...

Eel fish in telugu and meaning in telugu

Eel fish in telugu and meaning in telugu

 

ఈల్ చేపను (Eel fish in telugu) ఆంగ్లంలో ఎలక్ట్రిక్ ఈల్స్ అంటారు. దీని శాస్త్రీయ నామం “ఎలెక్ట్రోఫోరస్ ఎలక్ట్రికస్” మరియు స్పైనీ ఈల్స్ , డీప్ సీ స్పైనీ ఈల్స్, వంటి కొన్ని ఇతర ఈల్ ఆకారపు చేపలకు కూడా ఈల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈల్ చేపలు ఉప్పు నీటిలోను మరియు మంచి నీటిలో కూడా నివసించ గలవు. ఈ చేపను(Eel fish in telugu) మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త దీని వినూత్నమైన షాకింగ్ గుణాన్ని కనిపెట్టి ఆయన చేసిన అధ్యయనాల ప్రకారం దీనికున్న అపురూపమైన శక్తిని గురించి బయట ప్రపంచానికి తెలియజేశారు ఆయనే “థియోడర్ నికోలస్ గిల్“ఆయన ఈ చేపను గురించి చేసిన అధ్యయనాల పుస్తకాల నుండి ఈ చేప యొక్క లక్షణాలను మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

Eel fish in Telugu

ఈ చేపను తెలుగులో ములుగు చేప అని అంటారు

సాధారణంగా విద్యుత్ అనేది మన శరీరాల నుండి కూడా జనరేట్ అవుతుంది అనే విషయం మీకు తెలుసా! దీనిని శాస్త్రీయంగా ఎలక్ట్రిక్ ఆర్గాన్ డిశ్చార్జ్ అంటారు. అది మన శరీరంలో ఉండే లవణాలు రక్త ప్రసరణ ద్వారా జరుగుతుంది అయితే కాలక్రమంలో క్రమ క్రమంగా మన శరీరంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈల్ చేపలలో విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ పద్ధతినే “ఎలక్ట్రో రిసెప్షన్” అంటారు. ఈల్ చేప(Eel fish in telugu) తన మెదడు కణాల ద్వారా తన శరీరంలో ఉండే పొటాషియం, సోడియం లవణాలును జాడ్ చేసి తనతోక భాగంలో ఉండే బలమైన కండరాలు ద్వారా ఇది విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా సామాన్యమైన ప్రక్రియ.

ఈల్ చేపల వేట విధానం

  • ఈ చేపల్లో మూడు రకాల ఓల్టేజ్ ఆర్గాన్స్ ఉంటాయి.
  • మొదటి రెండు అవయవాలు తక్కువ ఓల్టేజి ప్రసరిస్తూ పరిసరాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
  • మూడవ ఆర్గాన్ ఎక్కువ వోల్టేజి ప్రసరించగల శక్తిని కలిగి ఉంటుంది. ఈ మూడవ అవయవాన్ని మాత్రం శత్రువులు తనపై దాడికి వచ్చినప్పుడు మరియు ఆహారాన్ని వేటాడటానికి ఉపయోగిస్తుంది.
  • ఇవి శత్రువుల నాడీమండలంపై ప్రభావాన్ని చూపి వాటి యొక్క కండరాలను కూడా నియంత్రిస్తుంది.
  • ఈ చేప దూరం నుండి శత్రు జీవాలను ఒక రిమోట్ వలె అదుపులోకి తీసుకుంటుంది.
  • వాండర్ బిల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఈ కొత్త సంగతిని కనిపెట్టారు.
  • ఈల్ చేపలలో ఎలక్ట్రిక్ షాక్ ను ఉత్పత్తి చేసే వ్యవస్థను గమనించినప్పుడు ఈ విషయం బయటపడింది. ఆధునిక కెమెరాలను, విద్యుత్ ఉత్పత్తిని పసిగట్టే సున్నితమైన పరికరాలను వాడి ఈ కొత్త విషయాలను కనుగొన్నారు.

ఈల్ చేపల ప్రత్యేకత

  • పెద్ద ఈల్ చేప12 బలుపులు వెలగడానికి అవసరమైన విద్యుత్ ని విడుదల చేస్తుందనికనుగొన్నారు.
  • చేపల లో దాదాపు ఆరు వేలకు పైగా ఎలక్ట్రిక్ కణాలు ఉంటాయి. ఈ కణాలు విద్యుత్తునుఉత్పత్తి చేస్తాయి. ఒక్కొక్క కణం 0.1 ఓల్టేజ్ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు.
  • ఈ చేప దాదాపు650 volts వరకు కరెంటు ఉత్పత్తి చేయగలదు. ఈఓల్టేజ్ కి పెద్ద పెద్ద గుర్రాలు సైతం కిందపడి గిలగిలాకొట్టుకుంటూయి.
  • దక్షిణ అమెరికా ప్రాంతంలోనిఅమెజాన్, ఓరినాకో ప్రాంతాలలోని చెరువులలోనదులలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దక్షిణాఫ్రికాప్రాంతంలో తాజాగా ఒక ఈల్ చేప 860 ఓల్టేజ్ లవిద్యుత్ ను విడుదల చేసిందని నూతనంగాకనుగొన్నారు.
  • దాదాపుగా 250 రకాలకు పైగా చేపలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఈల్ చేప మాత్రమే తమ ఆహారాన్ని స్తంభింప చేయడానికి, శత్రువులుపై దాడి చేయడానికి విద్యుత్ ఉపయోగిస్తుంది.
  • కొన్ని రకాల ఈల్ చేపలు 50 కార్లను స్టార్ చేయగల విద్యుత్ శక్తిని కూడా విడుదల చేస్తాయి అని కనుగొన్నారు.
  • ఎక్కువగా మట్టి నీళ్ళలో ఉండే ఈ చేపలు ప్రతి 10 నిముషాలకు ఒకసారి బయటకు వస్తాయి ఎందుకంటే ఇవి శ్వాస తీసుకుని జీవించే చేపలు.
  • ఈ ఎలక్ట్రికల్ ఈల్ చేపలనే కాకుండాకొన్నిఉభయచరాలను, పక్షులను కూడాతింటుంది.
  • ఇవి శ్వాస ద్వారా జీవించే చేపలుఅందువల్లనే తరచుగా నీటిలో నుండి బయటకు వచ్చి గాలిని పీల్చుకుంటూ ఉంటాయి.
  • వీటి కంటిచూపు మందంగా ఉంటుంది. విమానాలు ఓడలు రాడార్లసహాయంతో ఏవిధంగా అయితే వాటి లక్ష్యం యొక్కదూరాన్ని తెలుసుకుంటాయో, ఈల్ చేప విద్యుత్ప్రవాహాన్ని వెలువరించి విద్యుత్ విస్తరించినటువంటి క్రమాన్ని బట్టి ఆయా వస్తువుల స్థానాలనుతెలుసుకుంటుంది.
  • సగటున ఈల్ చేప(Eel fish in telugu) పొడవు 8అడుగుల వరకు ఉంటుంది. బరువు 20 కేజీల వరకుఉంటుంది.
  • ఈ చేప యొక్క సగటు ఆయుర్దాయం 15సంవత్సరాలుగా ఉంటుంది.
  • ఇది(Eel fish in telugu) పొడవుగా చూడడానికి పామువలె ఉంటుంది.
  • ఈ చేపలు వలనమనుషులకు జంతువులకు ప్రమాదం పొంచి ఉందివీటి షాక్ తగిలి ఎంతో మంది హార్ట్ ఎటాక్ కుగురిఅయినారు.

 

 

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.