Vanjaram fish and vanjaram fish in telugu
వంజరం (vanjaram fish) చేపను భారతదేశంలోనూ మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతున్నటువంటి చేప. ఎందుకంటే దాని యొక్క రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉత్తమమైనవి కాబట్టి. ఈ చేపను ఫ్రై, గ్రిల్డ్ మరియు గ్రేవీ రూపంలో ప్రజలు తినడానికి ఇష్టపడతారు. ఈ చేపను ఊరగాయ కూడా పెట్టుకుంటారు.
ఈ చేపల్లో వివిధ భాషలలో మనదేశంలో కింది విధంగా పిలుస్తారు.
మరాఠీలో సుర్మయీ అని,తమిళం లో వంజరం నెయ్మీన్ గాను, మలయాళంలో నెయ్ మూన్ అని,తుళు లో అంజల్ అనీ, కన్నడంలో ఆర్కోలి గాను, కొంకణిలో ఇశ్వానని, శ్రీలంకలో ధోరా అని పిలుస్తారు.
వంజరం(vanjaram fish) చేపను భారతదేశంలోనూ మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతున్నటువంటి చేప. ఎందుకంటే దాని యొక్క రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉత్తమమైనవి కాబట్టి. ఈ చేపను ఫ్రై, గ్రిల్డ్ మరియు గ్రేవీ రూపంలో ప్రజలు తినడానికి ఇష్టపడతారు.
ఈ చేప ఎక్కువగా హిందూ మహాసముద్రంలో మరియు దానిని ఆనుకుని వున్న సముద్రాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది అత్యంత వేగంగా ఈద గలచేప ఈ చేపను పట్టుకోవడం చాలా కష్టం. ఇది దాదాపుగా 45 కిలోల వరకూ పెరుగుతుంది. దీనికి పదునైనదంతాలు కూడా ఉంటాయి. ఈ వంజరం చేప ను సాధారణంగా కొన్ని పేర్లతో పిలుస్తారు అవి. డాగి, జెయింట్ మాకేరల్, కింగ్ ఫిష్ లేదా సీర్ ఫిష్ అని పిలుస్తుంటారు.
vanjaram fish in telugu
మన తెలుగులో వంజరం చేపను వంజరం చేప అనే అంటారు. దీనితో పాటుగా కొన్ని స్థానిక పేర్లు కూడా ఉన్నాయి అవి
కొనేమా, కొనేము.
వంజరం.
vanjaram fish in english
ఈ వంజరం చేప ను ఆంగ్లంలో స్పానిష్ మాకెరల్
సీర్ ఫిష్ లేదా కింగ్ ఫిష్ అని పిలుస్తారు
vanjaram fish price
150 రూపాయల నుండి 200 రూపాయల లోపు అన్ని ప్రాంతాలలో ఉండవచ్చు.(vanjaram fish price)
100 గ్రాముల వంజరం చేప లో ఉండే టువంటి పోషకాలు క్రింది విధంగా ఉన్నాయి.
కొవ్వు – 8.95 గ్రా
శక్తి (కేలరీలు) 199.3 Kcal/కేలరీలు
సంతృప్త కొవ్వు – 1.0 గ్రా .పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు – 0.93 గ్రా
మోనోశాచురేటెడ్ కొవ్వు – 3.65 గ్రా
విటమిన్ A – 36.89 %
VitaminB-12 -7.85 %
విటమిన్ B-6 – 35.47 % .
Vitamin C – 3.6 %
ప్రోటీన్ – 25.30 8
ఒమేగా-3 423 mgB
ఒమేగా – 6 – 51 మి.గ్రా
కొలెస్ట్రాల్ – 63.78
చక్కెరలు – 0.21 గ్రా .
డైటరీ ఫైబర్ – 1.83 గ్రా పొటాషియం-580.906mg
మొత్తం కార్బోహైడ్రేట్ – 3.60 గ్రా
సోడియం – 1,031.55 మి.గ్రా
విటమిన్ E – 2.5 %
కాల్షియం – 6.6 %
ఇనుము – 27.84 %
మెగ్నీషియం – 12.85 %
జింక్ – 8.7 %
రాగి – 4.7 %
ఫోలేట్ – 2.88 %
వంజరం చేప యొక్క ఆరోగ్యప్రయోజనాలు.
VitaminA
1. విటమిన్ A వలన మనకి మంచి కంటి చూపు లభిస్తుంది ఆకుకూరల్లో విటమిన్A ఉన్నప్పటికీ వంజరం చేపల్లో ఉన్న విటమిన్ A మన శరీరానికి సులభంగా అందుతుంది.
Vitamin B 12
2. మన శరీరంలోని నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి కొత్తఎర్రరక్తకణాలు పుట్టడానికి vitaminB12 అవసరం
ఈ విటమిన్ లోపించినట్లు అయితే మతిమరుపు, నిస్సత్తువ, నీరసం, యూరిన్ ఆపుకోలేక పోవడం వంటి సమస్యలు వస్తాయి. మనం వంజరం(vanjaram fish in telugu) చేప తీసుకున్నట్లయితే మనకు vitaminB12 సమృద్ధిగా లభిస్తుంది.
Vitamin B6
3. మన శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ బి 6 కూడా ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్. ముఖ్యంగా ప్రోటీన్లు carbohydrates, మెటబాలిజం కు, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడానికి, vitamin b6 ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరం వీటిని స్వతహాగా తయారు చేసుకోలేదు. ఆహారం ద్వారానే దీనిని మనం తీసుకోవలసి ఉంటుంది. మనం వంజరం చేప తీసుకున్నట్లయితే vitamin b6 పొందవచ్చు.
VitaminC
4) వంజరం చేపలో ఉండే విటమిన్-సి సూక్ష్మజీవులు, వైరస్ నుండి మన శరీరానికి కాపాడడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరానికి కొల్లఅర్జిన్ అనే ప్రొటీన్ తయారీకి విటమిన్ c అవసరం. గుండె పనితీరును మెరుగు పరచడంతో పాటు ఆహారంలోని ఐరన్ మనశరీరానికి అందడానికి విటమిన్ సి అవసరం. వంజరం(vanjaram fish in telugu) చేపలను ఆహారంలో చేర్చుకున్నట్లు అయితే మనకి విటమిన్-సి అందుతుంది.
Protine
5) వంజరం చేపలో ఉండే ప్రోటీన్ కణజాలాల ఉత్పత్తికి, కొత్త కణాలు తయారు చేయడానికి, చెడిపోయిన కణాలను రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. శరీర ఆకృతి, కండపుష్టి జరగాలంటే మనకి ప్రోటీన్స్ అవసరం
Omega 3 fatty acids(Vanjaram fish)
6) ఈ వంజరం చేపల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త సరఫరా సాఫీగా జరిగేటట్లు చేస్తుంది. అందువలన రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా గుండె సంబంధమైన వ్యాధులు కూడా దరికి చేరవు. మతిమరుపు, అల్జీమర్స్ వంటి వాటిని నివారించు కలుగుతుంది.
fibre
7) వంజరం(vanjaram fish in telugu) చేపలో ఉండే ఫైబర్ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో ఏర్పడే మలినాలను తొలగిస్తుంది. ఫైబర్ శరీరములో అధిక బరువును నివారిస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడానికి, జీర్ణ సంబంధమైన సమస్యలను తొలగించడానికి ఫైబర్ ఉపయోగపడుతుంది.
potash
8) ఈ చేపలలో(vanjaram fish in telugu) ఉండే పొటాషియం కండరాల కదలికలు, నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి, ద్రవాలను అదుపులో ఉంచడానికి, అంతేకాకుండా పొటాషియం గుండెజబ్బులను నివారించడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి, పక్షవాతం లాంటి వ్యాధులను నివారించడానికి ఉపయోగపడుతుంది.
carbohydrates
9). ఈ వంజరం చేపలలో మనకి ఆరోగ్యకరమైన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. మనం తినే ఆహారంలో 40% కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక గ్రాము కార్బోహైడ్రేట్లో నాలుగు కేలరీల శక్తి ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్స్ స్లోగా జీర్ణం కావడం వలన గ్లూకోస్ లెవెల్స్ అనేవి తొందరగా పెరగవు.
vitamin e
10) ఈ చేపలలో(vanjaram fish in telugu) ఉండే విటమిన్ E శరీరంలో ఉండే కణాలను కాపాడడమే కాకుండా కొత్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే గుండె కండరాలు, నరాల వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఎర్రరక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
calcium
11) ఈ చేపల వండి కాల్షియం మన ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచడానికి రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. క్యాల్షియం వలన వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళనొప్పులను నుండి ఉపశమనం పొందవచ్చు.
Hemoglobin
12) మన రక్తంలో హిమోగ్లోబిన్ అభివృద్ధికి ఇనుము దోహదపడుతుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. మన శరీరంలో ఆక్సిజన్ లోపిస్తే శరీరం తీవ్రమైన అలసటకు గురి అవుతుంది.
magnesium
13) శరీరంలో మూడు వందల రకాలకు పైగా రసాయనిక చర్యలలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మగవారికి రోజు 300 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఆడవారికైతే 300 మిల్లీగ్రాములు అవసరమవుతుంది. శరీరంలోని బ్లడ్ షుగర్ ను శక్తిగా మార్చగల నైపుణ్యం విగ్నేష్ శంకు ఉంది. మనం వంజరం చేప తీసుకున్నట్లయితే మెగ్నీషియం ను పొందవచ్చు.
zinc
12) ఈ చేపలలో ఉండే జింక్ జుట్టు రాలిపోకుండా మరియు చుండ్రును నివారించడానికి పిల్లలలో ఎదుగుదలకు తోడ్పడుతుంది,
vitamin D
13) ఈ చేపల లో మనకు లభించే విటమిన్ D మన శరీరం క్యాల్షియంను గ్రహించి ఎముకలు బలంగా, పుష్టిగా ఉండడానికి దోహదపడుతుంది. సముద్రంలోని దాదాపు అన్ని చేపలలో కూడా కొంచెం అటు ఇటు గా ఒకే రకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మనకు సమకూరుతున్నాయి. అయితే చేపల ద్వారా పాదరసం 70 శాతం వరకు మన శరీరం లోనికి ప్రవేశిస్తుంది అని నిపుణులు కనుగొన్నారు. కనుక చేపలను ఎక్కువ వేడి చేసి ఎక్కువ వేడిలో వంట చేసుకోవడం మంచిది. చేపలను ఆరోగ్యకరంగా తినాలి అంటే ఎంత మోతాదులో, వారానికి ఎన్ని సార్లు తీసుకోవాలి అనేటువంటి విషయాలను మన వైద్యులను అడిగి తెలుసుకుందాం.