...

 

Tilapia fish in telugu

ఇది ఒక మంచినీటి చేప .ధర చాలా తక్కువగా ఉండి చిన్న చిన్న గుంట లలోనూ, కాలువలలోను చెరువులలోను మనకు విరివిగా లభించే చేప తిలాపియా చేప. మన రోడ్డు పక్కన ఉండేటువంటి రెస్టారెంట్లలో అపరితమైన గిరాకీ ఉన్న ఈ చేపలకు అమెరికా, సింగపూర్, చైనా యూరోపియను లాంటి అనేక దేశాలలో ఎక్కువ డిమాండ్ ఉన్నది. సమశీతోష్ణ మండల ప్రాంతాలలో ఈ చేప(Tilapia fish in telugu)  మనుగడ సాగించలేదు దీనికి పెరగడానికి వెచ్చని నీరు అవసరం.

మన రాష్ట్రంలో వీటి వినియోగం చాలా తక్కువ ఎందుకంటే ఇవి పులుసు పెట్టి వండుకోవడానికి ఉపయోగపడవు, కేవలం ఫ్రై చేసుకోవడానికి మాత్రమే బాగుంటాయి. అందువలన వీటిని మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పిల్లెట్స్ గా ఎగుమతి చేస్తున్నారు.Tilapia చేపలను ఎక్కువగా చైనా దేశం ఉత్పత్తి చేస్తున్నది.విదేశాలలో ఈ చేపలుకు ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చేపలను ఉత్పత్తి చేసే ప్రైవేట్ హేచరీలకు అనుమతులు ఇవ్వాలని  మన రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పిస్తున్నాయి

Tilapia fish in telugu name

Tilapia చేపలను మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో జిలేబీలు అని, మరికొన్ని ప్రాంతాలలో గోరకలు అని పిలుస్తున్నారు .Tilapia fish in telugu name

అయితే ఆంగ్లంలో దీనిని కొన్ని ప్రాంతాలలో. సెయింట్ పీటర్స్ ఫిష్ అని కూడా పిలుస్తున్నారు.

 

ప్రతి 100 గ్రాముల Tilapia చేపలో కింది పోషకాలు ఉన్నాయి

కేలరీలు శక్తి 128
క్రొవ్వు పదార్ధాలు 2.7 గ్రాములు
సంతృప్త క్రొవ్వు ఆమ్లం 0.9 గ్రాములు
కొలెస్ట్రాల్ 57 మిల్లీ గ్రాములు
సోడియం 56 మిల్లీగ్రాములు
పొటాషియం 380 మిల్లీగ్రాములు
పిండి పదార్థం 0.0 గ్రాములు
మాంసకృత్తులు 26 గ్రాములు
ఇనుము 0. 7 మిల్లీగ్రాములు
విటమిన్ బి6 0.1 మిల్లీగ్రాములు
మెగ్నీషియం 34 మిల్లీగ్రాములు
క్యాల్షియం 14 మిల్లీగ్రాములు
విటమిన్ డి 150IU
విటమిన్ బీ ట్వెల్వ్ 1.9mg

ఆధారం:USDA

Tilapia చేప యొక్క ప్రయోజనాలుు(Tilapia fish in telugu )

1) వెయిట్ లాస్

tilapia fish in telugu   
tilapia fish in telugu

ఈ చేపలలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ప్రోటీన్లతో తక్కువ కేలరీలను తీసుకున్నప్పుడు అధిక బరువు సమస్య రాదు .అంతేకాకుండా తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకోవాలి అనుకునేవారికి కూడా ఈ చేపలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్లు ఉన్న కారణంగా కణజాలాలు అభివృద్ధి చెంది బాడీ షేప్ ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది.

2)వృద్ధాప్య చాయలు

tilapia fish in telugu   
tilapia fish in telugu

ఈ చేపలలో విటమిన్ ఇ , యాంటీఆక్సిడెంట్స్, జింక్ మొదలైనవి సమృద్ధిగా ఉండడం వలన చర్మం ఆరోగ్యకరంగా ఉండటానికి ఇవి దోహదపడతాయి.చర్మం నిగారింపుగా ఉండడం వలన వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా కనిపించవు. జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఉండవు.

3) థైరాయిడ్ సమస్యలకు పరిష్కారం

tilapia fish in telugu   

ఈ చేపల (Tilapia fish in telugu  )లో సెలీనియం అనే ఖనిజం ఉంటుంది. ఈ సెలీనియం థైరాయిడ్ గ్లాండ్ ని క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతుంది. చేపల లో మనకు అవసరమైన అయోడిన్ కూడా లభిస్తుంది. అయోడిన్ లోపించినప్పుడు గాయిటర్ అనే జబ్బు వస్తుంది వీటికి పరిష్కారంగా మనం ఈ చేపలు తినవచ్చు.

4) శారీరక పెరుగదలకు

tilapia fish in telugu   

ఈ చేపలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండడం వలన కణజాలాలు, కణాలు అభివృద్ధి చెందుతాయి, తద్వారా కండపుష్టి కలగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. బాడీ ఆకృతి వృద్ధి చెందాలి అంటే, కండ బలం మనకి సమకూరాలి అంటే మనం ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి ఈ చేపలను తినడం ద్వారా మనం ఎక్కువ ప్రోటీన్లను పొందవచ్చు.

5) బాడీబిల్డర్స్ కోసం

tilapia fish in telugu   
tilapia fish in telugu

ఈ చేపలలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందువలన బాడీ బిల్డింగ్ చేసే వారికి ఈ చేపల ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది.బాడీ బిల్డింగ్ చేసే వారికి తమ బాడీని బిల్డ్ చేయడానికి ఎక్కువ ప్రోటీన్లు ఉండే ఈ చేపలు తినడం ద్వారా వారు తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

6) విటమిన్ బీ ట్వెల్వ్

tilapia fish in telugu   
tilapia fish in telugu

మన శరీరంలోని నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి ఎర్రరక్త కణాలు తయారు కావడానికి ఈ విటమిన్ ఎంతో అవసరం ఉన్నది. ఈ విటమిన్ లోపం వలన మతిమరుపు, నీరసం, నిస్సత్తువ, యూరిన్ ఆపుకోలేకపోవటం, వణుకు రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ లోపించిన విషయం గ్రహించడం చాలా కష్టం
దానికి రక్త పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ చేపలను మనం తిన్నట్లయితే విటమిన్ బీ ట్వెల్వ్ మనకు సమృద్ధిగా లభిస్తుంది.

6) గుండె ఆరోగ్యానికి మంచిది

tilapia fish in telugu   
tilapia fish in telugu

ఈ చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఒమేగా త్రీ లు రక్తం లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి రక్తనాళాల్లో రక్తం స్వేచ్ఛగా ప్రవహించేటట్లు చేస్తుంది. అందువలన గుండె సంబంధమైన వ్యాధులను. హార్ట్ఎటాక్ లాంటి సమస్యలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.

7)మెదడుకు మంచిది

ఈ చేపలలో (Tilapia fish in telugu)  ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ,సెలీనియం మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కొంతమంది లో మతిమరుపు సహజంగా వస్తుంది అయితే కొంత మందిలో అది మరీ ఎక్కువై అల్జీమర్స్ కు దారితీస్తుంది. అయితే ఈ చేపలలో ఉండే సెలీనియం మెదడును అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఎపిలెప్సీ వంటి వ్యాధుల నుండి కాపాడుతుంది.

8)క్యాన్సర్ నుండి రక్షణ

ఈ చేపలలో ఉండే సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి.అదే విధంగా సెలీనియం మన శరీరంలో జరిగే ఫ్రీ రాడికల్ యాక్టివిటీస్ ని కూడా తగ్గిస్తుంది.

9) ఎముకలకు మంచిది

ఎముకల ఎదుగుదలకు అవసరమయ్యే కాల్షియం తో పాటు పాస్పరస్ కూడా ఈ చేపలలో మనకు లభిస్తాయి.అలాగే bone cell పునరుత్పత్తికి కూడా ఈ చేప తినడం వలన ప్రయోజనం ఉంటుంది. అలాగే Tilapia చేపలలో విటమిన్ డి కూడా మనకి లభిస్తుంది. ఆహారం లో ఉన్నటువంటి కాల్షియం మన ఎముకలు గ్రహించాలంటే దానికి విటమిన్-డి అవసరం. లేకుంటే మన ఎముకలు గుల్లబారి పెళుసుగా మారుతాయి. కాబట్టి ఈ చేపలను తినడం వలన మన ఎముకలను విటమిన్ డి, క్యాల్షియం సహాయంతో గట్టిగా చేసుకోవచ్చు.

10) నాడీ మండలానికి మంచిది

  • సాధారణంగా అన్ని చేపలలో కూడా పాదరసస్థా యిలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం పరిశ్రమల నుండి నదుల ద్వారా వచ్చే వ్యర్థపదార్థాలను, పాదరసాన్ని ఆ చేపలు ఆహారంగాతీసుకోవడం.
  • అయితే ఈ చేపలు చెరువుల్లోనూ,వాగులలోను, గుంటల్లోనూ పెరుగుతున్నందు వలన పాదరస స్థాయిలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
  • ఈ పాద రసం చేపలనుండి మన శరీరం లోనికిప్రవేశిస్తుంది. మన శరీరంలోకి ప్రవేశించిన ఈపాదరసం మనుషుల నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తుంది.
  • అయితే ఈ చేపలు కాలువల లోనూ,గుంటల లోనూ,చెరువుల్లోనూపెరుగుతున్నందువలన కొంత వరకుప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ప్రైవేట్ హెచ రీస్లోచేపలను కొన్ని రసాయనాలను వాటికి ఆహారంగాఉపయోగిస్తున్నారు.
  • కాబట్టి ఈ చేపలను వంటచేసుకునే టప్పుడు ఎక్కువ వేడినీటిలో వండుకుంటేమంచిది.
  • ఎక్కువ వేడి చేయడం వలన వాటి శరీరంలోరసాయనాల ద్వారా చేరుకున్న విషం విరిగిపోయేఅవకాశం ఉంది.
  • కనుక ఈ చేపలను తింటే ఎటువంటిఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఎంత మోతాదులో తీసుకోవాలో మన వైద్యులను అడిగి తెలుసుకుందాం.

Related Posts

error: Content is protected !!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.