Bocha fish and bocha fish in telugu
ఇది కార్ప్ కుటుంబానికి చెందిన ఒక మంచినీటి చేప. దక్షిణాసియా ప్రాంతంలో మంచినీటి చేపలలో వాణిజ్యపరంగా, ఆర్థికంగా చాలా ముఖ్యమైన చేప గా కనుగొనబడింది. ఈ చేప ముఖ్యంగా ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్థాన్, నేపాల్, దేశాలలోని నదులు మరియు సరస్సులలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి చేప. దక్షిణాసియా లోని ఇతర ప్రాంతాలలో కూడా ఎక్కువగా ప్రజలకు పరిచయమైన చేప. మరియు వాణిజ్య పరంగా మంచి నీటి గుంటలలో, చెరువులలో, కాలువలలోఎక్కువగా ఈ చేపలను పెంచుతున్నారు.
Bocha fish
నేపాల్ మరియు భారత దేశంలోని ఇతర ప్రాంతాలు ఒడిస్సా వరకు ఈ చేపను భకురా అని పిలుస్తున్నారు.
బొచ్చ చేప (bocha fish) యొక్క తల చాలా పెద్దదిగా ఉంటుంది. దాని దవడలు ఎత్తుగాను దాని నోరు పైకి ఎత్తబడినట్లు గాను ఉంటుంది. దాని శరీరం అంతా పెద్ద బూడిదరంగు పోలుసుల చేత కప్పబడి ఉంటుంది. ఈ చేప యొక్క అడుగుభాగాన తెల్లగా ఉంటుంది. ఈ చేప దాదాపు 182(6feets) సెంటీమీటర్ల పొడవు 38.6 కేజీల వరకు బరువు పెరుగుతుంది అని కనుగొన్నారు. ఈ చేప రెండు సంవత్సరాల వయసుకు మరియు కనీసం రెండు కేజీల బరువుకు వచ్చినప్పుడు లైంగిక పరిపక్వత పొందుతుంది. ఈ చేప ముఖ్యంగా పాలీ కల్చర్ చెరువులలో ఇతర కార్ప్ కుటుంబానికి చెందిన చేపలతో ముఖ్యంగా, రోహు, లేబియో, మృగాల్ వంటి చేపలతో కలిపి పెంచబడుతుంది. కాట్ల చేప స్థానికంగా మరియు ప్రాంతీయంగా దీనిని ఎక్కువగా విక్రయిస్తుంటారు. దీనిని ఐస్ బాక్స్ లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. ప్రజలు ఒక కేజీ నుండి రెండు కేజీల చేపలను ఎక్కువగా ఇష్టపడతారు.
Bocha fish in telugu
బొచ్చ చేపలను మన తెలుగులో బొచ్చ చేపలు అని కృష్ణ బొచ్ఛలు అని అంటారు
Bocha fish in english
ఆంగ్లంలో అయితే కాట్ల ఫిష్ (Catla fish) అని అంటారు
ఇప్పుడు బొచ్చా చేపల(bocha fish) యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం.
గుండె పదిలం
- బొచ్చ చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి రక్తం సాఫీగా సరఫరా అయ్యేటట్లు చేస్తుంది. అందువలన గుండె సంబంధమైన వ్యాధులు మన దగ్గరికి రావు.
- ఒమేగా 3ఫ్యాటీల వలన మతిమరుపు అల్జీమర్స్ లాంటి బలమైన వ్యాధులు తొలగించ బడతాయి.
- ఈ చేపలలో క్రొవ్వు తక్కువగా ఉండి ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లావు తగ్గాలి అనుకునే వారు కూడా నిక్షేపంగా ఈ చేపలను తినవచ్చు.
- అంతేకాకుండా బొచ్చ చేపలలో (bocha fish in english) ఉండే ఒమెగా-3 ఫ్యాటీలు మెదడు ఎదుగుదలకు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా దోహదపడతాయి.
చర్మ రక్షణ
- బొచ్చ చేప(bocha fish in telugu) మనకు వివిధ రకాలైన పోషకాలను అందించడమే కాకుండా చర్మాన్ని అల్ట్రావయోలెట్ కిరణాల నుండి కాపాడుతుంది.
- తద్వారా సోరియాసిస్ తామర వంటి చర్మ వ్యాధులు మన దగ్గరికి రావు.
- బొచ్చ చేపలలో పొటాషియం, అయోడిన్, విటమిన్లు, సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని కనుగొనబడింది.
- బొచ్చ చేపలు లో ఉండే సెలీనియం మనలను క్యాన్సర్ కణాల నుండి కాపాడుతుంది.
అయోడిన్
- బొచ్చ చేపలలో(bocha fish in telugu) మనకు అయోడిన్ కూడా లభిస్తుంది, అయోడిన్ లోపించినట్లు అయితే గాయిటర్ అనే జబ్బు వస్తుంది.
- అయోడిన్ లోపించడం వలన మంద బుద్ధి, మతిమరుపు, వంటి లక్షణాలు కలుగుతాయి. మానసిక పరిపక్వత కూడా సరిగా ఉండదు.
విటమిన్స్
- బొచ్చ చేపలలో విటమిన్ D మరియు విటమిన్ A కూడా మనకు లభిస్తాయి. ఆహార పదార్థాలలో ఉండే క్యాల్షియం ను మన శరీరం గ్రహించాలంటే దానికి విటమిన్-D అవసరం. కాల్షియం మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
- అదేవిధంగా ఆకుకూరల్లో కూడా విటమిన్ A ఉన్నప్పటికీ బొచ్చ చేపలలో మనకు లభించే విటమిన్A సులభంగా మన శరీరానికి అందుతుంది.
- బొచ్చ చేపలు ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులను పరిష్కరించుకోవచ్చు.
కంటికి రక్షణ
- బొచ్చ చేపలలో(bocha fish in telugu ) రెటినాల్ ఉండడం వలన మన కంటిచూపును బొచ్చ చేపలను తినడం ద్వారా మెరుగుపరచుకోవచ్చు.
- ఈ బొచ్చ చేపలలో ఉండే విటమిన్A మన కంటి చూపును మెరుగుపరుస్తుంది.
- బొచ్చ చేపలను సహజంగా మంచి నీటి గుంటలలో, కాలువలలో, చెరువులలో వాణిజ్యపరంగా పెంచుతున్నారు.
- వాటికి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని రకాల రసాయన మేతను కూడా వాటికి అందిస్తున్నారు.
- చేపలు రసాయన పదార్థాలతో కూడిన ఆహారాన్ని తినడం వలన వాటి శరీరాలు విషతుల్యం అవుతున్నాయి.
- కాబట్టి మంచినీటిలో పెంచే చేపలను సహజ సిద్ధమైన ఆహారపదార్థాలతోనే పెంచడం మంచిది.
- అయితే చేపలను మనం వంట చేసుకునే టప్పుడు ఈ ఎక్కువ వేడిలో వంట చేయడం వలన ఈ చేపలు యొక్క శరీరంలో ఉన్న విషం విరిగిపోయి ప్రక్కకు వెళుతుందని శాస్త్రీయంగా కనుగొన్నారు.
- కాబట్టి చేపలను ఎక్కువ వేడి చేసి తీసుకోవడం మంచిది.
- ఇంకా చేపలను వారానికి ఎన్ని సార్లు తీసుకోవాలి, వాటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి మన వైద్యులను అడిగి తెలుసుకుందాం.
- అన్ని మంచినీటి చేపల వలే బొచ్చ చేపలు(bocha fish in telugu ) కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇంకా ఇతర చేపలు యొక్క విశిష్టత, వాటి ఆరోగ్య ప్రయోజనాలను గురించి మన బ్లాగ్ లోని మిగతా ఆర్టికల్స్ ని కూడా పరిశీలించగలరు.