Murrel fish in telugu

Murrel fish in telugu and murrel fish name in telugu  

Murrel fish in telugu andmurrel fish name in telugu

 

ఇది ఒక మంచినీటి చేప నలుపు రంగులో ఉండి బలంగాను, మరియు హుషారుగా ఉంటుంది. నీటిలో నుండి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన చేపల (Murrel fish in telugu)   వలే అంత త్వరగా చనిపోదు. దక్షిణాసియా ప్రాంతంలోనూ, ఆగ్నేయాసియా ప్రాంతంలోనూ ఎక్కువగా కనిపించే ఈ చేపల శాస్త్రీయనామం చెన్నాస్ట్రయేటా అంటారు. మన దేశంలోని తెలంగాణ రాష్ట్రం దీనిని తమ రాష్ట్ర చేపగా ఎంపిక చేసినది.

తెలుగులో కొరమేను చేపల అర్థం(murrel fish name in telugu  )

తెలుగులో ఈ చేపను కొర్రమీను, కొర్రమట్ట ,మట్టగుడిసె అని వివిధ రకాలుగా పిలుస్తున్నారు.

కొరమేను చేపలు ఉనికి

ఈ చేప దాదాపుగా మీటరు పొడవు వరకు పెరుగుతుంది. భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తున్నప్పటికీ దక్షిణ చైనా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలలో ఈ చేపలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చేపలలో తెల్లటి రకం, నల్లటి రకం ఉంటాయి .అయితే నల్లటి రకం చేపలకు మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉన్నది‌. వీటి ఖరీదు కూడా మిగిలిన చేపలతో పోల్చినప్పుడు రెండు మూడు వందల రూపాయలు ఎక్కువగానే ఉంటుంది. ఇతర చేపల కూర కంటే ఈ చేపల కూర చాలా బాగుంటుంది. దీని శరీరం ముదురు గోధుమ రంగులో ఉండి దీని తల పైన శరీరం పైన నల్లటి మసకబారిన చారలు ఉంటాయి. నదుల లోనూ, వాగుల్లోన చిన్న చిన్న గుంటలలోనూ, చెరువులోను, పొలాల లోని నీళ్లలోనూ, ఎక్కువగా కనిపిస్తాయి. నీళ్లు తక్కువగా ఉండి బురద గా ఉన్నప్పటికీ కూడా ఈ చేపలు నిక్షేపంగా బ్రతక గలవు. అందుకే ఈ చేపలను బురద మట్టలు అని కూడా అంటారు. చిన్నచిన్న ఆకులను, శైవలాలను, కప్పలను వాటి పిల్లలను మరియు చేప పిల్లలను ఇవి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఈ చేపలు కూడా గుడ్లు పెట్టడం ద్వారానే సంతానోత్పత్తిని కలుగ చేసుకుంటాయి.

ప్రోటీన్ల వనరు(Murrel fish in telugu)

ఈ చేపలు చాలా మంచి పోషకాలను మనకు అందిస్తాయి. గుండె జబ్బులతో బాధపడేవారు ఈ చేపలను తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చేపలలో 18 నుండి 20 శాతం వరకు మాంసకృతులు ఉంటాయి అని కనుగొన్నారు. ఈ మాంసకృత్తులు తేలికగా కూడా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల లో మనకు అవసరమైన 8 రకాల అమినో ఆసిడ్లు మనకు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా గంధకం ఉన్న లైసిన్, మిధియోనిన్ ,సిస్టీన్, అమైనో యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ చేపలలో క్రోవ్వు వాటి యొక్క వయస్సును బట్టి 0. 2 శాతం నుండి 20 శాతం వరకూ ఉంటుంది అయితే ఈ క్రొవ్వు చాలా మంచిది, పోలి అన్శాచురేటెడ్ ఫ్యాటి యాసిడ్స్ ఇందులో ఉంటాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల పెరుగుదలకు చాలా అవసరం, గుండె జబ్బులు రాకుండా నివారించగలుగుతుంది, గర్భంలో ఉన్న శిశువు యొక్క మెదడు పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం కూడా తగ్గుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.

ప్రయోజనకరమైన విటమిన్లు

ఈ కొరమేను చేపల(Murrel fish in telugu)  క్రోవ్వు ద్వారా మనకు ఏ, బి, ఈ, డి, కె విటమిన్లు కూడా పుష్కలంగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్ డి , విటమిన్ ఎ ఈచేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు ఈ కొరమేను చేపలలో పుష్కలంగా ఉన్నాయి. ఆకుకూరల్లో లభించే విటమిన్ ఏ కంటే కూడా ఈ కొరమేను చేపల ద్వారా లభించే విటమిన్A మన శరీరానికి సులభంగా అందుతుంది, విటమిన్ A మంచి మంచి కంటి చూపుకు దోహదం చేస్తుంది. ఆహారంలో ఉండేటువంటి క్యాల్షియం మన శరీరం స్వీకరించడానికి విటమిన్-డి అవసరం.థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు ఆహారంలో ఉన్న శక్తిని వినియోగించడానికి అవసరమవుతాయి. తాజా చేపల్ని తిన్నప్పుడు అందులో మనకు విటమిన్ సి కూడా అందుతుంది.

ఖనిజాల వనరు

  • సముద్రపు చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. మనకు అయోడిన్ లోపించినట్లు అయితే గాయిటర్ అనే వ్యాధి వస్తుంది.
  • అయోడిన్ మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతుంది అయోడిన్ లోపించినట్లు అయితే మానసిక పరిపక్వత కూడా సరిగా జరగదు.
  • కొరమేనుచేపల లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్ బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి.
  • చిన్న చేపలను వాటి ముళ్ళతో కూడా తిన్నప్పుడు కాల్షియం భాస్వరం ఐరన్ ఎక్కువ మోతాదులో అందుతాయి, ముళ్ళు తీసేసి తిన్నట్లయితే అవి అందవు.
  • గట్టి ఎముకలకు పళ్ళు గట్టితనానికి మనకి ఫ్లోరిన్ అవసరం ఉంటుంది.
  • రక్తం అభివృద్ధి చెందడానికి హిమోగ్లోబిన్ అవసరం దానికి ఐరన్ దోహదపడుతుంది, ఇనుము మనకు కొరమేను చేపలలో పుష్కలంగా లభిస్తుంది.

మన తెలుగు రాష్ట్రంలో ఏటా మృగశిర కార్తె రోజున బత్తిన సోదరులు హైదరాబాదులో ఉబ్బసం వ్యాధికి చేప మందు పంపిణీ చేస్తున్నారు. ఈ మందుకు ఉపయోగించే చేప పిల్లలు కొరమీను చేప పిల్లలు. కాబట్టి ఈ కొరమేను చేప(Murrel fish in telugu)  పిల్లలలో ఉబ్బసం వ్యాధిని నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని భావించి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్స్యశాఖ ద్వారా కొరమేను చేప పిల్లలను సరఫరా చేస్తుంది.

  • ఈ కొరమేను చేప(Murrel fish in telugu)పిల్లలను నీటి గుంటల్లో, కాలువలలో పంచుతున్నారు.
  • మంచి నీటిలో పెరిగే చేపలలో పులస చేపల తర్వాతఎక్కువ ధర పలికే చేపలుగా ఈ చేపలను చెప్పవచ్చు.
  • చేపల ఆరోగ్య ప్రయోజనాల విషయంలో దాదాపుఅన్ని చేపలు కూడా ఒకే విధమైన ఆరోగ్యప్రయోజనాలను అందిస్తున్నాయి.
  • వివిధ రకాలైన చేపల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవడానికి మన బ్లాగు లోని మిగతా చేపలకు సంబంధించినఆర్టికల్స్ చదవగలరు.
  • మంచినీటిలో పెంచుతున్నటువంటి ఈచేపలలోకూడా కొన్ని అప్రయోజనాలు ఉన్నాయి.
  • మంచి నీటిగుంటల్లో  చేపలు బలంగా ఆరోగ్యంగా ఎదగడానికివాటికి కొన్ని రసాయనాలతో కూడిన ఆహారాన్ని కూడాపెడుతున్నారు.
  • చేపలు ఈ రసాయనాలనుతిన్నప్పుడు వాటి శరీరం విషతుల్యంగా మారేప్రమాదం కూడా ఉన్నది.
  • చేపలకు రసాయనాలతోకూడిన ఆహారాలు కాకుండా సహజసిద్ధమైన ప్రకృతిసిద్ధమైన ఆహారం పెట్టడం ముఖ్యం.
  • కాబట్టి చేపలనువంట చేసుకునే టప్పుడు ఎక్కువ  వేడితోవండుకోవడం మంచిది. చేపలు ఎక్కువగా వేడిచేసినప్పుడు వాటి లో ఉన్నటువంటి విషంవిరిగిపోయి  పక్కకు వెళుతుందని నిపుణులుచెబుతున్నారు.
  • కాబట్టి చేపల ఆరోగ్య ప్రయోజనాలనుగురించి మరియు వాటి నష్టాలను గురించి మనవైద్యులను అడిగి సవివరంగా తెలుసుకుందాం.

 

 

 

 

Related Posts

error: Content is protected !!