయితే విరిగిపోయిన దంతాల స్థానంలో తిరిగి కొత్తవి వస్తాయి. ఇది తన జీవిత కాలంలో 30 వేల దంతాలను పోగొట్టుకుంటుంది. అయితే పోగొట్టుకున్నటువంటి దంతాల స్థానంలో కొత్త దంతాలు పెరుగుతాయి. షార్క్ చేపలు చాలా దంతాలు ఉన్నప్పటికీ అది వేటాడిన మాంసాంని నమలలేదు వేటను కొరికి ముక్కలుగా చేసి మింగుతుంది ఆ ముక్కలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి షార్క్ చేపలు ప్రతిరోజు వేటాడవు.
అన్ని సొర చేపల దంతాలు ఒకే విధంగా ఉండవు. కొన్ని చేపల దంతాలు షార్పుగా ఉంటే కొన్ని చేపల దంతాలు కోన్ ఆకారంలో ఉంటాయి. అయితే ఇతర దేశాలలో చాలా మందికి షార్క్ చేపలు దంతాలను సేకరించడం ఒక హాబీ గా ఉంది. షార్క్ చేపల దంతాల పొడవు బట్టి షార్క్ చేప యొక్క పొడవును కూడా నిర్ణయిస్తారు. షార్క్ చేప యొక్క దంతం ఒక అంగుళం పొడవు ఉంటే అది షార్క్ చేప యొక్క 10 అడుగుల పొడవుకు సమానం. వారికి కొన్ని సార్లు 6 అంగుళాల షార్క్ దంతాలు కూడా దొరుకుతాయి. అప్పుడు షార్క్ చేప యొక్క పొడవు 60 అడుగుల అవుతుంది.
సొర చేపలకు(sora fish) ముందు మరియు వెనుక నాసికా రంధ్రాల మధ్య బలమైన జ్ఞాన అవయవాలు ఉంటాయి. ఇవి మైళ్ళ దూరం లో ఉన్నటువంటి రక్తాన్ని కూడా పసిగడతాయి. ధ్వని యొక్క దిశను గుర్తించడానికి క్షీరదాలు ఏ పద్ధతిని ఉపయోగిస్తాయో అదే పద్ధతి ప్రకారం,షార్క్ యొక్క నాసికా రంధ్రం లో ఉండే జ్ఞాన అవయవాలు వాసన వచ్చిన సమయాన్ని బట్టి ఆ వాసన ఏ దిశ నుండి వస్తుంది గుర్తించగలుగుతాయి.
అంతరించిపోతున్న సొరచేపలు
- భారతదేశంలో సుమారుగా 160 రకాల సొర చేపలు ఉన్నాయి.
- వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 schedule 1 క్రింద భారతదేశం పది రకాల షార్కుచేపలకు రక్షణ కలిగిస్తున్నది.
- భారతదేశం షార్క్ఫి న్నింగ్ మరియు షార్క్ ఫిన్ ఎగుమతులును నిషేధించింది. అయితే మన దేశంలో చిన్న చిన్న సొరచేపలను మార్కెట్లలో విక్రయిస్తున్నారు.
- వాణిజ్యపరంగా మరియు చేపల వేటను హాబీగా చేసేవారి వలన సంవత్సరానికి 100 మిలియన్ల షార్క్ చేపలు చంప బడుతున్నాయి.
- జపాన్ మరియు ఆస్ట్రేలియా లాంటి దేశాలలో షార్క్ ఒకసాధారణమైన సముద్ర ఆహారం.అక్కడ షార్కు లను చంపకుండా ఉండడానికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేవు.
- అంతరించిపోతున్న అటువంటిషార్కు లను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది.
- ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా చెప్పాలంటే అరేబియా సముద్రంలో సొరచేపలు అంతరించిపోతున్నాయి అని చెప్పవచ్చు. ప్రధానంగా వేట వల్లనే ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని కనుగొన్నారు.
- సొర చేపలను వేటాడడంలో ప్రపంచంలోనే ఇండోనేషియా మొట్ట మొదటి స్థానంలో ఉండగా భారత దేశం రెండవ స్థానంలో ఉన్నది.
- ఈ చేప లోని ప్రతి అవయవం తోకూడా ఉపయోగాలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.
- సొర చేప యొక్క చర్మాన్ని పాదరక్షలు తయారు చేయడానికి బ్యాగులు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు.
- ఈ చేప లివర్ నుండి వచ్చే నూనెకు ఎక్కువ డిమాండ్ ఉన్నది సొర చేపలకు ఉండే మృదులాస్థి అనేక ఔషధాలలో కూడా ఉపయోగిస్తున్నారు.
- సొర చేప జాతులలో ఇప్పటికే 50 శాతం నశించి పోయి నట్లు డాక్టర్ “రీమా జమాడో”తెలియజేస్తున్నారు.
- ఆయనతో పాటు 24 దేశాల కు సంబంధించిన బయోలజీస్టులు అరేబియా సముద్రం తో పాటు ఎర్ర సముద్రాన్ని, ఓ మున్ సముద్రం, మరియు ప్రక్కనే ఉన్న 20 దేశాలను అనుకున్న టువంటి సముద్రాలలో ప్రయోగాల జరిపినారు, వీరిలో మన భారతదేశానికి సంబంధించిన బయోలజిస్టులో కూడా ఉన్నారు.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిషరీస్ కారణంగానే సొర చేపలకు ముప్పు వాటిల్లుతుందని వారు కనుగొన్నారు.
- వాణిజ్యపరంగా ఇతర చేపలను వేటాడుతున్నప్పుడు వలలకు ఎక్కువగా సొర చేపలు పడుతున్నాయి.
- వాటిని మరల నీటిలోకి వదలకుండా వాటి అవయవాలకు ఎక్కువగా డిమాండ్ ఉన్న కారణంతో వాటిని చంపేస్తున్నారు.
- ఒకప్పుడు మాల్దీవుల్లో ను ఇప్పుడు జపాన్లో ఈసొర చేప ఆయిల్ తీసే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
- అన్ని చేపల మాదిరిగానే సొర చేపల ఆహారంలో కూడా అన్ని పోషకవిలువలు ఉన్నప్పటికీ మన భారత ప్రభుత్వం సొర చేపలను వేటాడడం నిషేధించిన కారణంగా షార్క్ చేపలు వేటాడటం మానుకుందాం మన ప్రభుత్వ చట్టాలకు లోబడదాం.
- మన బ్లాగు లోని అన్ని రకాల చేపలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం ఉంది అన్ని రకాలైన చేపలు మరియు వాటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించివివరంగా తెలుసుకోగలరు అని మనవి.