...
valuga fish

Valuga fish and valuga fish in telugu,

Valuga fish and valuga fish in telugu

ఈ చేపను తెలుగులో వాలగ అంటారు ( valuga fish). ఇది ఇది ఒక మంచినీటి చేప. దీనినే ఆంగ్లంలో wallago attu అంటారు. ఈ చేప siluridae కుటుంబానికి చెందిన ఒక క్యాట్ ఫిష్. సాధారణంగా దీనిని హెలిక్యాప్టర్ క్యాట్ ఫిష్(helicaptor cate fish) వాల్లగో క్యాట్ ఫిష్ (wallagi cate fish)అని పిలుస్తుంటారు.

వాలగ చేపల ఉనికి(valuga fish)

ఈ చేపలు ఎక్కువగా సమశీతోష్ణ మండల, ఉష్ణమండల మంచి నీటిలో ఎక్కువగా కనిపిస్తాయి, దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలలోని పెద్ద పెద్ద నదులు సరస్సులలో మొదటగా కనుగొనబడ్డాయి . కొండలు మరియు లోతట్టు ప్రాంతాలలోని చెరువులు మరియు నదులు ప్రవహించే లోతైన నీటిలో నివాసం చేస్తుంది.

పురాతన కాలం నుండి ఆగ్నేయ ఆసియా ప్రాంతాలలో ఆహారంగా ఉపయోగించే చేపలలో ఈ వాలగ(cat fish) చేప కూడా ఒకటి. ఈ వాలగ చేపలు ఒక మీటరు పొడవు వరకు పెరుగుతాయి. అయితే ఈ చేపలు 1.8 మీటర్ల వరకు పొడవు, 45 కిలోల బరువు కంటే పైగా ఉంటాయని మరొక వాదన కూడా ఉన్నది. అయితే జీవశాస్త్రజ్ఞులు మాత్రం 1 మీటరు కంటే పొడవుగా పెరగదు అని గట్టిగా చెబుతున్నారు.

చాలా ప్రాంతాలలో క్యాట్ ఫిష్ జాతికి చెందిన వాలగోనియా , లిరి అనే చేపలు చూడడానికి వాలగ చేపల మాదిరిగానే ఉంటాయి. అయితే ఇండోనేషియా మరియు మలేషియా ప్రాంతాలలో ఈ రెండు జాతులను ఇఖాన్, తపహ్ అని పిలుస్తారు. అయితే ఆంగ్లంలో ఈ రెండు రకాల చేపలను కూడా హెలికాప్టర్ క్యాట్ ఫిష్ అనే పిలుస్తున్నారు.

ఈ చేపలు ప్రధానంగా భారత దేశం మరియు దాని ముఖ్య నదులు అన్నిటిలోను కనుగొనబడింది ఇంకా ఈ వాలగ చేప, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ లోని ఇరావడి నది వరకు ఈ చేప ఉనికిని మనం కనుగొనవచ్చు. ఇది ఎక్కువగా చిన్న చిన్న చేపలను ఆహారంగా తింటుంది. ఈ valaga చేపల ను వివిధ భాషలలో ఏ విధంగా పిలుస్తున్నారో తెలుసుకుందాం.

ఇతర భాషలలో ఈ చేప పేర్లు( valuga fish)

అస్సామీ = Barali
బెంగాలీ = Boal
భోజ్ పూరి = బరారి
బర్మీస్ = Nga పాట్
హిందీ = Barwari
కన్నడ =బలై
ఖాసి=Parhin
మైథిలి =బరారి
మలయాళం =అట్టూ వాలా
మణిపురి =Sareng
మరాఠీ = Baloo
నేపాలీ =Bohari
ఒడియా – Boallee (baliaa)
పంజాబీ – Mully
సింహళం – Walaya Sylheti – Gual తమిళ – Valai
Telegu – Valaga
సింధీ – Jarko [12]

ఈ చేప యొక్క లక్షణాలు( valuga fish)

వాలగ చేపను సాధారణంగా క్యాట్ ఫిష్ లేదా lachi అని పిలుస్తారు

వాలగ చేపల యొక్క రంగు మారుతూ ఉంటుంది. ఈ చేప బూడిద గోధుమ రంగులో ఉంటుంది, దాని తల ఊదా రంగులోనూ బొడ్డు దగ్గర తెల్లగాను ఉంటుంది.

ఈ చేప యొక్క శరీరాన్ని తల, tank, తోకగా విభజించినారు. దీని తల పెద్దదిగా ఉంటుంది ట్రంక్ చిన్నదిగా ఉంటుంది.
దీనికి తలలో నాసికా రంధ్రాలు ఉంటాయి.

 

వాలగ చేప( valuga fish) మంచి విలువైన ఆహారం. మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. సామాన్యులకు కూడా ఈ చేప ధరలు అందుబాటులో ఉంటాయి.

చేపల సంతానోత్పత్తి కాలం వర్షాకాలం జూలై నుండి ఆగస్టు వరకు గుడ్లు పెడతాయి.

ఇది ఎక్కువగా వగా 90% ఇతర ప్రాణాలను ఆహారంగా తీసుకుంటుంది ఒక రకంగా దీనిని మంచినీటి సొరచేప అని కూడా పిలుస్తారు. ఇది రాత్రి పూట చేపలను వేటాడి ఆహారంగా తింటుంది.

వాలగ చేపల లో ఉన్న పోషకాలు

కేలరీలు= 105
కొవ్వు= 2.9 గ్రాములు
ప్రోటీన్ =18 గ్రాములు
సోడియం=50 మి.గ్రా
విటమిన్ B12 = రోజువారీ విలువలో 121% (DV)
సెలీనియం=DVలో 26%
భాస్వరం =DVలో 24%
థియామిన్= DVలో 15%
పొటాషియం = DVలో 19%
కొలెస్ట్రాల్ = DVలో 24%
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు =237 మి.గ్రా
ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు =337 మి.గ్రా

 

valuga fish images

"<yoastmark

"<yoastmark

"<yoastmark

 

 

 

 

మిగిలిన చేపలలో మాదిరిగానే ఈ చేపలలో కూడా ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన టువంటి విటమిన్స్ మరియు ఖనిజాలు మరియు తక్కువ కేలరీలు, సోడియం కూడా లభిస్తున్నాయి

ప్రోటీన్స్ కు ప్రధానమైన మూలం

ఈచేపలలో( valuga fish) ఉండే ప్రోటీన్స్ కణజాలాలు మరియు కండరాల నిర్మాణానికి మరియు వాటి మరమ్మతుకు దోహద పడుతుంది. మరియు అనేక హార్మోన్లు ,ఎంజైమ్ లకు ఇతర పనులకు కూడా బిల్డింగ్ బ్లాక్ లు గా పనిచేస్తాయి. మనం వందగ్రాముల క్యాట్ ఫిష్ తీసుకున్నట్లయితే మన రోజువారి ప్రోటీన్లో 32 శాతం నుండి 39 శాతం వరకు అందుతాయి. తక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రోటీన్లు ఉండటం వలన బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఈ వాలగ చేప ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు.

US డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రతి ఒక్కరు కూడా వారానికి 8 ఔన్సుల వరకు సముద్రపు చేపలు లేదా మంచినీటి చేపల నైనా తినాలని సిఫార్సు చే స్తోంది .

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

అన్ని చేపల మాదిరిగానే వాలగ చేపలలో కూడా ఉమా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి రక్తప్రసరణ సాఫీగా అయ్యేటట్లు చేస్తాయి. అంతే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి మతిమరుపు లాంటి వాటిని నివారించి జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తాయి.

B12 విటమిన్ కి ప్రధానమైన మూలం

మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి ఎర్రరక్తకణాల ఉత్పత్తికి బి 12 విటమిన్ తప్పనిసరి. ఈ విటమిన్ మనకు తక్కువగా ఉన్నట్లు అయితే కండరాల బలహీనత, నిస్సత్తువ, నీరసం, వణుకు, మాత్రమే ఆపుకోలేకపోవటం, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ మరీ తక్కువగా ఉన్నట్లయితే రక్తహీనతకు దారితీస్తుంది. ఈ వాలగ చేపలు తిన్నట్లయితే మనం ఈ విటమిన్ సమృద్ధిగా పొందవచ్చు. ఈ విటమిన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను గురించి వైద్యులను అడిగి తెలుసుకోవాలి.

అన్ని చేపలలో( valuga fish) మాదిరిగానే వాలగ చేపలలో కూడా అన్ని రకాలైన ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతున్నాయి. కేవలం చేపల గురించి మాత్రమే ప్రత్యేకంగా వివరిస్తున్న మన ఆర్టికల్స్ లో ఇతర చేపల గురించి కూడా చదివి వాటి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకో గలరని ఆశిస్తున్నాను.

అప్రయోజనాలు

ఈ చేపలు ఎక్కువగా నదులలోను, కాలవలోను నివసిస్తూ ఉన్నందువలన పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు, పాదరసం మొదలైన వాటిని ఆహారంగా తీసుకోవచ్చు. ఏ చేపలనైనా వంట చేసుకునేటప్పుడు ఎక్కువ వేడిలో వంట చేసుకోవడం మంచిది. ఈ చేపలను మాత్రమే కాకుండా అన్ని రకాల చేపలను కూడా ఎక్కువ వేడి నీటిలోనే వంట చేసుకోవాలి. అందువలన ఈ చేపలలో ఉండే పాదరసం విరిగి పోయే అవకాశం ఉంది. ఇతర ఆహార పదార్థాల కంటే ముఖ్యంగా చేపల ద్వారా పాదరసం మానవ శరీరం లోనికి 70 శాతం వరకు ప్రవేశిస్తుందని నిపుణులు కనుగొన్నారు. ఈ పాదరసం నాడీ మండల వ్యవస్థ, మెదడు పనితీరును దెబ్బతీస్తుంది.

 

 

 

 

Related Posts

error: Content is protected !!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.