Introduction       

‘Tenses’  అనే పదం లాటిన్ పదమైనా ‘Tempus’ నుండి వచ్చింది. టెంపస్ అనగా కాలము అని అర్థం. కానీ భాషా శాస్త్రంలో (linguistics) Tenses అనేది పని యొక్క కాలాన్ని సూచించేదిగా ఉన్నది. కాలక్రమంలో లాటిన్ పదమైన ‘Tempus’ ఫ్రెంచ్ భాషలో ‘Tenses’ అనే ఆంగ్లపదంగా పరిణమించింది..ఒక పని వర్తమాన కాలమును సంబందించినదా, భూతకాలమునకు సంబంధించినదా లేదా భవిష్యత్తు కాలమునకు సంబంధించినద అని తెలియజేసే వాటిని Tenses అంటారు.ఇంగ్లీష్ భాషలో 80% వరకు కేవలం టెన్స్ మీదనే మాట్లాడుతారు. ఇందులో కేవలం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ 40%,  మిగిలిన Tenses  అన్నీ కలిపి 40% ఉంటాయి. కాబట్టి టెన్సెస్ గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటే 80% ఇంగ్లీష్  మనం నేర్చుకున్నట్లే. (spoken english to telugu)

Tenses  నేర్చుకోవడానికి ముందు ‘verbs’ గురించి తెలుసుకోవాలి. verb అనగా క్రియ అని అర్థం. ప్రతిరోజు మనం మాట్లాడే  ప్రతి మాటలో ఒక క్రియ కచ్చితంగా ఉంటుంది. వీటినిverbs అంటారు. వాక్య నిర్మాణంలో Verbs లేకుండా వాక్యాలను నిర్మించలేము. 

ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏ పని చేస్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, ఏమి కలిగి ఉన్నాడు లాంటి విషయాలను verb మనకు వివరిస్తుంది.ఈ verbs ప్రధానంగా రెండు రకాలు. 

1. Main verbs

2.Helping verbs (or) auxiliary verbs

1.Verbs (క్రియలు) or Main verbs: సబ్జెక్టు చేస్తున్న పనిని తెలియజేసే వాటిని Main verbs  అంటారు.  సెంటెన్స్  నిర్మించడానికి verbs వెన్నెముక లాంటివి.

Present (v1)  Past(v2) Past participle(V3)
Go.                 (వెళ్ళు) Went.              (వెళ్ళెను) Gone.             (వెళ్ళెను)
see.                (చూచు) Saw.              (చూచెను) Seen.            (చూచెను)
Ask               (అడుగు) Asked          (అడిగెను) Asked           (అడిగెను)
Bring.   

(తీసుకుని వచ్చు)

Brought.

(తీసుకునివచ్చెను)

Brought.

( తీసుకునివచ్చెను)

Laugh.           (నవ్వు) Laughed.      (నవ్వెను) Laughed.    (నవ్వెను)
Love.           (ప్రేమించు) Loved.       (ప్రేమించెను) Loved.       (ప్రేమించెను)
Make.            (చేయు) Made.           (చేసెను) Made.           (చేసెను)
Run.             (పరిగెత్తు) Ran.           (పరిగెత్తెను) Run.          (పరిగెత్తెను)
Come.           (వచ్చు) Came.        (వచ్చెను) Come.         (వచ్చెను)
Drink.             (త్రాగు) Drank.        (త్రాగెను) Drunk.          (త్రాగెను)

  పై పట్టికలో చూపిన విధంగా verb కాలాన్ని బట్టి తన రూపాన్ని అర్ధాన్ని మార్చుకుంటుంది.(spoken english to telugu)

ఎక్కడైనా verbs నేర్చుకోవడానికి ప్రయత్నించండి.

2.Helping verbs (or) Auxiliary verbs (సహాయక క్రియలు) :

సెంటెన్సెస్ ని నిర్మించడంలో verbs కి సహాయం చేస్తూ ఉండటం వలన మరియు వాక్యంలో verbs  లేనప్పుడు తామే మెయిన్ వెర్బ్ గా పని చేయడం వలన వీటిని సహాయక క్రియలు అన్నారు. Tense నిర్మించడంలో క్రింది పేర్కొన్న సహాయక క్రియలను ఉపయోగిస్తారు. 

DO, DOES, DID, AM, IS, ARE, WAS, WERE, HAVE, HAS, HAD, 

WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT

Auxiliary verbs  ని  తిరిగి రెండు రకాలుగా విభజించారు 

అవి: 1.Primary auxiliary verbs     2. Modal verbs

Primary auxiliary verbs  :DO, DOES, DID, AM, IS, ARE, WAS, WERE, HAVE, HAS, HAD, (Tenses రూపొందించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి.)

 Modal verbs ఇవి మొత్తం 9: WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT.

Primary auxiliary verbs వీటిని తిరిగి మూడు రకాలుగా విభజించారు అవి

  1. “Do” forms: DO, DOES, DID  
  2. “Be” forms: AM, IS, ARE, WAS, WERE, 
  3. “Have” forms: HAVE, HAS, HAD. 

 

Doforms సబ్జెక్టు ఏ పని చేస్తున్నాడు అనే దానిని వివరించడానికి ఉపయోగిస్తారు.

Beforms సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

Havefroms  సబ్జెక్టు ఏమి కలిగి  ఉన్నాడో తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

Model verbs సబ్జెక్టు యొక్క అవకాశాలు, అవసరాలు మరియు సామర్థ్యాలను గురించి తెలియజేయడానికి ఉపయోగపడతాయి.

సబ్జెక్టు (subject = కర్త) అనగా ఏమిటి? సెంటెన్స్ లో   పనిచేస్తున్నట్లు కనబడుతున్న వ్యక్తిని ,జంతువుని లేదా వస్తువుని  లేదా ఒక సంస్థ లేదా వ్యవస్థని సబ్జెక్టు అంటారు. సబ్జెక్టు యొక్క మాట ఎవరైతే వింటున్నారో ఎవరైతే సబ్జెక్టుకు లోబడుతున్నారో లేదా సబ్జెక్టు యొక్క ప్రభావానికి ఎవరైతే గురి అవుతున్నారో వారిని ఆబ్జెక్ట్ (object =కర్మ) అంటారు. (spoken english to telugu)

ఉదాహరణకు: 

The cat chases the mouse around the house. పిల్లి ఇంటి చుట్టూ ఎలుకను తరుముతుంది.
She waters the plants every morning. ఆమె ప్రతిరోజూ ఉదయం మొక్కలకు నీరు పోస్తుంది.
Ramesh  sends Ramu to the town. రమేష్ రాముని పట్టణానికి పంపిస్తాడు.
A tiger is chasing a deer. ఒక పులి జింకను తరుముతూ ఉంది.
The police beat the thief. పోలీసులు దొంగను కొట్టారు.

పైన రెడ్ కలర్ లో కనిపిస్తున్న పదాలు సబ్జెక్టు అయితే బ్లూ కలర్ లో కనిపిస్తున్న పదాలు ఆబ్జెక్ట్

 

ఈ సబ్జెక్టులు రెండు రకాలు:1) Singular subjects (ఒకరు)   2) Plural subjects ( ఇద్దరూ లేదా ఆపైన) 

ఈ Singular subjects ని తిరిగే మూడు రకాలుగా విభజిస్తారు.

     1)  First Person:    I (నేను)  

     2)  Second Person You (నీవు) (నాకు ఎదురుగా ఉన్న మరొక సింగిల్ వ్యక్తి)

     3)  Third Person He (అతడు), She ( ఆమె), It ( ఇది) that (అది) (నాకు దూరంగా ఉన్న వ్యక్తి లేదా జంతువు లేదా  వస్తువు)

ఈ Plural subjects ని తిరిగే మూడు రకాలుగా విభజిస్తారు.

1)  First Person:    We (మేము/మనము)  

2)  Second Person You (మీరు) (మనకు ఎదురుగా ఉన్న మరికొందరు)            3)  Third Person They (వారు) those (వారు) ( మనకు దూరంగా ఉన్న మరికొందరు) 

ఇప్పుడు పైన ఇవ్వబడిన సబ్జెక్టు లైన I, We, You, They, He, She, It,that లను సర్వనామాలు (Pronouns) అని కూడా అంటారు. సర్వనామాలు అనగా నామవాచకాలకు(Nouns)  బదులుగా ఉపయోగించబడే పదాలు. నామవాచకాలు అనగా పేర్లు అని అర్థం.(spoken english to telugu)

 ఉదాహరణకు:

     రమేష్ హైదరాబాదుకి వెళ్ళినాడు. రమేష్ హైదరాబాదులోని పర్యాటక స్థలాలని చూడాలి అనుకున్నాడు. రమేష్ చార్మినార్ని సందర్శించినాడు.రమేష్ చార్మినార్ వద్ద నుండి గోల్కొండ కి వెళ్ళినాడు.రమేష్ గోల్కొండ నుండి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళినాడు. 

       ఈ విధంగా ప్రతిసారి రమేష్, రమేష్,  రమేష్ అని ఉపయోగించడం వలన వాక్య నిర్మాణాలు అర్థవంతంగా ఉండవు చదివేవానికి విసుగు కలుగుతుంది. అందుకే నామవాచకాలకు(Nouns) బదులుగా సర్వనామాలు(Pronouns) ఉపయోగిస్తారు. రమేష్ అని మొదటి వాక్యంలో ఉపయోగించిన తర్వాత ప్రతిసారి అతను.(He= అతను) అని సంబోధిస్తే అర్థవంతంగా ఉంటుంది.

        రమేష్ హైదరాబాదుకి వెళ్ళినాడు. అతను హైదరాబాదులోని పర్యాటక స్థలాలని చూడాలి అనుకున్నాడు. అతను చార్మినార్ని సందర్శించినాడు.అతను  చార్మినార్ వద్ద నుండి గోల్కొండ కి వెళ్ళినాడు.అతను  గోల్కొండ నుండి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళినాడు. ఇలా చెప్పడం వలన వాక్యము అర్థం గా ఉంటుంది. అందుకే నామవాచకాలకు (Nouns)  బదులుగా సర్వనామాలు (Pronouns) ఉపయోగిస్తారు.

లేడీస్ పేర్లకు బదులు She,  జంతువులు లేదా వస్తువుల పేర్లకు బదులు It , ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది ఉన్నప్పుడు We, You, They లను సర్వనామాలుగా ఉపయోగిస్తారు.

 

Singular subjects లో  ఏ సబ్జెక్టుకి ఏ Helping verb వాడుతారో  కింది పట్టికలో చూడండి. 

 

I Do, Am, Have, Was.  
You (నీవు) Do, Are, Have, Were.
He, She, It Does, Is, Was, Has. 

 

Plural subjects లో  ఏ సబ్జెక్టుకి ఏ Helping verb  వాడుతారో  కింది పట్టికలో చూడండి

 

We Do, Have, Are, Were.
You ( మీరు) Do, Are, Have, Were ( You కి సింగులర్ అయిన ప్లూరల్  అయినా ఒకే విధమైన Helping verbs  వాడుతున్నారు గమనించండి).
They Do, Have, Are, Were.

 

DID, HAD  WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT,

ఈ helping verbs అన్నిటినీ, Singular subject ఆని Plural subjects అని తేడా లేకుండా అన్ని సబ్జెక్టులకు ఉపయోగిస్తారు. Modal verbs ఉపయోగించేటప్పుడు వెర్బ్ ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి.

క్రింది పట్టిక లో ఉన్న సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉన్నాయి అనేది పోయే కొద్ది మీకు అర్థం అవుతుంది. (spoken english to telugu)

 

S English sentences Telugu Meaning
1 Joy  do write articles. జాయ్  వ్యాసాలు రాస్తాడు.
2 Usha is teaching English. ఉష ఇంగ్లీషు నేర్పుతూ ఉంది.
3 He was playing football yesterday. అతను నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఉండినాడు.
4 they are studying together. వారు కలిసి చదువుకుంటూ ఉన్నారు.

   

5 Sudhakar, Abraham and Jhon live in Paris. సుధాకర్, అబ్రహం మరియు జాన్ పారిస్‌లో నివసిస్తున్నారు.
6 I am reading books. నేను పుస్తకాలు చదువుతూ ఉన్నాను.
7 Sangeetha speaks fluent Spanish. సంగీత స్పానిష్ అనర్గళంగా మాట్లాడుతుంది.
8 Ravi sent ramesh to Hyderabad. రవి రమేష్ ని హైదరాబాదుకు పంపించాడు.
9 Suresh, Mahesh and I  travel every summer. సురేష్, మహేష్ మరియు నేను ప్రతి వేసవిలో ప్రయాణిస్తాం.
10 The lion has eaten deer. సింహము దుప్పిని తిన్నది.

పైన రెడ్ కలర్ లో ఉన్నవి నామవాచకాలు

గ్రీన్ కలర్ లో ఉన్నవి verbs  (Main verbs)

బ్లూ కలర్ లో ఉన్నవి సర్వనామాలు (pronouns)

పింక్ కలర్ లో ఉన్నవి సహాయక క్రియలు (Helping verbs )

Verbs లేకుండా వాక్య నిర్మాణము చేయలేము. వాక్య నిర్మాణానికి verbs వెన్నెముక లాంటివి. మరియు సహాయక్రియలు అర్థవంతమైన వాక్యాన్ని నిర్మించడానికి verbs కి సహాయం చేస్తాయి కనుక వీటిని సహాయక క్రియలు అన్నారు. 

కొన్ని సందర్భాలలో verbs లేని వాక్యాలలో సహాయక క్రియలు మెయిన్ వెర్బ్ గా పని చేస్తాయి.

Examples:   1. He is a lawyer   అతను ఒక లాయర్

          2.They are students  వారు విద్యార్థులు

  1. He was farmer అతను రైతుగా ఉండెను

పై ఉదాహరణలను గమనిస్తే ఇటువంటి వాక్యాల నిర్మాణంలో verb లేకపోయినప్పటికీ సహాయక క్రియలు అయిన is, are, was  మెయిన్ వెర్బ్ గా పనిచేసి ఒక అర్థవంతమైనటువంటి వాక్య నిర్మాణాన్ని చేపడుతున్నాయి.

Tenses రకాలు

Tenses ప్రధానంగా మూడు రకాలు అవి

1)  Present tense (వర్తమాన కాలం)

2)  Past tense  ( భూతకాలం)

3)  Future tense ( భవిష్యత్ కాలం)

వీటిని మరలా ఒక్కొక్క దానిని Simple, continuous, perfect, perfect continuous అని నాలుగు రకాలుగా విభజిస్తారు అప్పుడు మొత్తం టెన్సెస్ 12 అవుతాయి క్రింది చార్ట్ ని గమనించండి.

1. Simple present tense.

2. Present continuous tense.

3. Present perfect tense.

4. Present perfect continuous tense.

5. Simple past tense.

6. Past continuous tense.

7. Past perfect tense.

8. Past perfect continuous tense.

9. Simple future tense.

10. Future continuous tense.

11. Future perfect tense.

12. Future perfect continuous tense.

 

Simple present tense Introduction   

Verb మొదటి రూపాన్ని ఉపయోగించి మాట్లాడడాన్నే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటారు. 1.ముఖ్యంగా ఈ టెన్స్ లో నిన్న, నేడు, రేపు రిపీటెడ్ గా జరిగే అవకాశం ఉండేటువంటి వాక్యాలను ఈ టెన్స్ లో తెలియజేస్తారు. అంటే ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉపయోగించే వాక్యాలు (sentences)  ప్రతిరోజు జరగడానికి అవకాశం ఉన్నట్లుగా మనకి కనబడతాయి. (spoken english to telugu)

2.మరియు ప్రత్యేకంగా ఈరోజు మాత్రమే జరిగే దానికి అవకాశం ఉన్నటువంటి పనులను కూడా ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే తెలియజేస్తారు. 

3.మూడవదిగా గడిచిపోయిన విషయాలను సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఎటువంటి సందర్భంలో చెప్పాల్సి వస్తుంది కూడా వివరించడం జరిగింది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని 12 రకాలుగా ఏ విధంగా ఉపయోగిస్తారో మనము ఇందులో వివరించడం జరిగింది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో పై మూడు అర్థాలు ప్రధానంగా  కనిపిస్తాయి. కేవలం ఒక సింపుల్ ప్రెసెంట్  టెన్స్ లోనే సుమారు 60 శాతం మాట్లాడుతారు. 

Simple present tense లో సింగులర్ సబ్జెక్ట్స్ కి ఏ సహాయక్రియలు వాడుతారో, ఫ్లూరల్ సబ్జెక్ట్స్ కి ఏ సహాయక్రియలు వాడుతారో తెలుసుకుందాం.

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో  సింగులర్ సబ్జెక్ట్స్ అయినా I,You మరియు ప్లూరల్ సబ్జెక్ట్స్ అయిన We,You,They దేలకు అన్నిటికీ.

1. సబ్జెక్టు యొక్క పనిని సూచించే వాక్యాలకు (Action sentences) Verb మొదటి రూపాన్ని మరియు  Do, అనే సహాయక క్రియను  ఉపయోగిస్తారు. 

2. సబ్జెక్టు యొక్క కలిగియున్న విషయాలను (Possessive sentences) తెలియజేయడానికి  ‘Have’  అనే సహాయక క్రియను ఉపయోగిస్తారు. 

3.సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి (State sentences) సబ్జెక్ట్ ‘I’ అయితే ‘am’ మరియు We, You, They  అయితే ‘Are’   ఉపయోగిస్తారు.

 

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో Third Person  సింగులర్ అయిన He, She It వాక్యాలలో వచ్చినప్పుడు 

1.సబ్జెక్టు యొక్క పనిని సూచించే వాక్యాలకు (Action sentences) Verb మొదటి రూపాన్ని మరియు  ‘Does’ అనే సహాయక క్రియను  ఉపయోగిస్తారు. 

2. సబ్జెక్టు యొక్క కలిగియున్న విషయాలను (Possessive sentences) తెలియజేయడానికి  ‘Has’  అనే సహాయక క్రియను ఉపయోగిస్తారు. 

3. సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి ‘is’ అనే సహాయక క్రియను  ఉపయోగిస్తారు (state sentences)

పై రెండు బాక్సుల్లో ఉన్న రూల్స్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో అని మాత్రమే గుర్తుపెట్టుకోండి.

(Do, Does = చేయు,   Did =చేసిన) 

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో సబ్జెక్టు Singulars అయిన Plurals అయిన verb  కేవలం  మొదటి రూపంలోనే ఉండాలి 

1.Simple present tense లో సబ్జెక్టులు I, We, You, They  లకు Verb  మొదటి రూపాన్ని మరియు  ‘Do’సహాయక క్రియ  ఉపయోగించి  Action sentences (పనిని సూచించే వాక్యాలు) నిర్మాణం ఎలా చేస్తారో తెలుసుకుందాం.

1.I send it.     (I do send it). నేను దీనిని పంపిస్తాను. 
2.We work.    (We do work). మేము పని చేస్తాము.
3. You see.    (You do see). నీవు చూస్తావు.
4. They run.   (They do run). వారు పరిగెత్తుతారు. 

పైన ఉన్న వాక్యాలలో Send,Work,See,Run, Verb యొక్క మొదటి రూపాలు (V1)

నేను దీనిని పంపిస్తాను, మేము పని చేస్తాము, నీవు చూస్తావు, వారు పరిగెత్తుతారు,   ఈ పనులన్నీ ఎప్పుడు జరుగుతాయి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఈ పనులు ప్రతిరోజు జరుగుతాయి లేదా ఈరోజు సాయంత్రం లోపల జరుగుతాయి అని రెండు అర్థాలలో ఉపయోగించవచ్చు. 

I send it దీని అసలైన రూపం బ్రాకెట్లో ఇవ్వబడింది (I do send it) .కానీ సాధారణంగా మాట్లాడేటప్పుడు I send it అని మాట్లాడుతారు. Do అనే పదం సబ్జెక్టు అయిన ‘I’ కుడి ప్రక్కనే దాగి ఉన్నది అని మనం ఊహించుకోవాలి. ఎందుకంటే ‘I’ అనే సబ్జెక్టుకు Action sentences (పనిని సూచించే వాక్యాలు) కి ‘Do’ అనే సహాయ వాడుతారు. 

I send it అనే వాక్యానికి వ్యతిరేక వాక్యం ( Negative sentence)  రాసేటప్పుడు, సబ్జెక్టు ‘I’ కి కుడి పక్కన దాగి ఉన్న Do ని బయటకు తీసి  Not అనే పదాన్ని రాస్తే సరిపోతుంది.

I do not send it అవుతుంది. 

సాధారణంగా వ్యతిరేక పదం Not. కానీ Tenses లో  వ్యతిరేక వాక్యాలు రాయటానికి ఆయా Tenses కి కేటాయించబడిన సహాయక క్రియల సపోర్ట్ తోటి Not ఉపయోగించాలి. 

అయితే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో I,we,you,they  లకు Action sentences లో కేటాయించబడిన సహాయక క్రియ Do కాబట్టి వ్యతిరేకవాక్యంగా మార్చుటకు Do not ఉపయోగించాలి.

 

I send it (Positive sentence)

I do not send it ( Negative sentence)

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా ( Interrogative sentences) మార్చటానికి

మొదటి వాక్యంలో సబ్జెక్టు I పక్కనే ఉన్న Do ని, రెండవ వాక్యంలో సబ్జెక్టు ‘I’ ప్రక్కనే ఉన్న Do ని మొదట ఉంచి, చివర క్వశ్చన్ మార్క్ (?) పెడితే సరిపోతుంది.

Do I send it? (పాజిటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా మారింది)

Do I not send it? ( నెగిటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా మారింది)

Negative sentences,  interrogative sentence,    negative interrogative sentences అన్నింటినీ కూడా positive sentence నుండి సృష్టించబడుతున్నాయి 

ఇప్పుడు పైన ఉన్న వాక్యాలు అన్నిటిని ఒక వరుస క్రమంలో రాసి చూద్దాం

I send it (Positive sentence) (P)

I do not send it ( Negative sentence) (N)

Do I send it? (Interrogative sentence) (I)

Do not I send it? (Negative interrogative sentence) (NI)

              

పాజిటివ్ సెంటెన్స్ (Positive sentence) అంటే ఏమిటి.? పాజిటివ్ సెంటెన్స్ వాస్తవాలు లేదా నిజాలను మాత్రమే తెలియజేస్తుంది. దీనిని ఆఫిర్మేటివ్ సెంటెన్స్ (Affirmative sentence) అని కూడా అంటారు. Affirmative అనగా ఇదే నిజం అని నొక్కి చెప్పడం. Positive sentence ని తెలుగులో సాధారణ వాక్యాలు అని అంటారు.(spoken english to telugu)

క్రింది పట్టికలో హైలెట్ చేసిన  మొదటి వాక్యం Positive, రెండవ వాక్యం  negative,  మూడవ వాక్యం  interrogative, నాలుగవ వాక్యం  negative interrogative అని గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకం చివరి వరకు ఇదే  క్రమం ఉంటుంది. హైలెట్ చేసిన పాజిటివ్ సెంటెన్స్ అన్నిటిని మొదట చదవండి.

 

1. I send it. (possitive sentence). నేను దీనిని పంపుతాను.
I do not send it .(negative sentence). నేను దీనిని పంపను.
Do I send it? (Interrogative  sentence) . నేను  దీనిని పంపుతానా?.
Do I not  send it? (negative Interrogative sentence). నేను  దీనిని పంపనా?.
2. We work. మేము పని చేస్తాము.
We do not work.   మేము పని చేయుము.
Do we work?   మేము పని చేస్తామా?
Do we not work?   మేము పని చేయమా?

3. You see.

మీరు చూస్తారు.(spoken english to telugu)

You don’t see. మీరు చూడరు.
Do you see? మీరు చూస్తారా?
Don’t you see? మీరు  చూడరా?
4. They run . వారు పరిగెత్తుతారు.
They don’t run. వారు  పరిగెత్తరు.
Do they run? వారు  పరిగెత్తుతారా?
Don’t they run? వారు   పరిగెత్తరా?

 

ఇక్కడ do not కు బదులుగా don’t (డోంట్) ఉపయోగించారు.

గ్రామర్ ప్రకారం గా do not ఉపయోగిస్తారు. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రకారంగా don’t ను అనధికారికంగా ఉపయోగిస్తున్నారు. doesn’t → does not

isn’t → is not

aren’t → are not

didn’t → did not

won’t → will not

wasn’t → was not

weren’t → were not

hadn’t → had not

hasn’t → has not

haven’t → have not

పై వాటిని not యొక్క షార్ట్ కట్స్, (contractions) అని అంటారు. 

 

5.  I eat breakfast every morning. 

  నేను ప్రతి ఉదయం అల్పాహారం తింటాను.

I do not eat breakfast every morning.   నేను ప్రతి ఉదయం అల్పాహారం తినను.
Do I eat breakfast every morning?    నేను ప్రతి ఉదయం అల్పాహారం తింటానా?
Do I not eat breakfast every morning?     నేను ప్రతి ఉదయం అల్పాహారం తిననా?
6.  We play cricket on weekends.   మేము వారాంతాల్లో క్రికెట్ ఆడతాము.
We do not play cricket on weekends.   మేము వారాంతాల్లో క్రికెట్ ఆడము.
Do we play cricket on weekends?   మేము వారాంతాల్లో క్రికెట్ ఆడతామా?(spoken english to telugu)
Do we not play cricket on weekends?   మేము వారాంతాల్లో  మేము క్రికెట్ ఆడమా?
7. You study for your exams diligently.   మీరు మీ పరీక్షల కోసం శ్రద్ధగా చదువుతారు.
You do not study for your exams diligently.   మీరు మీ పరీక్షల కోసం శ్రద్ధగా చదవరు.
Do you study for your exams diligently?   మీరు మీ పరీక్షలకు శ్రద్ధగా చదువుతారా?
Do you not study for your exams diligently?   మీరు మీ పరీక్షల కోసం శ్రద్ధగా చదవరా? 
8. They go to the gym regularly.   వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్తారు.
They do not go to the gym regularly.   వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్లరు.
Do they go to the gym regularly?     వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్తారా?
Do they not go to the gym regularly?     వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్ళరా?
9. I read books before bed. నేను  పడుకునే ముందు పుస్తకాలు చదువుతాను.(spoken english to telugu)
I do not read books before bed.   నేను పడుకునే ముందు పుస్తకాలు చదవను.
Do I read books before bed?   నేను పడుకునే ముందు పుస్తకాలు చదువుతానా?
Do I not read books before bed?   నేను పడుకునే ముందు పుస్తకాలు  చదవనా?

10. We visit our grandparents often.

  మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శిస్తాము.

We do not visit our grandparents often.   మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శించము.
Do we visit our grandparents often?   మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శిస్తామా?
Do we not visit our grandparents often?   మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శించమా?
11. You cook dinner every evening.   మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం వండుతారు. (Dinner = రాత్రి భోజనం).
You do not cook dinner every evening.   మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం వండరు .
Do you cook dinner every evening?   మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం వండుతారా? 
Do you not cook dinner every evening?   మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం  వండరా?
12. They travel to new places every year.   వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు.
They do not travel to new places every year.   వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయరు.
Do they travel to new places every year?   వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారా?(spoken english to telugu)
Do they not travel to new places every year?   వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయరా?
13. I write in my journal daily.   నేను రోజూ నా పత్రికలో వ్రాస్తాను.
I do not write in my journal daily.   నేను నా పత్రికలో రోజూ వ్రాయను.
Do I write in my journal daily?   నేను రోజూ నా జర్నల్‌లో వ్రాస్తానా?
Do I not write in my journal daily?   నేను రోజూ నా జర్నల్‌లో వ్రాయనా?

14.  We enjoy watching movies together.

  మేమిద్దరం కలిసి సినిమాలు చూసి ఆనందిస్తాం.

We do not enjoy watching movies together.   మేమిద్దరం కలిసి సినిమాలు చూసి ఆనందించం.
Do we enjoy watching movies together?   మేము కలిసి సినిమాలు చూసి ఆనందిస్తామా?
Do we not enjoy watching movies together?    మేము కలిసి సినిమాలు చూసి ఆనందించమా? 

పై వాక్యాలు గమనిస్తే verb మొదటి రూపాన్ని మాత్రమే ఉపయోగించి వాక్య నిర్మాణం చేయడం జరిగింది.

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో I, We, You, They  లకు ‘Have’ సహాయక క్రియ ఉపయోగించి Possessive sentences (సబ్జెక్టు దేనినైనా కలిగి ఉండడం)  వాక్య నిర్మాణం ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం.  

 

Example : You have a bike  (నీకు ఒక బైకు ఉన్నది లేదా నీవు ఒక బైక్ ని కలిగి ఉన్నావు) 

Have= కలిగి ఉండు 

 

ప్రతి వాక్యంలోనూ ఒక verb కచ్చితంగా ఉంటుంది అని తెలుసుకున్నాము కదా. కానీ పై వాక్యాన్ని గమనించినప్పుడు verb లేదు. Have మెయిన్ వెర్బ్ గా వ్యవహరిస్తూ సంపూర్ణ వాక్యాన్ని నిర్మించింది. కాబట్టి ఇక్కడ Have మెయిన్ వెర్బే గాని సహాయక క్రియ కాదు. Have మెయిన్ వెర్బ్ స్థానంలోకి వెళ్లిపోయింది. కాబట్టి పై వాక్యంలో సహాయక క్రియ లేదు అని చెప్పవచ్చు. గ్రామర్ రూల్ ప్రకారం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో I, We, You, They సబ్జెక్టులు గా ఉండి ఆ వాక్యంలో సహాయక క్రియ లేకపోతే ‘Do’ అనే సహాయక్రియను చేర్చాలి. ఈ ప్రకారం పై వాక్యాన్ని క్రింది విధంగా కూడా రాయవచ్చు(spoken english to telugu)

 

You do have a bike.  ఈ వాక్యాన్ని నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు Do ప్రక్కన not చేరిస్తే సరిపోతుంది. 

You do not have a bike. పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు Do ని సబ్జెక్టు You కి ముందు చేరిస్తే సరిపోతుంది.

 

Do you have a bike? ( Interrogative sentence)

Do you not have a bike? ( Negative interrogative sentence)

 

మరి కొన్ని ఉదాహరణలు.

1. I have a car. నా దగ్గర కారు ఉంది.
I do not have a car. నా దగ్గర కారు లేదు.
Do I have a car? నా దగ్గర కారు ఉందా?
Do I not have a car? నాకు కారు లేదా?
2.You have a new phone. నీ దగ్గర ఒక కొత్త ఫోన్ ఉన్నది.
You do not have a new phone. నీ దగ్గర ఒక కొత్త ఫోన్ లేదు.
Do You have a new phone? నీ దగ్గర ఒక కొత్త ఫోన్  ఉందా?
Do you not have a new phone? నీ దగ్గర ఒక కొత్త ఫోన్  లేదా?
3.They have a meeting today. ఈ రోజు వారి సమావేశం ఉంది.
They do not have a meeting today. వారికి ఈరోజు సమావేశం లేదు.
Do they have a meeting today? వారికి ఈరోజు మీటింగ్ ఉందా?
Do they not have a meeting today? వారికి ఈరోజు మీటింగ్ లేదా?
4.We have lunch at noon. మాకు మధ్యాహ్నం భోజనం ఉంది.
We do not have lunch at noon. మాకు మధ్యాహ్నం భోజనం లేదు.
Do we have lunch at noon? మాకు మధ్యాహ్నం భోజనం  ఉందా?
Do we not have lunch at noon? మాకు మధ్యాహ్నం భోజనం లేదా?

 

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో  సబ్జెక్టు ‘I’  కి am  మరియు We, You, They  లకు ‘are’ సహాయక క్రియలు ఉపయోగించి   (State sentences) స్స్థితిని తెలియజేసే వాక్యాలను ఎలా నిర్మిస్తారో తెలుసుకుందాం.

స్థితి లేదా పరిస్థితి అంటే ఏమిటి?

రాము వంకర టింకరగా రోడ్డుమీద  బైక్ నడిపి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నాడు. ఇది అతని పరిస్థితి .

మా కోడిపుంజు ఇంటి మీదకి ఎక్కి ఉన్నది. ప్రస్తుతం కోడిపుంజు పరిస్థితి అది

మహేష్ శ్రద్ధగా చదివి లెక్చరర్ అయి ఉన్నాడు. ప్రస్తుతం  మహేష్ పరిస్థితి ఇది 

నేను బాగా పని చేసి అలసిపోయి ఉన్నాను. ప్రస్తుతం  నా  పరిస్థితి అది.

 

am= అయి ఉన్నాను

is= అయి ఉన్నాడు/ అయివున్నది 

are= అయి ఉన్నారు

Example: 

1.I am a driver      (నేను ఒక డ్రైవర్ అయి ఉన్నాను)(ప్రస్తుతం అతని పరిస్థితి ఒక డ్రైవర్    

2.She is a lawyer   (ఆమె ఒక లాయర్ అయి ఉన్నది)               

3.They are  farmers (వారు రైతులు అయి ఉన్నారు)               

Example: 

They are soldiers  (PS) ( వారు సైనికులు లేదా  వారు  సైనికులు అయి ఉన్నారు)

పై వాక్యాన్ని వ్యతిరేక వాక్యంగా మార్చుటకు సహాయక క్రియ అయిన are పక్కన not ఉంచాలి. 

They are not soldiers (NS) 

ఇక్కడ They are do not soldiers అని ఎందుకు రాయలేదు. They are soldiers ఈ వాక్యంలో verb లేదు are అనే సహాయక క్రియ Main verb గా వ్యవహరిస్తూ సంపూర్ణ వాక్యాన్ని నిర్మించింది. కాబట్టి are మెయిన్ వెర్బ్ స్థానంలోకి వెళ్లిపోయింది గనుక ఈ వాక్యంలో సహాయక క్రియ లేదు. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో I, We, You, They సబ్జెక్టులు ఉండి సహాయక్రియ లేకపోతే Do అనే సహాయక్రియ చేర్చుకోవాలి అని చెప్పుకున్నాం.కాని పై వాక్యంలో are  అనే సహాయక్రియ ఆల్ రెడీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. కాబట్టి మరొక సింపుల్ ప్రెసెంట్ టెన్స్ సహాయక క్రియ Do ను ఉపయోగించకూడదు. ఒకే వాక్యములో రెండు  సహాయక క్రియలు ఉపయోగించకూడదు. కాబట్టి ఇలాంటి వాక్యాలలో Do తీసివేసి కేవలం not మాత్రమే వ్యతిరేక వాక్యాలకు ఉపయోగిస్తాము. 

పాజిటివ్ సెంటెన్స్ ని మరియు నెగిటివ్  సెంటెన్స్ ని  రెండింటిని ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు సహాయక క్రియ అయిన are ని  సబ్జెక్ట్ అయిన They కి  ముందు ఉంచితే సరిపోతుంది.(spoken english to telugu)

Are they soldiers? (IS)

Are they not soldiers? (NIS) 

వాక్యంలో am, is, are ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వ్యతిరేక వాక్యంగా మార్చుటకు వాటి పక్కన not వుంచాలి.

Examples:

1.They are happy. వారు సంతోషంగా ఉన్నారు.
They are not happy. వారు సంతోషంగా లేరు.
Are they happy? వారు సంతోషంగా ఉన్నారా?
Are they not happy? వారు సంతోషంగా లేరా?
2.You are a teacher. మీరు గురువు.
You are not a teacher. మీరు గురువు కాదు.
Are you a teacher? మీరు ఉపాధ్యాయులా?
Are you not a teacher? మీరు గురువు కాదా?
3.We are ready. మేము సిద్ధంగా ఉన్నాము.
We are not ready. మేము సిద్ధంగా లేము.
Are we ready? మేము సిద్ధంగా నామా?
Are we not ready? మేము సిద్ధంగా లేమా?

4.The kids are playful.

పిల్లలు ఉల్లాసంగా ఉన్నారు

The kids are not playful. పిల్లలు ఉల్లాసంగా లేరు
Are the kids playful? పిల్లలు ఉల్లాసంగా ఉన్నారా?
Are the kids not playful? పిల్లలు ఉల్లాసంగా లేరా?
5.These books are interesting. ఈ పుస్తకాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
These books are not interesting. ఈ పుస్తకాలు ఆసక్తికరంగా లేవు.
Are these books interesting? ఈ పుస్తకాలు ఆసక్తికరంగా ఉన్నాయా?
Are these books not interesting? ఈ పుస్తకాలు ఆసక్తికరంగా లేవా?
6.She and I are friends. ఆమె మరియు నేను స్నేహితులు.
She and I are not friends. ఆమె మరియు నేను స్నేహితులు కాదు.
Are she and I friends? ఆమె మరియు నేను స్నేహితులా?
Are she and I not friends? ఆమె మరియు నేను స్నేహితులు కాదా?
7.The rooms are clean. గదులు శుభ్రంగా ఉన్నాయి.
The rooms are not clean. గదులు శుభ్రంగా లేవు.
Are the rooms clean? గదులు శుభ్రంగా ఉన్నాయా?
Are the rooms not clean? గదులు శుభ్రంగా లేవా?

8.The dogs are loyal.

కుక్కలు విశ్వాసపాత్రమైనవి.

The dogs are not loyal. కుక్కలు విశ్వాసపాత్రమైనవి కావు.
Are the dogs loyal? కుక్కలు విశ్వాసపాత్రంగా ఉన్నాయా?
Are the dogs not loyal? కుక్కలు విశ్వాసపాత్రులు కాదా?
9.The flowers are beautiful. పువ్వులు అందంగా ఉన్నాయి.
The flowers are not beautiful. పువ్వులు అందంగా లేవు.
Are the flowers beautiful? పువ్వులు అందంగా ఉన్నాయా?
Are the flowers not beautiful? పువ్వులు అందంగా లేవా?
10.The lights are bright. లైట్లు ప్రకాశవంతంగా ఉన్నాయి.
The lights are not bright. లైట్లు ప్రకాశవంతంగా లేవు
Are the lights bright? లైట్లు ప్రకాశవంతంగా ఉన్నాయా?
Are the lights not bright? లైట్లు ప్రకాశవంతంగా లేవా?

 

Simple present tense లో సబ్జెక్టు ‘I’ యొక్క స్తితిని తెలియజేయడానికి ‘am’  అను సహాయక క్రియను  ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తారు. 

1.I am happy. నేను సంతోషంగా ఉన్నాను.
I am not happy. నేను సంతోషంగా లేను.
Am I happy? నేను సంతోషంగా ఉన్నానా?
Am I not happy? నేను సంతోషంగా లేనా?
2.I am a student. నేను విద్యార్థిని.
I am not a student. నేను విద్యార్థిని కాదు.
Am I a student? నేను విద్యార్థినా?
Am I not a student? నేను విద్యార్థిని కాదా?
3.I am ready for the exam. నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నాను.
I am not ready for the exam. నేను పరీక్షకు సిద్ధంగా లేను.
Am I ready for the exam? నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నానా?
Am I not ready for the exam? నేను పరీక్షకు సిద్ధంగా లేనా?

4.I am confident about my decision.

నా నిర్ణయంపై నాకు నమ్మకం ఉంది.

I am not confident about my decision. నా నిర్ణయంపై నాకు నమ్మకం లేదు.
Am I confident about my decision? నా నిర్ణయంపై నాకు నమ్మకం ఉందా?
Am I not confident about my decision? నా నిర్ణయంపై నాకు నమ్మకం లేదా?
5.I am in the living room. నేను గదిలో ఉన్నాను.
I am not in the living room. నేను గదిలో లేను.
Am I in the living room? నేను గదిలో ఉన్నానా?
Am I not in the living room? నేను గదిలో లేనా?

 

ఇప్పటివరకు  సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో I,  we, You, They లకు Action sentences,Possessive sentences,  state sentences ఎలాగ నిర్మించాలో తెలుసుకున్నాం. 

ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో  singular third persons అయినా He, She, It లకు Action sentences, possessive sentences, state sentences,ఎలాగ నిర్మించాలో తెలుసుకుందాం.

 

Simple present tense లో He, She, IT లకు Action sentences : 

Third person singulars అయిన  He,She,It,That వాక్యాలలో వచ్చినప్పుడు  verb యొక్క మొదటి రూపానికి  ‘es’ లేదా ‘s’ లేదా ‘ies’ కలుపుతారు.మరియు ‘Does’ అనే సహాయక క్రియను  ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తారు.

( Plural subjects అయిన we,you,they లకు మరియు I కి verbs  మొదటి రూపానికి ఎటువంటి మార్పు చేయరు). (spoken english to telugu)

Examples: 

He goes to college.  (He does go to college). అతను కాలేజీకి వెళ్తాడు.
She comes to here. (She does come to here). ఆమె  ఇక్కడికి వస్తుంది.
Ramesh asks him. (Ramesh does ask him).   రమేష్ అతనిని అడుగుతాడు.

పైన ఇవ్వబడిన వాక్యాల యొక్క నిజమైన రూపాలు does అను సహాయక క్రియను ఉపయోగించి బ్రాకెట్లలో ఇవ్వబడి ఉన్నాయి. కానీ మాట్లాడేటప్పుడు Does తీసివేసి verb యొక్క మొదటి రూపానికి  es లేదా s లేదా ies కలిపి మాట్లాడతారు. కానీ వ్యతిరేక వాక్యాలు(Negative sentences) మరియు ప్రశ్న వాక్యాలు (Interrogative sentences) మాట్లాడేటప్పుడు Does ని తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది.

అతను కాలేజీకి వెళతాడు, ఆమె  ఇక్కడికి వస్తుంది, రమేష్ అతనిని అడుగుతాడు అంటే ఈ పనులు ఎప్పుడు జరుగుతాయి.Simple present tense లో రెండు అర్థాలు ఉంటాయి అవి 1. ప్రతిరోజు జరుగుతాయి. 2.లేదా ఈరోజు మాత్రమే ప్రత్యేకంగా జరుగుతాయి. అని అర్థం చేసుకోవాలి. 

ఇప్పుడు పైనున్న వాక్యాలను ఏ మార్పు చేయకుండా మరొకసారి క్రింద రాశాము గమనించండి. 

1.He goes to college .

2.She comes to here.

3.Ramesh asks him. 

పై వాక్యాలను గమనిస్తే సబ్జెక్టు లైన He,She,Ramesh లకు  verb మొదటి రూపాలైన go, come, ask లకు “es” లేదా ”s” కలిపినారు.( es, s ies కింద వివరించియున్నాము) 

ఇప్పుడు పై వాక్యాలకు నెగిటివ్ సెంటెన్స్ రాయాలి కాబట్టి. సబ్జెక్టు లైన He,She,Ramesh, కుడి పక్కన Does అనే సహాయక క్రియ దాగి ఉన్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు దానిని బయటకు తీసి Does పక్కనే not చేరిస్తే ఆ వాక్యం నెగటివ్ సెంటెన్స్ గా మారిపోతుంది.

సాధారణంగా వ్యతిరేక పదం Not. కానీ Tenses లో  వ్యతిరేక వాక్యాలు రాయటానికి ఆయా Tenses కి కేటాయించబడిన సహాయక క్రియల సపోర్ట్ తోటి Not ఉపయోగించాలి. 

అయితే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It  లకు Action sentences లో కేటాయించబడిన సహాయక క్రియ Does కాబట్టి వ్యతిరేకవాక్యంగా మార్చుటకు Does not ఉపయోగించాలి.

He does not goes to college 

కానీ నెగిటివ్ సెంటెన్స్ ని ఇలా రాయడం కూడా తప్పు అవుతుంది 

ఎందుకంటే,  Does మరియు goes రెండింటికి చివర ‘es’ ఉంది.   ఇక్కడ Does ఉపయోగించినప్పుడే ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న సంగతి మనకు అర్థమవుతుంది. (spoken english to telugu)                 

ఇక్కడ go అనే వెర్బ్ కి ‘es’ చేర్చడం వలన ఇది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి సహాయక క్రియలు కాలాన్ని తెలియజేస్తున్నప్పుడు verb కి ఆ పని అనవసరం. కాబట్టి ఇక్కడ ‘go’ కి ఉన్న ‘es’ ని తీసివేస్తాము.

Do, Does, Did లు వాక్యంలో కనిపించినప్పుడు Verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి.  గ్రామర్ రూల్ ప్రకారం.

అప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ని He does not go to college అని రాయాలి.

He goes to college (P)

He does not go to college (N)

పై  పాజిటివ్ సెంటెన్స్ ని ప్రశ్న  వాక్యంగా మార్చుటకు సబ్జెక్ట్ అయినా He కి కుడి పక్కనే దాగి ఉన్న Does ని మొదటిలో ఉంచి goes లో  ఉన్న es ని తీసివేస్తే సరిపోతుంది.

Does he go to college (I)

పై నెగటివ్ సెంటెన్స్ ని ప్రశ్న వాక్యంగా మార్చుటకు Does  ను తీసి సబ్జెక్టు He కి ముందు ఉంచితే సరిపోతుంది

Does he not go to college (NI)

పై వాక్యాన్ని Doesn’t he go to college అని కూడా రాయవచ్చు.

 

అదేవిధంగా రెండవ మరియు మూడవ వాక్యాలను రాసినట్లయితే

2. She comes to here  (PS)

She does not come to here  (NS)

Does she come to here (IS)

Does she not come to here (NIS)

 

3.Ramesh asks him (PS)

Rmesh does not ask him (NS)

Does Ramesh ask him  (IS)

Does Ramesh not ask him (NIS)

Simple present tense లో He,She,It,That లు వాక్యాలలో వచ్చినప్పుడు, వాక్య నిర్మాణం చేయడానికి verb యొక్క మొదటి రూపానికి (V1) ‘es’ లేదా ‘s’ లేదా ‘ies’ కలపాలి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

Rule no.1

Simple present tense లో  He, She, It, That లతో వాక్య నిర్మాణం చేయడానికి Verb మొదటి రూపానికి ‘es’ ఎప్పుడు కలపాలి? 

ఏవైనా verb లు  ch, sh, s, ss, o, x, z లతో ముగించబడితే  అటువంటి verbs కు ‘es’ కలపాలి.

Examples:

Ending with “ch” sh s ss
1. Watch.

 2. Teach.

 3. Reach.

1. Push.

2. Wash.

3. Finish.

1. Kiss.

2. Pass.

3. Guess.

  1. Miss.

  2. Cross.

  3. Toss.

 

o x z
1. Go.

  2. Do.

  3. Echo.

1. Fix.

2. Mix.

3. Relax.

1. Buzz.

 2. Fuzz.

 3.Jazz.

పై  పట్టికలో ఉన్న విధంగా verb లు  ch, sh, s, ss, o, x, z లతో ముగించబడితే  అటువంటి verb లకు అన్నింటికీ చివర es కలపాలి.ఇటువంటివి verbs ఇంకా చాలా ఉంటాయి మీకు అర్థం అవడం కోసం కొన్ని మాత్రమే ఇచ్చాము. ఇప్పుడు పై verbs అన్నిటినీ వాక్యాలలో ఉపయోగించి చూద్దాం.

Examples: హైలెట్ చేసిన పాజిటివ్ సెంటెన్స్ అన్నిటిని మొదట చదవండి. తర్వాత Negative, interrogative, negative interrogative లను పరీక్షించండి.

1.She watches the sunset every evening .

ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూస్తుంది.

She does not watch the sunset every evening . ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడదు.
Does she watch the sunset every evening? . ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూస్తుందా?
Does she not watch the sunset every evening? . ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడదా?
2.He teaches math at the local school. అతను స్థానిక పాఠశాలలో గణితం బోధిస్తాడు.
He does not teach math at the local school. అతను స్థానిక పాఠశాలలో గణితం బోధించడు.
Does he teach math at the local school?. అతను స్థానిక పాఠశాలలో గణితాన్ని బోధిస్తాడా?
Does he not teach math at the local school?. అతను స్థానిక పాఠశాలలో గణితాన్ని బోధించడా?
3.She reaches for the top shelf. ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకుంటుంది.
She does not reach for the top shelf. ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకోదు.
Does she reach for the top shelf?. ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకుంటుందా?
Does she not reach for the top shelf?. ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకోదా?

4.He pushes the door .

అతను తలుపు నెడతాడు.

He does not push the door . అతను తలుపు నెట్టడు.
Does he push the door? అతను తలుపు నెడతాడా?
Does he not push the door? అతను తలుపు నెట్టడా?
5.She washes the dishes after dinner. ఆమె రాత్రి భోజనం తర్వాత గిన్నెలు కడుగుతుంది.
She does not wash the dishes after dinner. ఆమె రాత్రి భోజనం తర్వాత గిన్నెలు కడగదు.
Does she wash the dishes after dinner? రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె గిన్నెలు కడుగుతుందా?
Does she not wash the dishes after dinner? రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె గిన్నెలు కడగదా?
6.He finishes his homework quickly. అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేస్తాడు.
He does not finish his homework quickly. అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేయడు.
Does he finish his homework quickly? అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేస్తాడా?
Does he not finish his homework quickly? అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేయడా?
7.She kisses her child goodnight. ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దు పెట్టుకుంటుంది.
She does not kiss her child goodnight. ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దు పెట్టుకోదు.
Does she kiss her child goodnight? ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దులు పెడుతుందా?
Does she not kiss her child goodnight? ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దు పెట్టుకోదా?

8.He passes the ball to his teammate.

అతను బంతిని తన సహచరుడికి పంపుతాడు.

He does not pass the ball to his teammate. అతను తన సహచరుడికి బంతిని  పంపడు.
Does he pass the ball to his teammate? అతను తన సహచరుడికి బంతిని పంపుతాడా?
Does he not pass the ball to his teammate? అతను తన సహచరుడికి బంతిని  పంపడా?
9.She guesses the answer correctly. ఆమె సమాధానాన్ని సరిగ్గా ఊహిస్తుంది.
She does not guess the answer correctly. ఆమె సమాధానం సరిగ్గా ఊహించదు.
Does she guess the answer correctly? ఆమె సమాధానం సరిగ్గా ఊహిస్తుందా?
Does she not guess the answer correctly? ఆమె సమాధానం సరిగ్గా ఊహించదా?
10.She misses her bus every morning. ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోతుంది .(మిస్ చేసుకుంటుంది).
She does not miss her bus every morning. ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోదు.
Does she miss her bus every morning? ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోతుందా?
Does she not miss her bus every morning? ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోదా? 
11.He crosses the street carefully. అతను జాగ్రత్తగా వీధి దాటుతాడు.
He does not cross the street carefully. అతను జాగ్రత్తగా వీధి దాటడు.
Does he cross the street carefully? అతను జాగ్రత్తగా వీధి దాటుతాడా?
Does he not cross the street carefully? అతను జాగ్రత్తగా వీధి దాటడా?

12.She tosses the paper into the trash.

ఆమె కాగితాన్ని చెత్తబుట్టలోకి విసురుతుంది .

She does not toss the paper into the trash. ఆమె కాగితాన్ని చెత్తబుట్టలోకి  విసరదు.
Does she toss the paper into the trash? ఆమె కాగితాన్ని చెత్తబుట్టలో పడేస్తుందా?
Does she not toss the paper into the trash? ఆమె కాగితాన్ని చెత్తబుట్టలో వేయదా?
13.He goes to work by bus. అతను బస్సులో పనికి వెళ్తాడు.
He does not go to work by bus. అతను బస్సులో పనికి వెళ్లడు.
Does he go to work by bus? అతను బస్సులో పనికి వెళ్తాడా?
Does he not go to work by bus? అతను బస్సులో పనికి వెళ్లడా?
14.She does her homework every day. ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేస్తుంది.
She does not do her homework every day. ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేయదు.
Does she do her homework every day? ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేస్తుందా?
Does she not do her homework every day? ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేయదా?
15.The sound echoes through the cave. గుహలో ధ్వని ప్రతిధ్వనిస్తుంది.

Through= ద్వారా, గుండా

The sound does not echo through the cave. గుహలో ధ్వని ప్రతిధ్వనించదు.
Does the sound echo through the cave? గుహ ద్వారా ధ్వని ప్రతిధ్వనిస్తుందా?
Does the sound not echo through the cave? గుహ గుండా ధ్వని ప్రతిధ్వనించదా?

16.He fixes the broken chair

అతను విరిగిన కుర్చీని సరిచేస్తాడు.

He does not fix the broken chair. అతను విరిగిన కుర్చీని సరిచేయడు.
Does he fix the broken chair? అతను విరిగిన కుర్చీని సరిచేస్తాడా?
Does he not fix the broken chair? అతను విరిగిన కుర్చీని సరిచేయడా?
17.She mixes the ingredients well. ఆమె పదార్థాలను బాగా కలుపుతుంది.
She does not mix the ingredients well. ఆమె పదార్థాలను బాగా కలపదు.
Does she mix the ingredients well? ఆమె పదార్థాలను బాగా కలుపుతుందా?
Does she not mix the ingredients well? ఆమె పదార్థాలను బాగా కలపదా?
18.He relaxes after a long day. అతను చాలా రోజుల తర్వాత  విశ్రాంతి తీసుకుంటాడు.
He does not relax after a long day. చాలా రోజుల తర్వాత అతను విశ్రాంతి తీసుకోడు .
Does he relax after a long day? అతను చాలా రోజుల తర్వాత విశ్రాంతి తీసుకుంటాడా?
Does he not relax after a long day? చాలా రోజుల తర్వాత అతను విశ్రాంతి తీసుకోడా?
19.The bee buzzes around the flowers. పువ్వుల చుట్టూ తేనెటీగ సందడి చేస్తుంది.
The bee does not buzz around the flowers. తేనెటీగ పువ్వుల చుట్టూ సందడి చేయదు.
Does the bee buzz around the flowers? పువ్వుల చుట్టూ తేనెటీగ సందడి చేస్తుందా?
Does the bee not buzz around the flowers? తేనెటీగ పువ్వుల చుట్టూ సందడి చేయదా?

20.He notices the fuzzes on his sweater.

అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని గమనిస్తాడు.

He does not notice the fuzz on his sweater. అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని గమనించడు.
Does he notice the fuzz on his sweater? అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని గమనిస్తాడా?
Does he not notice the fuzz on his sweater? అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని  గమనించడా?
21.She plays chess at the club every Friday. ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడుతుంది.
She does not play chess at the club every Friday. ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడదు.
Does she play chess at the club every Friday? ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడుతుందా?
Does she not play chess at the club every Friday? ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడదా?

 

Rule No :2 

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It,that  వాక్యంలో వచ్చినప్పుడు verb కి  చివర ‘s’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం. 

ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి

అచ్చులు (Vowels) : A E I O U  

హల్లులు( consonants) : B C D  F G H  J K L M N  P Q R S T  V W X Y Z

ఏ Verbs లైతే చివర ఒక vowel తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘s’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .

 

Play Stay Enjoy Obey Convey

ఫై verbs ని వాక్యాలలో ఉపయోగించి చూద్దాము.

Examples: హైలెట్ చేసిన పాజిటివ్ సెంటెన్స్ అన్నిటిని మొదట చదవండి. తర్వాత Negative, interrogative, negative interrogative లను పరీక్షించండి.

1.She plays the piano beautifully (PS) ఆమె పియానోను అందంగా ప్లే చేస్తుంది
She does not play the piano beautifully (NS) ఆమె పియానోను అందంగా వాయించదు
Does she play the piano beautifully? (IS) ఆమె పియానోను అందంగా ప్లే చేస్తుందా?
Does she not play the piano beautifully? (NIS) ఆమె పియానోను అందంగా వాయించదా?
2.He stays at home on weekends వారాంతాల్లో ఇంట్లోనే ఉంటాడు
He does not stay at home on weekends వారాంతాల్లో ఇంట్లో ఉండడు
Does he stay at home on weekends? అతను వారాంతాల్లో ఇంట్లో ఉంటాడా?
Does he not stay at home on weekends? అతను వారాంతాల్లో ఇంట్లో ఉండడా?
3.She enjoys going to the beach ఆమె బీచ్‌కి వెళ్లడం ఆనందిస్తుంది
she does not enjoy going to the beach ఆమె బీచ్‌కి వెళ్లడం ఆనందించదు
Does she enjoy going to the beach? ఆమె బీచ్‌కి వెళ్లడం ఆనందిస్తుందా?
Does she not enjoy going to the beach? ఆమె బీచ్‌కి వెళ్లడం  ఆనందించదా?

4.The dog obeys its owner’s commands

కుక్క తన యజమాని ఆదేశాలను పాటిస్తుంది

The dog does not obey its owner’s commands కుక్క తన యజమాని ఆదేశాలను పాటించదు
Does the dog obey its owner’s commands? కుక్క తన యజమాని ఆదేశాలను పాటిస్తుందా?
Does the dog not obey its owner’s commands? కుక్క తన యజమాని ఆదేశాలను పాటించదా?
5.He conveys his message clearly అతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు
He does not convey his message clearly అతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేయడు
Does he convey his message clearly? అతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తాడా?
Does he not convey his message clearly? అతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేయడా?

 

Rule No.3

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It,that  వాక్యంలో వచ్చినప్పుడు verb మొదటి రూపానికి   చివర ‘ies’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం. 

ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి

అచ్చులు (Vowels) : A E I O U  

హల్లులు( consonants) : B C D  F G H  J K L M N  P Q R S T  V W X Y Z

ఏ Verbs లైతే చివర ఒక consonant తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘ies’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .

Study Hurry Worry Fly Try

పై verbs ని వాక్యంలో ఉపయోగించు చూద్దాము.

Examples: హైలెట్ చేసిన పాజిటివ్ సెంటెన్స్ అన్నిటిని మొదట చదవండి. తర్వాత Negative, interrogative, negative interrogative లను పరీక్షించండి.

1.She studies every day (PS)

ఆమె రోజూ చదువుకుంటుంది (spoken english to telugu)

She does not study every day (NS) ఆమె రోజూ చదువుకోదు
Does she study every day? (IS) ఆమె రోజూ చదువుతుందా?
Does she not study every day?(NIS) ఆమె రోజూ చదువుకోదా?
2.He hurries to catch the bus అతను బస్సును పట్టుకోవడానికి తొందరపడతాడు
He does not hurry to catch the bus అతను బస్సును పట్టుకోవడానికి తొందరపడడు
Does he hurry to catch the bus? అతను బస్సును పట్టుకోవడానికి తొందర పడతాడా?
Does he not hurry to catch the bus? అతను బస్సును పట్టుకోవడానికి  తొందరపడడా?
3.He worries about the exam అతను పరీక్ష గురించి చింతిస్తాడు.
He does not worry about the exam అతను పరీక్ష గురించి చింతించడు
Does he worry about the exam? అతను పరీక్ష గురించి చింతిస్తాడా?
Does he not worry about the exam? అతను పరీక్ష గురించి  చింతించడా?(spoken english to telugu)

4.It flies high in the sky

ఇది ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుంది

It does not fly high in the sky ఇది ఆకాశంలో ఎత్తుగా ఎగరదు
Does it fly high in the sky? ఇది ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుందా?
Does it not fly high in the sky? ఇది ఆకాశంలో ఎత్తుగా ఎగరదా?
5.She tries her best in every competition ప్రతి పోటీలో ఆమె తన వంతు (సాధ్యమైనంతగా) ప్రయత్నం చేస్తుంది 
She does not try her best in every competition ప్రతి పోటీలో ఆమె తన వంతు ప్రయత్నం చేయదు
Does she try her best in every competition? ప్రతి పోటీలో ఆమె తన వంతు ప్రయత్నిస్తుందా?
Does she not try her best in every competition? ప్రతి పోటీలో ఆమె తన వంతు ప్రయత్నం చేయదా?

 

Rule No.4:

 సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He,She,It,That 

లతో వాక్య నిర్మాణం చేసేటప్పుడు Verb మొదటి రూపానికి చివర sh, ch, ss, s, o, x, z. y

అక్షరాలలో ఏది  లేకపోయినట్లు అయితే ఆ వెర్బ్ కి ‘s’ చేరిస్తే సరిపోతుంది.క్రింది పదాలను చూడండి.

Examples:

Eat Visti Travel Act Allow
Read Cook Write Agree Fail

పైన ఉన్న verbs అన్నింటినీ కూడా వాక్యాలలో ఉపయోగించి చూద్దాము

Examples: హైలెట్ చేసిన పాజిటివ్ సెంటెన్స్ అన్నిటిని మొదట చదవండి. తర్వాత Negative, interrogative, negative interrogative లను పరీక్షించండి.

1.He eats breakfast every morning.

అతను రోజూ ఉదయం అల్పాహారం తింటాడు.

He does not eat breakfast every morning. అతను ప్రతిరోజూ ఉదయం అల్పాహారం  తినడు.
Does he eat breakfast every morning? అతను ప్రతి ఉదయం అల్పాహారం తింటాడా?
Does he not eat breakfast every morning? అతను ప్రతి ఉదయం అల్పాహారం తినడా?
2. She reads novels in her free time. ఖాళీ సమయాల్లో ఆమె నవలలు చదువుతుంది.(spoken English to telugu)
She does not read novels in her free time. ఖాళీ సమయాల్లో ఆమె నవలలు చదవదు.
Does she read novels in her free time? ఆమె ఖాళీ సమయంలో నవలలు చదువుతుందా?
Does she not read novels in her free time? ఆమె ఖాళీ సమయంలో నవలలు చదవదా? 
3.Ramesh visits the garden often. రమేష్ తరచూ తోటను సందర్శిస్తాడు.
Ramesh does not visit the garden often. రమేష్ తరచూ తోటను  సందర్శించడు
Does Ramesh visit the garden often? రమేష్ తరచూ తోటను   సందర్శిస్తాడా.?
Does Ramesh not visit the garden often? రమేష్ తరచూ తోటను  సందర్శించడా.?

4.That cooks faster than expected.

ఇది ఊహించిన దాని కంటే వేగంగా ఉడికిస్తుంది.

That does not cook faster than expected. ఇది ఊహించిన దాని కంటే వేగంగా ఉడికించదు.
Does that cook faster than expected? ఇది ఊహించిన దాని కంటే వేగంగా  ఉడికిస్తుందా?.
Does that not cook faster than expected? ఇది ఊహించిన దాని కంటే వేగంగా ఉడికించదా.?
5.He travels to work by bus. అతను బస్సులో పనికి వెళ్తాడు.(అతను పనికి బస్సులో ప్రయాణిస్తాడు)
He does not travel to work by bus.   బస్సులో అతను పనికి వెళ్లడు.
Does he travel to work by bus? అతను బస్సులో పనికి వెళ్తాడా?
Does he not travel to work by bus? అతను బస్సులో పనికి వెళ్లడా?
6.She writes articles for a magazine. ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాస్తుంది
She does not write articles for a magazine. ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాయదు.
Does she write articles for a magazine? ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాస్తుందా?
Does she not write articles for a magazine? ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాయదా?
7.It acts quickly in emergencies. ఇది అత్యవసర పరిస్థితుల్లో త్వరగా పనిచేస్తుంది.
It does not act quickly in emergencies. ఇది అత్యవసర పరిస్థితుల్లో త్వరగా పని చేయదు.(spoken english to telugu)
Does it act quickly in emergencies? అత్యవసర పరిస్థితుల్లో ఇది త్వరగా పనిచేస్తుందా?
Does it not act quickly in emergencies? అత్యవసర పరిస్థితుల్లో ఇది త్వరగా పని చేయదా?

8.That agrees with the proposal.

అది ప్రతిపాదనతో ఏకీభవిస్తుంది.

That does not agree with the proposal. అది ప్రతిపాదనతో ఏకీభవించదు.
Does that agree with the proposal? అది ప్రతిపాదనతో ఏకీభవిస్తుందా.?
Does that not agree with the proposal? అది ప్రతిపాదనతో ఏకీభవించదా.?
9.He allows extra time for assignments. అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతిస్తాడు.
He does not allow extra time for assignments. అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతించడు.
Does he allow extra time for assignments? అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతిస్తాడా?
Does he not allow extra time for assignments? అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతించడా?
10.Usha fails to understand the concept. ఉష భావనను అర్థం చేసుకోవడంలో విఫలమైంది.(spoken english to telugu)
Usha does not fail to understand the concept. ఉష కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడంలో విఫలం కాలేదు.
Does Usha fail to understand the concept? ఉష భావనను అర్థం చేసుకోవడంలో విఫలమైందా?
Does Usha not fail to understand the concept? ఉష భావనను అర్థం చేసుకోవడంలో విఫలం కాలేదా? 

 

2.  సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోHe, SHe, It   లతో Possession sentences: 

పొసెసియన్ అనగా కలిగి ఉండు అని అర్థం. Ownership అని కూడా అనవచ్చు. 

అతనికి రెండు ఇల్లు ఉన్నాయి.  (అతను రెండు ఇళ్ళను కలిగి ఉన్నాడు)

 అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. (అతను  ఇద్దరు భార్యలను కలిగి ఉన్నాడు)

అతనికి ఈ రోజు మీటింగ్ ఉన్నది.  (అతను ఈరోజు మీటింగ్ ని కలిగి  ఉన్నాడు)

ఈ విధంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోHe, SHe, It లకు కలిగి ఉన్నాడు అనే  అర్ధాన్ని తెలియజేయడానికి .’Has’ అనే  సహాయక క్రియ ఉపయోగిస్తారు.

He, She, It   + Has + Object

క్రింది  పట్టిక లోని ఉదాహరణలు గమనించండి.

She has a car. (She does have a car). ఆమెకి ఒక కారు ఉన్నది. (Has= కలిగి ఉండుట)  ఆమెకి ఒక కారు ఉన్నది. అంటే  ఆమె ఒక కారు కలిగి ఉన్నది అని అర్థం.
Usha has two houses. (Usha does have two houses). ఉషాకి రెండు ఇళ్ళు ఉన్నాయి.

ఆమెకు కారు ఉన్నది, ఉషాకి రెండు ఇల్లు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి నిన్న, నేడు, రేపు కూడా ఉన్నాయి అని అర్థం.లేదా ప్రత్యేకంగా ఈరోజు మాత్రమే ఉన్నాయి అని కూడా అర్థం వస్తుంది. కానీ మాట్లాడినప్పుడు సందర్భానుసారంగా మనమే అర్థం చేసుకోవాలి.(spoken english to telugu)

She has a car. ఈ వాక్యాన్ని She does have a car అని కూడా రాయవచ్చు ఎందుకని?

సాధారణంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, she It లకు ‘Does’  అనే  సహాయక క్రియ ఉపయోగిస్తామని తెలుసుకున్నాము.ఈ సూత్రం  ప్రకారము

She does has a car అని  రాయాలి. కానీ Does  అనే  సహాయక క్రియ వచ్చినప్పుడు Has  దాని మొదటి రూపమైన  ‘have’  లోకి వెళ్ళిపోవాలి ఎందుకని? 

 సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She, It  లకు Does, Has రెండింటినీ ఉపయోగిస్తామని తెలుసు. ఈ విధంగా కాలాన్ని(Tense)  తెలియజేసే  రెండు క్రియలు ఒకే సెంటెన్స్ లో ఉండకూడదు. Does కాలాన్ని తెలియజేస్తున్నప్పుడు Has దాని మొదటి రూపమైన Have గా మారాలి. 

మరొక విధంగా చెప్పాలంటే పై వాక్యంలో Verb లేకపోయినప్పటికీ Has మెయిన్ వెర్బ్ గా వ్యవహరిస్తూ ఒక సంపూర్ణ వాక్యాన్ని నిర్మించింది. ఇక్కడ Has మెయిన్ వెర్బ్ స్థానంలోకి వెళ్లిపోయింది. గనుక ఈ సెంటెన్స్ లో సహాయక క్రియ లేదు. గ్రామర్ రూల్ ప్రకారం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She, It లు  సబ్జెక్టులు గా ఉన్నప్పుడు ఆ వాక్యం లో సహాయక క్రియ లేకపోతే  Does ఉపయోగించుకోవాలి. Does వాక్యం లో ఉన్నప్పుడు Verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి. ఇక్కడ Has మెయిన్ వెర్బే గాని సహాయక క్రియ కాదు.(spoken english to telugu)

Do,Does,Did  సహాయక్రియలు వాక్యంలో ఉన్నప్పుడు Verbs  మొదటి రూపంలోనే ఉండాలి. 

 

అప్పుడు She has a car  ని She does have a car  (P) అని కూడా రాయవచ్చు. నెగిటివ్ సెంటెన్స్ రాయటానికి ‘Does’ పక్కన not చేర్చాలి

 She does not have a car (N) అవుతుంది. ఈ రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చడానికి  Does ని  సబ్జెక్టు అయిన ‘She’  కి ముందు ఉంచాలి.

Does she have a car (I)

Does she not have a car (NI)

Sha has a car అను వాక్యానికి వ్యతిరేక వాక్యాన్ని She has no car అని కూడా  చెప్పవచ్చు కానీ ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరించడం లేదు

క్రింది  టేబుల్ లో ఉన్న  ఉదాహరణలు కూడా గమనించండి

1.She has a new car.

ఆమెకు కొత్త కారు ఉంది. (ఆమె ఒక కొత్త కారును కలిగి ఉంది)

She does not have a new car. ఆమెకు కొత్త కారు లేదు.
Does she have a new car? ఆమెకు కొత్త కారు ఉందా?
Does she not have a new car? ఆమెకు కొత్త కారు లేదా?
2.He has a meeting at 10 AM. ఆయనకు ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉంది.
He does not have a meeting at 10 AM. ఆయనకు ఉదయం 10 గంటలకు మీటింగ్ లేదు.
Does he have a meeting at 10 AM? అతనికి ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉందా?(spoken english to telugu)
Does he not have a meeting at 10 AM? అతనికి ఉదయం 10 గంటలకు మీటింగ్ లేదా?
3.The house has a big garden. ఇంట్లో పెద్ద తోట ఉంది. (ఆ ఇల్లు ఒక పెద్ద తోట కలిగి ఉన్నది)
The house does not have a big garden. ఇంట్లో పెద్ద గార్డెన్ లేదు.
Does the house have a big garden? ఇంట్లో పెద్ద తోట ఉందా?
Does the house not have a big garden? ఇంట్లో పెద్ద తోట లేదా?

4.My friend has a dog.

నా స్నేహితుడికి ఒక కుక్క ఉంది.

My friend does not have a dog. నా స్నేహితుడికి కుక్క లేదు.
Does my friend have a dog? నా స్నేహితుడికి కుక్క ఉందా?
Does my friend not have a dog? నా స్నేహితుడికి కుక్క లేదా?
5.The book has a blue cover. పుస్తకానికి నీలం రంగు కవర్ ఉంది.
The book does not have a blue cover. పుస్తకానికి నీలి రంగు కవర్ లేదు.
Does the book have a blue cover? పుస్తకానికి నీలి రంగు కవర్ ఉందా?
Does the book not have a blue cover? పుస్తకానికి నీలి రంగు కవర్ లేదా?

 

3. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It లకు  ‘ is’  అనే సహాయక క్రియను  ఉపయోగించి state sentences ని నిర్మించడం. 

state = స్థితి లేదా పరిస్థితి. 

స్థితి లేదా పరిస్థితి అంటే ఏమిటి?

రాము తింగరి తింగరిగా రోడ్డుమీద  బైక్ నడిపి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నాడు .(ప్రస్తుతం ఇది అతని పరిస్థితి) .

మా కోడిపుంజు ఇంటి మీదకి ఎక్కి ఉన్నది. ( ప్రస్తుతం కోడిపుంజు పరిస్థితి అది)

మహేష్ శ్రద్ధగా చదివి లెక్చరర్ అయి ఉన్నాడు. (ప్రస్తుతం  మహేష్ పరిస్థితి ఇది) 

నాకు ఈ రోజు మీటింగ్ ఉన్నది  (ఈరోజు మీటింగ్ పరిస్థితి ఇది)(spoken english to telugu)

Simple present tense లో Third person singulars అయిన He, She, It, That లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో తెలియజేయుటకు ‘is’ అనే సహాయక క్రియను ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తాము. 

Example:   He is a lawyer (P)

Negative sentence గా చేయుటకు is  ప్రక్కన not వుంచాలి 

He is not a lawyer (N) 

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు is ని సబ్జెక్టు అయిన He కి ముందు ఉంచితే సరిపోతుంది. (spoken english to telugu)

Is he a lawyer (I)

Is he not a lawyer (NI)

క్రింది పట్టిక లోని ఉదాహరణలను కూడా చదవండి.

1.She is a doctor. (PS)

ఆమె ఒక వైద్యురాలు.

She is not a doctor. (NS) ఆమె వైద్యురాలు కాదు.
Is she a doctor? (IS) ఆమె వైద్యురాలా ?
Is she not a doctor? (NIS) ఆమె డాక్టర్ కాదా?
2.The sky is blue. ఆకాశం నీలంగా ఉంది.
The sky is not blue. ఆకాశం నీలంగా లేదు.
Is the sky blue? ఆకాశం నీలంగా ఉందా?
Is the sky not blue? ఆకాశం నీలంగా లేదా?
3.He is very kind. అతను చాలా దయగలవాడు.
He is not very kind. అతను చాలా దయగలవాడు కాదు.
Is he very kind? అతను చాలా దయగలవాడా?
Is he not very kind? అతను చాలా దయగలవాడు కాదా?

4.The cake is delicious.

కేక్ రుచికరమైనది.

The cake is not delicious. కేక్ రుచికరమైనది కాదు.
Is the cake delicious? కేక్ రుచికరమైనదా?
Is the cake not delicious? కేక్  రుచికరమైనది కాదా?
5.It is a sunny day. ఇది ఎండ రోజు.
It is not a sunny day. ఇది ఎండ రోజు కాదు.
Is it a sunny day? ఇది ఎండ రోజునా?
Is it not a sunny day? ఇది ఎండ రోజు కాదా?
6.The room is spacious. గది విశాలంగా ఉంది.(spoken english to telugu)
The room is not spacious. గది విశాలంగా లేదు.
Is the room spacious? గది విశాలంగా ఉందా?
Is the room not spacious? గది విశాలంగా లేదా?
7.The car is new. కారు కొత్తది.
The car is not new. కారు కొత్తది కాదు.
Is the car new? కారు కొత్తదా?
Is the car not new? కారు కొత్తది కాదా?

8.This book is fascinating.

ఈ పుస్తకం మనోహరమైనది.

This book is not fascinating. ఈ పుస్తకం మనోహరమైనది కాదు.
Is this book fascinating? ఈ పుస్తకం మనోహరంగా ఉందా?
Is this book not fascinating? ఈ పుస్తకం మనోహరమైనది కాదా?
9.The water is cold. నీరు చల్లగా ఉంది.
The water is not cold. నీరు చల్లగా లేదు.
Is the water cold? నీరు చల్లగా ఉందా?
Is the water not cold? నీరు చల్లగా లేదా?
10.The cat is asleep. పిల్లి నిద్రలో ఉంది
The cat is not asleep. పిల్లి నిద్రలో లేదు
Is the cat asleep? పిల్లి నిద్రలో ఉందా?
Is the cat not asleep? పిల్లి నిద్రలో లేదా?

ఇంతవరకు మీరు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ను He, She, It, I, We, You, They సబ్జెక్టులకు Do, Does, Have, Has, Is, Are, Am అను సహాయక క్రియలను ఉపయోగించి ఏ విధంగా వాక్య నిర్మాణం చేయాలో తెలుసుకున్నారు

ఇకనుండి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో  సంపూర్ణంగా తెలుసుకుందాము.

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

 

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!