...
koramenu fish

Koramenu fish and koramenu fish nutrition facts  

 

Koramenu fish and koramenu fish nutrition facts

మన తెలుగులో కొరమేను చేప అని చెప్పుకునే ఈ చేపను ఇంకా బురద మట్ట, మట్ట గుడిసె అని వివిధ రకాలుగా కూడా ఆయా ప్రాంతాలలో పిలుస్తారు. ఇది ఒక మంచి నీటి చేప. చిన్న చిన్న కాలువలలోను గుంటలలోను చెరువుల లోనూ ఎక్కువగా పెరుగుతుంది. ఇది బలముగాను హుషారుగాను ఉంటుంది. నీటిలో నుండి బయట వేసిన తర్వాత మిగిలిన చేపల వలే అంత త్వరగా చనిపోదు. దక్షిణాసియా ప్రాంతంలోను ఆగ్నేయాసియా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఈ చేప యొక్క శాస్త్రీయ నామం చెన్నాస్ట్రయేటా మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ చేపను రాష్ట్ర చేపగా ప్రకటించింది.

Koramenu fish

తెలుగులో కొరమేను చేప అని పిలిచే ఈ చేపను ఆంగ్లంలోMurrel fish అంటారు.

ఈ చేప దాదాపుగా ఒక మీటరు పొడవు వరకు పెరుగుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నప్పటికీ ముఖ్యంగా దక్షిణ చైనా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నది. ఈ చేపలు తెల్లటిచేపలు నల్లటి చేపలు అని రెండు రకాలుగా ఉన్నాయి. తెల్ల వాటికంటే నల్లటి చేపలుకు ఎక్కువ గిరాకీ ఉన్నది. మిగిలిన మంచినీటి చేపల తో పోల్చి చూసినట్లయితే ధర రెండు మూడు వందల రూపాయలు ఎక్కువగానే ఉంటుంది. మంచినీటి చేపల లో ఈ చేపల కూర రుచికి చాలా బాగుంటుంది. దీని తల మీద వీపు మీద నల్లటి మసకబారిన చారలువంటివి ఉంటాయి. ఈ చేపలు మన ప్రక్కనే ఉండే చిన్నచిన్న కాలువలలోను, చెరువులలోను పొలాల్లోని నీళ్లలోనూ ఉంటాయి. ఒకవేళ నీళ్లు తక్కువగా ఉండి బురద బురదగా ఉన్నప్పటికీ కూడా ఈ చేపలు నిక్షేపంగా బ్రతక గలవు అందుకనే ఈ చేపలను బురద మట్టలు అని కూడా అంటారు.

Koramenu fish images

Murrel fish in telugu
Murrel fish in telugu

"<yoastmark

"<yoastmark

 Koramenu fish nutrition facts

కొరమేను చేపలు చాలా మంచి ప్రోటీన్లను, పోషకాలను మనకు అందిస్తాయి. గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడే వారు ఈ చేపలను తినడం వలన వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. కొరమేను చేపల లో 18 నుండి 20 శాతం వరకు మాంసకృతులు ఉంటాయి. కొరమేను చేపల మాంసకృత్తులు తేలికగా అరుగుతాయి. ఈ చేపల మాంసకృత్తులలో మనకు 8 రకాలైన అమినో ఆసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం ఉన్న లైసిన్,మిధియోనిన్ ,సిస్టీన్, అమైనో యాసిడ్లు పుష్కలంగా  లభిస్తాయి అని కనుగొన్నారు. కొరమేను చేపలలో క్రొవ్వు వాటి యొక్క వయస్సును బట్టి 0.25 శాతం నుండి 20 శాతం వరకు ఉంటుంది. అయితే ఈ క్రొవ్వు మనకు చాలా మంచిది,పోలి అన్శాచురేటెడ్ ఫ్యాటి యాసిడ్స్ ఈ చేపల్లో ఉన్నాయని కనుగొన్నారు.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

  • కొరమేను ( koramenu fish images) చేపలలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల పెరుగుదలకు చాలా మంచిది అని కనుగొన్నారు.
  • ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది మరియు గర్భంలో ఉండే శిశువుల మెదడు పెరుగుదలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొన్నారు.
  • కొరమేను చేపలను తినడం వలన నెలలు నిండకుండానే ప్రసవించే పరిస్థితులను కూడా అధిగమించవచ్చు అని వైద్యులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలను వైద్యులను అడిగి తెలుసుకుందాం.

విటమిన్స్

  • ఈ చేపలక క్రోవ్వు ద్వారా మనకు బి, ఈ, డి, కె, విటమిన్లు సమృద్ధిగా అందుతాయి.
  • సూక్ష్మ పోషకాలైన విటమిన్ డి విటమిన్ఎ కొరమేను చేపల లో పుష్కలంగా అందుతుంది.
  • థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు ఈ కొరమేను చేపలలో పుష్కలంగా ఉన్నాయి అని కనుగొన్నారు.
  • ఆకుకూరల్లో లభించే విటమిన్ ఎ కంటే కొరమేను చేపల ద్వారా లభించే విటమిన్ ఎ మన శరీరానికి సులభంగా అవుతుంది.
  • విటమిన్ ఎ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది.
  • మనకు ఆహారంలో లభించే కాల్షియం మన శరీరం గ్రహించాలి అంటే మనకు విటమిన్-డి అవసరం ఉంటుంది.
  • కొరమేను koramenu fish చేపలు లో ఉండే థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు ఆహారంలో ఉన్న శక్తిని ఉపయోగించుకోడానికి దోహదపడతాయి. తాజా కొరమేను చేపలను తిన్నప్పుడు అందులో మనకు విటమిన్ సి కూడా లభిస్తుంది.

ఖనిజాలు

  • సముద్రపు చేపల్లో మనకు అయోడిన్ పోషకం పుష్కలంగా లభిస్తుంది.
  • అయోడిన్ లోపించడం వలన మనకు గాయిటర్ అనే వ్యాధి వస్తుంది.
  • అయోడిన్ మన మెదడు పెరుగుదలకు దోహదపడుతుంది అయోడిన్ లోపించినట్లు అయితే మనలో మానసిక పరిపక్వత కూడా లోపిస్తుంది.
  • చేపల్లో ఇనుము, జింకు, భాస్వరం, ఫ్లోరిన్, క్యాల్షియం మొదలైనవి బాగా ఉపయోగపడే రూపాలలో లభిస్తాయి అని కనుగొన్నారు.
  • చిన్న చిన్న చేపలను వాటి ముళ్ళతో కూడా మనం తిన్నట్లయితే కాల్షియం, భాస్వరం, ఐరన్ ఎక్కువగా లభిస్తాయి. ముళ్ళను తీసేసి తిన్నట్లయితే ఇవి అందవు.
  • మన రక్తం ఆరోగ్యకరంగా ఉండటానికి హిమోగ్లోబిన్ అవసరం మన శరీరంలో హిమోగ్లోబిన్ను అభివృద్ధి చేయగలిగేది ఐరన్ మాత్రమే కొరమేను చేపల ద్వారా ఐరన్ మనకి లభిస్తుంది.

కొరమేను చేపలతో వైద్యం

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో బత్తిన సోదరులు ప్రతియేటా మృగశిర కార్తె రోజున చేపమందు పంపిణీ చేస్తున్నారు. ఈ మందులో వాళ్లు కొరమేను చేప( koramenu fish)పిల్లలనే వాడుతున్నారు. కాబట్టి కొరమేను చేప పిల్లల ద్వారా ఉబ్బసం వ్యాధిని నయం చేయవచ్చు అన్న విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం, మత్స్య శాఖ ద్వారా కొరమేను చేప పిల్లలను వారికి అందించడం జరుగుతుంది.ఉబ్బసం వ్యాధికి బత్తిన సోదరుల వైద్యం మనదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచింది అని మనకు అందరికీ తెలుసు.

ఇప్పుడు రైతులు కాలువలలోనూ పొలాలలోను గుంటలు తీసి ప్రత్యేకంగా కొరమేను( koramenu fish) చేప పిల్లలను వాణిజ్యపరంగా పెంచుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచినీటి చేపల లో మన గోదావరి జిల్లాలో లభించే పులస చేపల తర్వాత ఈ కొరమేను చేపలు ఎక్కువ ధర పలుకుతున్నాయి. వీటి ధర సుమారుగా 400 నుండి 600 రూపాయల మధ్య ఉంటుంది. మిగిలిన సముద్రపు, మంచినీటి చేపల మాదిరిగానే కొరమేను( koramenu fish) చేపల ద్వారా కూడా అన్ని రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతున్నాయి. ఇతర చేపల ద్వారా మనకు లభిస్తున్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం బ్లాగు లోని ఇతర ఆర్టికల్స్ ను కూడా పరిశీలించండి.

Related Posts

error: Content is protected !!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.