Pulasa fish, pulasa fish cost and godavari pulasa fish

pulasa

Pulasa fish, pulasa fish cost and godavari pulasa fish

 

తింటే పులస చేపలే తినాలి వింటే దాని వైభోగమే వినాలి. ఈ పులస చేపలుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారా! అవును ఏడాదిలో రెండు నెలలు మాత్రమే దొరికే పులస చేపలకు ఉన్నడిమాండ్ అంతా ఇంతా కాదు. పుస్తెలు అమ్మి అయినా పులస పులుసు (Pulasa fish) తెనాలి అనే సామెత గోదావరి జిల్లాలో ఎంతో ప్రాచుర్యం పొందింది.అందుకే పులస చేపల రుచికి ఆంధ్రప్రదేశ్ దాసోహం అయిపోయింది.

Pulasa fish in telugu

 • పులస చేపల శాస్త్రీయనామం హిల్సా హిల్సా. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సముద్ర తీరాలలో సంచరించే చేపలు.
 • సంతాన సమయంలో గుడ్లు పెట్టడానికి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుంది.
 • ఆషాఢ, శ్రావణ మాసాలలో ఇక్కడ గుడ్లు పెట్టి మరల తమ సొంత ప్రదేశాలకు వెళ్ళిపోతుంది.
 • అదే సమయంలో గోదావరి వరద నీరు వస్తూ ఉండడం వలన సహజసిద్ధంగా ఏటికి ఎదురీదుతూ గోదావరి నది లోనికి వస్తాయి.
 • గోదావరి నదిలోకి వచ్చిన ఇలస చేపలు రెండు మూడు రోజుల్లోనే అక్కడ మంచి నీటి ప్రభావం వలన పులసలు(pulasa fish in telugu)
 • ఇంతకీ పులస చేపల(Pulasa fish) కు అంత టెస్ట్ రావడానికి సీక్రెట్ ఏంటి?
 • పులస పేరు చెబితే చాలు నోరు ఊరిపోతోంది అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. పులసలు సంవత్సరం పొడవునా దొరకవు. వర్షాకాలంలో ముఖ్యంగా ఆషాఢ, శ్రావణ మాసాలలో గోదావరిలో దొరుకుతాయి. అందుకే ఈ చేపలకు ఇంత డిమాండ్.
 • గోదావరి ప్రాంతాల ప్రజలు అసలే భోజన ప్రియులు అందుకే సంవత్సరం పొడవునా పులస రాక కోసం వేచి చూస్తూ ఉంటారు.
 • గోదావరి నదిలో స్వచ్ఛమైన నీటి లో దొరికే పులస చేపలు అంటే ఆ ప్రాంత ప్రజలకు ఎంతో క్రేజ్.
 • ఈ చేపలు గోదావరి నది లోని ధవళేశ్వరం వద్ద ఎక్కువగా దొరుకుతాయి. ఎందుకంటే నదికి ఎదురీదే చేపలు అక్కడ వరకు మాత్రమే వస్థాయి.
 • అంతేకాకుండా పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, తూర్పుగోదావరి జిల్లాలోని యానాం వద్ద కూడా ఈ చేపలు విరివిగా దొరుకుతాయి.
 • వీటిని జాలర్లు ఎప్పుడు తీసుకొని వస్తారా అని కొనుగోలుదారులు గోదావరి నది ఒడ్డున పడిగాపులు కాస్తూ ఉంటారు.

Pulasa fish cost(godavari pulasa fish price  )

 • ఈ చేపలు(Pulasa fish) చూడడానికి చిన్నవిగా ఉన్నప్పటికీ బరువులో మాత్రం ఏమి తక్కువ కావు చిన్న చేప కూడా కేజీ తూగుతుంది.
 • వాటి రేటు కూడా గూబ గుయ్యిమనే ఏ విధంగా ఉంటుంది.
 • ఇంతకు ముందు పులస చేపలు రెండు నుండి మూడు వేలు ఉండేవి ఇప్పుడు ఏకంగా పది వేలు దాటుతుంది.
 • ప్రస్తుతం పులస చేపల ధర 7 వేలనుండి 15 వేల మధ్య వీటి ధర నడుస్తుంది.
 • కొన్నిసందర్భాలలో డిమాండ్ ను బట్టి గోదావరి నదిలో చేపల‌ లభ్యతను బట్టి 25వేలకు కిలో ధర (godavaripulasa fish price)   పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 • గోదావరి పులసలకు డూప్లికేట్ పులసల బెడద కూడా ఉన్నది.
 • పులసలు రెండు రకాలు గోదావరి లో నదిలో లభించే పులసలు, ఒరిస్సా నుండి మన రాష్ట్రానికి దిగుమతి అయ్యే పులసలు.
 • ఈ రెండు పులసల కు మధ్య తేడా ఏమిటంటే మన రాష్ట్రంలోని పులసలు(Pulasa fish) గోదావరి మంచినీటిలో దొరుకుతాయి.
 • ఒరిస్సా రాష్ట్రం నుండి మనం దిగుమతి చేసుకునే పులసలు సముద్రం లోనివి. ఈ రెండు రకాల పులసల మధ్య లో టేస్ట్ లో గాని కాస్ట్ లో గాని చాలా తేడా ఉంటుంది.

Pulasa fish in english

వాస్తవానికి ఈ చేపలను ఆంగ్లంలో Hilsa (pulasa fish in english )అని పిలుస్తారు. ఈ చేపలను ప్రపంచంలోనే ప్రధానంగా ఎగుమతి చేస్తున్నటువంటి దేశం బంగ్లాదేశ్. 80% చేపలు బంగ్లాదేశ్ నుండి ఎగుమతి చేయబడుతున్నాయి. అయితే గోదావరి మంచినీటిలో దొరికే పులస చేపల అంత టేస్ట్ గా ఇవి ఉండవని ఆహార ప్రియులు మనకు తెలియజేస్తున్నారు.(pulasa fish in english)

అయితే కొంతమంది జాలరులు ఒరిస్సా పులసలను గోదావరి పులస గా నమ్మించి వేల రూపాయల మోసం చేస్తున్నారని కూడా ఒక వాదన ఉంది. గోదావరి నదిలో దొరికే పులసల శరీరంపై ఎర్రటి సార ఉంటుందని జాలర్లు తెలియజేస్తున్నారు. కాబట్టి కొనుగోలుదారులు ఆ ఎర్రని సారాను చూసి ఒరిజినల్ పులస డూప్లికేట్ పులస మధ్య తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

పెద్ద పెద్ద చేపల షాపులను నడిపే వారి కంటే చిన్నచిన్న బుట్లలో పులస చేపలు అమ్ముకుని రోజుకి మూడు నుంచి నాలుగు లక్షలు సంపాదించే జాలర్ల కూడా ఉన్నారని మీకు తెలుసా?. దీనిని బట్టే వీటికున్న డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది.

పులస(pulasa )పులుసు టేస్ట్ గా ఉండాలి అంటే ముందు దానిని వండడం తెలియాలి. ఎలా పడితే అలా చేస్తే తినటానికి ఇబ్బందిగా మారుతుంది. గతంలో అయితే పులస చేపలను మట్టికుండలో వండేవారు. మిగిలిన రకాల చేపలను పులుసు చేసుకుంటారు. ఫ్రై చేసుకుంటారు రకాలుగా వండుకుంటారు. అది వారి ఇష్టం కానీ పులస చేపలు మాత్రం తప్పనిసరిగా పులుసు చేయాల్సిందే. పులస పులుసు లో బెండకాయలను గనుక జోడించిన్నట్లయితే ఆ రుచే వేరుగా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

పులస(pulasa )చేపల ఆరోగ్య ప్రయోజనాలకు వస్తే ఇతర చేపలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా పులస చేపలో ఉన్నాయి. చేపలలో ప్రధానంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలోని కొలెస్ట్రాల్ ని తొలగించి రక్తనాళాల్లో రక్తం సాఫీగా ప్రవహించేటట్లు చేస్తుంది. అందువలన రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా గుండె సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. చేపలలో ఉండే సెలీనియం కూడా మన జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తుంది. మతిమరుపు ఎక్కువగా ఉండేవాళ్ళు మతిమరుపు తీవ్రమై అల్జీమర్స్క దారి తీసిన వాళ్లు కూడా చేపల ఆహారం తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు తెలియజేస్తున్నారు.

విటమిన్స్ మరియు ఖనిజాలు

ఇంకా చేపలలో విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి 12, వంటి విటమిన్లు. పొటాషియం, జింక్, అయోడిన్, క్యాల్షియం, భాస్వరం, మొదలైనటువంటి ఖనిజాలు కూడా మనకు సమృద్ధిగా లభిస్తాయి. మాంసాహారంలో మిగిలిన మాంసాహారాలు కంటే చేపలు మాంసాహారం మనకి ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలను కలగజేస్తుంది. అయితే నదులలో మనకు లభించే చేపలు పరిశ్రమల ద్వారా నదుల లోకి ప్రవేశిస్తున్న వ్యర్థ పదార్థాలను, పాదరసం మొదలైన వాటిని ఆహారంగా తీసుకుంటున్నాయి. గనక పాదరసం చేపల ద్వారా మనిషి శరీరం లోకి ప్రవేశిస్తుందని కనుగొన్నారు. అందువలన చేపలను వంట చేసుకునేటప్పుడు ఎక్కువ వేడి చేసి తీసుకోవడం వలన అందులో ఉండే పాదరసం విరిగిపోతుంది. పాదరసం మానవుల నాడీమండలం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కూరగాయలు ద్వారా కూడా పాదరసం మానవుల శరీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పటికీ చేపల ద్వారానే పాదరసంలో 70% మానవ శరీరంలోని ప్రవేశిస్తుందని చెబుతున్నారు.

error: Content is protected !!
Scroll to Top