...

Seer fish in telugu and seer fish health benefits

Seer fish in telugu and seer fish health benefits

సీర్ చేపలు (seer fish in telugu) స్కాంబ్రీడే కుటుంబానికి చెందినటువంటివి.స్కాంబ్రీడే కుటుంబంలో ట్యూనా, బోనిటో చేపలు కూడా ఉన్నాయి. సీర్ చేపలు ట్యూనా చేపల కంటే చాలా చిన్నవిగా మరియు సన్నగా ఉంటాయి. అయితే ఆహార ప్రయోజనాల విషయంలో మిగిలిన అన్ని చేపల వలె అన్ని పోషకాలను కలిగి ఉంటాయి. ఈ చేపలలో దాదాపుగా 21 రకాల చేపలు ఉన్నాయని గుర్తించారు. ఈ చేపలు సమశీతోష్ణ మరియు ఉష్ణమండల ప్రాంతాలలోని సముద్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చేపలు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటాయి. ఈ చేపలు చాలా వేగంగా 5.5 మీటర్లు ఫర్ సెకండ్ ఈద గలవు.

ఈ చేపలు వాటి వీపు భాగంలో నల్లటి నిలువు చారలు మరియు ఎక్కువగా చీలినటువంటి తోకలను కలిగి ఉంటాయి. సీర్ చేపలు (seer fish in telugu) సముద్ర తీర ప్రాంతాలలోని మైదానాలకు వలస వెళ్లి లోతు తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలోనే గుడ్లు పెడతాయి. ఈ చేపలు 3 లక్షల నుండి 15 లక్షల వరకు గుడ్లు పెడతాయి అని కనుగొన్నారు. సీర్ చేపలు సముద్ర పక్షులకు, డాల్ఫిన్, సాల్మన్ చేపలకు ఎక్కువగా ఆహారంగా మారుతున్నాయి.సీర్ చేపల మాంసం లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్నాయని కనుగొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో కూడా ఈ సీర్ చేపలను(seer fish in telugu) ఉపయోగిస్తున్నారు. ఇది ఒక ఆయిల్ చేప కాబట్టి తక్కువ నూనెలోనే వంట చేసుకోవచ్చు. ఈ చేపల మాంసం త్వరగా చెడిపోతుంది కాబట్టి ఈ సీర్ చేపలను పట్టుకున్న రోజునే తినడం మంచిది, ఒకవేళ నిల్వ ఉంచాలి అనుకుంటే మంచి రిఫ్రిజిరేటర్ లేదా ఐస్ బాక్సులలో సరైన రీతిలో సక్రమంగా నిల్వ చేసుకొన వలసి ఉంటుంది.

Seer fish in telugu

సీర్ చేపలను(seer fish in telugu) మన తెలుగులో కనగర్తలు, కన్నంగదాత, కన్నంగడ్తి అనే పేర్లతో పిలుస్తున్నారు.

100 గ్రాముల చేపలు క్రింద పేర్కొన్నటువంటి పోషకాలు ఉన్నాయి.

క్యాలరీలు 858 kJ (205 kcal)
ప్రోటీన్లు 18. 60 గ్రాములు
క్యాల్షియం 12. మిల్లీగ్రాములు
ఇనుము 1. 63 మిల్లీగ్రాములు
మెగ్నీషియం 63. మిల్లీగ్రాములు
భాస్వరం 213. మిల్లీగ్రాములు
పొటాషియం 313. మిల్లీగ్రాములు
సోడియం 90. మిల్లీ గ్రాములు
జింక్ 0.63 మిల్లీగ్రాములు
నీరు 63.55 గ్రాములు

వీటితోపాటు విటమిన్ ఎ, డి లు కూడా ఈ సీర్ చేపలో మనకు లభిస్తాయి.
ఆధారం USDA

Health benefits of seer fish in telugu

  • సీర్ చేపలలో ఉండే ప్రోటీన్లు మన యొక్క జుట్టు సరిగా పెరగడానికి, గోళ్ళు సక్రమంగా, పెరగడానికి, కండపుష్టి కలగడానికి, హార్మోన్లు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగ పడతాయి.
  • మన ఫిట్నెస్ లెవెల్స్ అభివృద్ధి చెందడానికి ఈ ప్రోటీన్లు చాలా అవసరం. మనిషి యొక్క బరువును బట్టి ప్రతి కేజీకి ఒక గ్రాము ప్రోటీన్ అవసరం అవుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
  • మనకి అవసరమైనటువంటి పోషకాలలో క్యాల్షియం కూడా ఒకటి. ఈ కాల్షియం మన ఎముకలను దృఢంగా ఉంచడానికి, రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి కూడా కాల్షియం ఉపయోగపడుతుంది.
  • అయితే కాల్షియం ఎక్కువ తీసుకున్న తక్కువగా తీసుకున్న కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది, కనుక కాల్షియం తగినంత మోతాదులోనే తీసుకోవాలి దీనికి మనం మన వైద్యులను సంప్రదించి వలసి ఉంటుంది.
  • సీర్ చేపలలో(seer fish in telugu) ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది అంతేకాకుండా ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు కూడా ఆక్సిజన్ సక్రమంగా సరఫరా అయ్యేటట్లు చూస్తుంది.
  • మగవారికి అయితే 350 మిల్లీగ్రాములు ఆడవారికైతే 300 మిల్లీ గ్రాముల చొప్పున ప్రతిదినం మెగ్నీషియం అవసరమవుతుంది.
  • మన రక్తంలో ఉండే బ్లడ్ షుగర్ను శక్తిగా మార్చగల గుణం మెగ్నీషియంకు ఉన్నది.
  • మెదడు యొక్క పనితీరు సక్రమంగా ఉండాలి అన్నా,B6 విటమిన్ సక్రమంగా మన శరీరంలో పని చేయాలన్నా, ఎంజైముల పనితీరు సరిగా పని చేయాలన్నా, మనకు మెగ్నీషియం అవసరం సీర్ చేపలను తినడం ద్వారా మనం మెగ్నీషియం పొందవచ్చు.
  • ఈ చేపల్లో మనకి పొటాషియం కూడా లభిస్తుంది. పొటాషియం లోపిస్తే మనకు ఎక్కువగా అలసట అనిపిస్తుంది ఎంత నిద్ర పోయినప్పటికీ కూడా నీరసంగా కళ్ళు మూతలు పడుతున్నట్లు అనిపిస్తుంది.
  • పొటాషియం లోపించినప్పుడు పిక్క కండరాలు కూడా పట్టేసినట్లు ఉంటాయి. అయితే కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా ప్రకారం మాత్రమే పొటాషియంను తీసుకోవలసి ఉంటుంది.
  • సీర్ చేపలను(seer fish in telugu) తినడం ద్వారా మనం జింక్ కూడా పొందవచ్చు. మనలో జింకు లోపించినప్పుడు మన తల వెంట్రుకలు రాలుతుంటాయి.
  • చుండ్రు కూడా వస్తుంది పిల్లలలో ఎదుగుదల సరిగా ఉండదు.
  • జింకు లోపం వలన పురుషులలో టెస్టోస్టిరాన్ సమస్యలు కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది ఈ సమస్యలన్నింటిని సీర్ చేపలను తినడం ద్వారా పరిష్కరించుకోవచ్చు.
  • చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి రక్తం రక్తనాళాలలో సాఫీగా ప్రసరించేట్టు చేస్తుంది.
  • అందువలన గుండె సంబంధమైన వ్యాధులు అరికట్టవచ్చు, మతిమరుపును కూడా నివారించవచ్చు.

Seer fish in telugu disadvantages

  • ఈ చేపలు ఎక్కువగా సముద్రతీర ప్రాంతాలలో నివసించడం వలన నదుల నుండి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు, పాదరస లను ఆహారంగా తీసుకుంటున్నాయి.
  • పాదరసం చేపల ద్వారా మన శరీరం లోనికి ప్రవేశించే అవకాశం ఉంద పాదరసం మన నాడీ మండలం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.

Related Posts

error: Content is protected !!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.