Mackerel fish in telugu and mackerel fish in telugu name

Mackerel fish in telugu and mackerel fish in telugu name

మాకెరెల్ చేపలు(Mackerel fish in telugu )స్కాంబ్రీడే ఏ కుటుంబానికి చెందినవి, ఈ కుటుంబంలో ట్యూనా, బోని టో చేపలు కూడా ఉన్నాయి. ఈ చేపలు ట్యూనా చేప ల కంటే చాలా చిన్నగా ఉంటాయి మరియు సన్నగా కూడా ఉంటాయి. అయితే మిగిలిన విషయాలలో మాత్రం అనగా పోషకాల విషయంలో మిగిలిన చేపలతో దాదాపు సమానంగానే కనబడుతాయి .ఈ చేపలలో దాదాపు 21 రకాలు ఉన్నాయని గుర్తించారు.ఈ చేపలు ఎక్కువగా సముద్రతీర ప్రాంతాలలో నివసిస్తాయి మరియు సమశీతోష్ణ, ఉష్ణ మండల ప్రాంతాలలో ని సముద్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చేపలు చాలా వేగంగా ఈదగలగు తాయి 5.5 మీటర్లు ఫర్ సెకండ్ ఈదగలవు. కింగ్ మాకెరెల్ అయితే గంటకు పది కిలోమీటర్ల వేగంతో సుదీర్ఘ వలసలకు వెళుతుంది.

ఈ చేపలు వాటి వెనుక భాగంలో నిలువు చారలు, ఎక్కువగా చీలిన తోకలను కలిగి ఉంటాయి.మాకెరెల్ చేపలు సముద్ర తీరాలలో ని మైదానాలకు వలస వెళ్లి అక్కడ గుడ్లు పెట్టి లోతు తక్కువ ఉన్న ప్రాంతాలలోనే సంతానోత్పత్తిని కలుగ చేసుకుంటాయి. ఈ చేపలు 3 లక్షల నుండి 15 లక్షల వరకు గుడ్లు పెడతాయి.మాకెరెల్ చేపలు సముద్ర పక్షులకు, డాల్ఫిన్, tuna, సాల్మన్ చేపలకు ఆహారంగా మారుతున్నాయి.మాకెరెల్ చేపల మాంసం లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్నాయని కనుగొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా  అన్ని దేశాలలో మాకెరెల్ మాంసాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఒక ఆయిల్ చేప కాబట్టి తక్కువ నూనెలోనే ఈ చేపను వండుకోవచ్చు. అలాగే ఈ చేపల మాంసం త్వరగా చెడిపోతుంది కాబట్టి వీటిని పట్టుకున్న రోజునే తినడం మంచిది. ఒకవేళ నిల్వ ఉంచాలి అనుకుంటే మంచి రిఫ్రిజిరేటర్ లేదా ఐస్ బాక్స్ లో సరైన రీతిలో నిల్వ చేయాల్సి ఉంటుంది.

Mackerel fish in telugu name

మాకెరల్ చేపలను మన తెలుగులో కనగర్తలు, కన్నంగదాత, కన్నంగడ్తి అనే పేర్లతో పిలుస్తున్నారు(mackerel fish in telugu name)

మాకెరెల్ ఫిష్ పోషకాలు (Mackerel fish in telugu)

100 గ్రాముల మాకెరల్ ఫిష్ లో క్రింది పోషకాలు ఉన్నాయి.

క్యాలరీలు 858 kJ (205 kcal)
ప్రోటీన్లు 18. 60 గ్రాములు
క్యాల్షియం 12. మిల్లీగ్రాములు
ఇనుము 1. 63 మిల్లీగ్రాములు
మెగ్నీషియం 63. మిల్లీగ్రాములు
భాస్వరం 213. మిల్లీగ్రాములు
పొటాషియం 313. మిల్లీగ్రాములు
సోడియం 90. మిల్లీ గ్రాములు
జింక్ 0.63 మిల్లీగ్రాములు
నీరు 63.55 గ్రాములు

వీటితోపాటు విటమిన్ ఎ, డి లు కూడా మనకు ఈ చేపలలో లభిస్తాయి.
ఆధారం : USDA

ప్రోటీన్లు

ఈ చేపలలో(mackerel fish in telugu name )ఉండే ప్రోటీన్లు మన జుట్టు సరిగా పెరగటానికి, గోళ్లు బలంగా ఉండడానికి, కండపుష్టి కలగడానికి హార్మోన్లు క్రమబద్ధంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి.మన ఫిట్నెస్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ ప్రోటీన్స్ చాలా అవసరం. మనిషి బరువును బట్టి ప్రతి కేజీకి ఒక గ్రాము ప్రోటీన్ అవసరమవుతుంది అని వైద్యులు తెలియజేస్తున్నారు.

క్యాల్షియం

మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాల లో కాల్షియం కూడా ఒకటి. ఈ కాల్షియం మన ఎముకలను దృఢంగా చేస్తుంది.రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,రక్తపోటును అదుపులో ఉంచడానికి క్యాల్షియం ఉపయోగపడుతుంది. అయితే కాల్షియం ఎక్కువ తీసుకున్నా లేదా తక్కువ తీసుకున్న కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కనుక తగినంత మోతాదులోనే తీసుకోవాలి దీనికి వైద్యులను సంప్రదించాలి.

ఐరన్

ఈ చేపల్లో ఉండే ఐరన్ రక్తహీనతను లేకుండా చేస్తుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు కూడా ఆక్సిజన్ సక్రమంగా సరఫరా అయ్యేటట్లు చేస్తుంది.

పొటాషియం

మగవారికి 350 మిల్లీగ్రాములు ఆడవారికి 300 మిల్లీగ్రాములు మెగ్నీషియం అవసరం అవుతుంది.రక్తంలోని బ్లడ్ షుగర్ ను శక్తిగా మార్చే గుణం మెగ్నీషియంకు ఉన్నది.మెదడు పనితీరు సక్రమంగా ఉండాలి అన్నా, బి 6 విటమిన్ మనకు ఉపయోగపడాలన్న, ఎంజైముల పనితీరు సక్రమంగా ఉండాలన్నా మెగ్నీషియం అవసరం. తగినంత మెగ్నీషియం కు ఈ చేపలను తినాలి.

ఈ చేపలలో(mackerel fish in telugu name) మనకి పొటాషియం కూడా లభిస్తుంది పొటాషియం లోపిస్తే ఎక్కువ అలసట గా ఉన్నట్టు ఎంత నిద్ర పోయినప్పటికీ నిద్ర వస్తున్నట్టు కళ్ళు మూతలు పడుతుంటాయి.పొటాషియం లోపించడం వలన పిక్క కండరాలు పట్టేసినట్లు ఉంటాయి. అయితే కిడ్నీలో జబ్బు ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు మాత్రమే పొటాషియం తీసుకోవాల్సి ఉంటుంది.

జింక్

ఈ చేపల లో మనకు జింక్ లభిస్తుంది జింక్ లోపించినప్పుడు మన వెంట్రుకలు రాలిపోతుంటాయి, చుండ్రు వస్తుంది. పిల్లలలో శారీరక ఎదుగుదల కూడా ఉండదు.జింకు లోపం వలన పురుషులలో టెస్టోస్టిరాన్ సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి, రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఈ సమస్యలన్నిటినీ కూడా మాకెరెల్ చేపలను తినడం ద్వారా అధిగమించవచ్చు.

ఈ చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త నాళాల్లో రక్తం స్వేచ్ఛగా ప్రవహించేటట్లు చేస్తోంయి. అందువలన గుండె సంబంధమైన వ్యాధులు దగ్గరికి రాకుండా అరికట్టవచ్చు అంతేకాక ఈ ఒమేగా త్రీ లు మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.

అప్రయోజనాలు(Mackerel fish in telugu)

  • మాకెరెల్ చేపలు ఎక్కువగా సముద్రతీర ప్రాంతాలలోనివసించడం వలన నదుల ద్వారా వచ్చే వ్యర్థాలను,పాదరసం మొదలైన వాటిని ఆహారంగాతీసుకుంటున్నాయి.
  • కాబట్టి ఈ చేపల ద్వారా ఆపాదరసం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
  • పాదరసంద్వారా మనిషి యొక్క నాడీ వ్యవస్థ, మెదడు పనితీరుమందగిస్తుందని నిపుణులు కనుగొన్నారు.
  • కాబట్టి ఈచేపలను వంట చేసుకునే టప్పుడుఎక్కువ వేడినీటిలో ఉడికించి తినటం మంచిది.
  • ఎక్కువగాఉడికించినప్పుడు విషం విరిగిపోయి ప్రక్కకువెళుతుంది అని కనుగొన్నారు.
  • చేపలన్నీ కూడా అనేక రకాల జాతులు గాఉన్నప్పటికీ వాటి వలన మనుషులకు కలిగే ఆరోగ్యప్రయోజనాలు అన్నీ కూడా కొంచెం అటు ఇటుగాఒకలాగే ఉన్నాయి.
  • చేపలను కనీసం వారంలో రెండునుండి మూడు సార్లు అయినా తీసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు.

 

 

error: Content is protected !!
Scroll to Top